మేజర్ సినిమా మీద హీరో అడవి శేషుకు బాగా హోప్స్ ఉన్నాయి… గూఢచారి సక్సెస్ తరువాత ఎవరు సినిమా పెద్దగా ఆడకపోయినా… ఇప్పుడు రిలీజుకు సిద్ధంగా ఉంది మేజర్ సినిమా… మహేష్ బాబు కూడా దీనికి ఆర్థికంగా అండగా నిలిచాడు… ఫుల్లు ప్రమోషన్ వర్క్ నడుస్తోంది… టీవీ షోలలోకి, చాటింగుల్లోకి శేషు స్వయంగా వెళ్తూ ప్రమోట్ చేసుకుంటున్నాడు… ఇది ఓ రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కాబట్టి సహజంగానే కాస్త ఆసక్తిని క్రియేట్ చేస్తోంది…
బెంగుళూరులో స్థిరపడిన ఓ మలయాళీ కుటుంబంలో పుట్టాడు ఉన్నికృష్ణన్… తండ్రి ఇస్రోలో చేసేవాడు… మిలిటరీ ఆఫీసర్‌గా పలు హోదాల్లో పనిచేసి, ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదులతో పోరాడుతూ గాయపడి మరణించాడు… శేషు ఇష్టపడి చేసిన సినిమా ఇది… అప్పుడెప్పుడో అమెరికా నుంచి వచ్చి, 2002 నుంచీ ప్రయత్నిస్తుంటే… 2018లో గూఢచారి తనకు పేరు తీసుకొచ్చింది… హీరోను చేసింది… కొన్ని సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్ర అని చెప్పి, తనకు కొన్ని సెకండ్లు మాత్రమే కనిపించే పాత్రలు ఎలా ఇచ్చారో కూడా శేషు ఈమధ్య నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు…
ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోలోకి ప్రమోషన్ కోసం వచ్చాడు శేషు… తనతోపాటు శోభిత కూడా… (సినిమాలో సాయి మంజ్రేకర్ కూడా నటించింది…) వచ్చే నెల మూడున హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు దీనిని… సినిమా గురించి సంక్షిప్తంగానే చెప్పిన శేషు ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్పాడు… ఆల్‌రెడీ ఈ సినిమాను హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, వైజాగ్ కేంద్రాల్లో సీక్రెట్ స్క్రీనింగ్ ద్వారా 1700 మందికి చూపించారట… ఢిల్లీ, ముంబై హిందీ మార్కెట్ కోసం.. హైదరాబాద్ తెలంగాణ కోసం… వైజాగ్ ఏపీ కోసం…
Ads
‘‘సాధారణంగా సినిమా రిలీజ్ అవుతున్నదంటే అందరమూ టెన్షన్, నెర్వస్‌లో ఉంటాం… డ్రైవ్స్ వెళ్లాయా..? ఆర్ఆర్ అయిపోయిందా..? మిక్స్ పూర్తయిందా..? వంటి ఫినిషింగ్ వర్క్ బిజీ ఉంటుంది… కానీ మేమయితే ఇప్పుడు కాన్ఫిడెంటుగా ఉన్నాం… సినిమా రిలీజయ్యాక మీ అందరి అభిమానం నాలుగు రెట్లు పెరుగుతుందనే నమ్మకం ఉంది… ఎందుకంటే ఆల్‌రెడీ మేం సీక్రెట్ స్క్రీనింగ్ చేశాం కాబట్టి, ఫీడ్ బ్యాక్ మంచిగా ఉంది కాబట్టి…’’ అని షేర్ చేసుకున్నాడు తను… ఈ సినిమా రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ గతంలో హైదరాబాద్ కంటోన్మెంట్‌లో కెప్టెన్‌గా ఉండేవాడని కూడా వెల్లడించాడు…
ఇక సీక్రెట్ స్క్రీనింగ్ విషయానికి వస్తే… కొన్ని సినిమాలకు నిర్మాతలు పాటించే పద్ధతే ఇది… ప్రివ్యూ షోలలో ఇదోతరహా… దీన్నే లిమిటెడ్ రిలీజ్ అని కూడా అంటుంటారు… ఆ లెక్కన మేజర్ partly రిలీజ్ అయిపోయినట్టే… సెలెక్టెడ్ పీపుల్‌ను మాత్రమే పిలిచి షోస్ వేస్తారు… జెన్యూన్ ఫీడ్ బ్యాక్ అడుగుతారు… సినిమా కథ, ఇతర వివరాలను కూడా వాళ్లు రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది… సోషల్ మీడియాలో రివ్యూలు ముందే గీకి పారేయొద్దు కూడా…! మొన్నటి 24న ఈ లిమిటెడ్ రిలీజ్ అయిపోయింది… ఫీడ్ బ్యాక్ బాగున్నట్టుంది… అందుకే టీం కాన్ఫిడెంటుగా కనిపిస్తోంది… బెస్టాఫ్ లక్ శేషు..!!
https://twitter.com/AdiviSesh/status/1530170088300482571?t=ajfga9NTh0RY7aNjovVDEw&s=19
ప్రి రిలీజ్ ఫంక్షన్ కూడా వైజాగ్ లో డిఫరెంట్ గా ప్లాన్ చేశారు… సినిమా చూపించి ఫంక్షన్ చేస్తారట… శేషు ట్వీటాడు… ఇంటరెస్టింగ్…
Share this Article