Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…

June 2, 2021 by M S R

ముందుగా ఈ ప్రేమకథను సంక్షిప్తంగా, సూటిగా చదవండి… విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్‌ 2010 ఇంజనీర్ కోర్స్ పాసవుట్… 2015లో బెంగుళూరులోని హూవాయ్‌ టెక్నాలజీస్‌లో కొలువు… తనతో పాటు పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతితో పరిచయం… కొద్దిరోజుల్లోనే ఆమెకు ఢిల్లీలో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయింది… అప్పటికే ఆమెపై మనసు పారేసుకున్నాడు ప్రశాంత్‌… ఉద్యోగం పక్కన బెట్టి, ఆ యువతి జాడ కోసం, మనసులోని మాట చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆశ్రమాల్లో అక్కడక్కడా ఉంటూ ఆ యువతి జాడ కోసం తిరిగాడు… మధ్యప్రదేశ్‌లో ఆమె కుటుంబం చిరునామా తెలుసుకుని… ఆమె తల్లిదండ్రులను కలిశాడు. ఆమెకు  స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో వెళ్లిపోయిందని వారు చెప్పారు… తమ కుమార్తె వెంట పడవద్దని వేడుకున్నారు… హైదరాబాద్‌కు వచ్చాడు. 2016లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కానీ ఆ యువతిని మాత్రం మర్చిపోలేక పోయాడు.

ఎలాగైనా, ఎంత కష్టమైనా తాను ప్రేమించిన యువతిని కలుసుకోవడం కోసం స్విట్జర్లాండ్‌కు ఎలా వెళ్లాలో రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నాడు. మొత్తం దూరం 8700 కిలోమీటర్లు అని… నడిచి వెళ్లడానికి 70 రోజులు పడుతుందని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు… చివరకు 2017లో పర్సు, ఫోన్ ఇంట్లోనే పడేసి, సికింద్రాబాదులో రైలు ఎక్కాడు… టికెట్టు లేకుండా…  చివరికి.. 2017 ఏప్రిల్‌ 11న ఉదయమే ఆఫీసుకు అని చెప్పి వెళ్లాడు. వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్‌ ఇంట్లోనే పడేసి వెళ్లిపోయాడు… రాజస్థాన్‌లోని బికనీర్‌లో దిగాడు… కాలినడకన థార్‌ ఎడారి గుండా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, కజకిస్థాన్‌, ఇరాన్‌ తదితర దేశాల మీదుగా స్విట్జర్లాండ్‌ చేరుకోవాలన్నది అతడి ప్లాన్‌… కాలినడకన బయల్దేరాడు… పాకిస్థాన్‌ సరిహద్దు వచ్చింది. చేతిలో వీసా, ఇతర ధ్రువపత్రాలు లేవు కాబట్టి… ఇనుప ముళ్ల కంచె మీద నుంచి దూకి పాకిస్థాన్‌లో ప్రవేశించాడు… 40 కిలోమీటర్లు నడిచి వెళ్లి బాగా దాహం వేసి, ఒక గుడిసె వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు…

సరిహద్దు వద్ద ఫెన్సింగ్‌ను పరిశీలించిన పాక్‌ సైనికులకు అక్కడ ఒక షర్టు క్లాత్‌ చిక్కుకున్నట్లు గుర్తించారు. ఎవరో ఫెన్సింగ్‌ దూకి పాక్‌ భూబాగంలోకి అక్రమంగా చొరబడ్డారని వారికి అర్థమైంది. ఎడారిలో అడుగుల గుర్తుల ఆధారంగా అనుసరించగా… ప్రశాంత్‌ ఓ గుడిసెలో సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు… అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. దాహం తీర్చారు. ఆ తర్వాత ఆర్మీ అధికారుల కస్టడీకి ఇచ్చారు. గూఢచారి అనే అనుమానంతో వారు అతణ్ని జైల్లో ఉంచి విచారించారు… తాను ఎందుకు వచ్చిందీ చెప్పినా సరే వదిలిపెట్టలేదు…

Ads

పాక్‌ ఆర్మీ చెరలో ఉన్న ప్రశాంత్‌ రోజూ వారితో పాటు కలిసి భోజనం చేసేవాడు… క్రమంగా వారికి… ప్రశాంత్‌ తీవ్రవాది కాదని, నిజంగానే ప్రేమ కోసం బయల్దేరిన అమాయకుడని అర్థమైంది… దీంతో వారు అతడితో ప్రేమతో మెలిగేవారు. ప్రశాంత్‌ సైతం వారు చెప్పినట్లు నడుచుకునేవాడు. ఈ క్రమంలోనే… 2019 నవంబర్‌లో ఓ ఆర్మీ అధికారి ‘‘నువ్వు త్వరగానే ఇండియాకు వెళ్లిపోతావులే’’ అని ధైర్యం చెప్పాడు. ‘‘నేను పాకిస్థాన్‌ ఆర్మీ చెరలో ఉన్నాను…’’ అంటూ ప్రశాంత్‌తో తెలుగులో చెప్పించి, వీడియో తీశాడు… ఆ వీడియో భారత్‌లోని టీవీ ఛానళ్లలో వచ్చేలా చేశాడా ఆర్మీ అధికారి… తెలంగాణలో ఉన్న ప్రశాంత్‌ తల్లిదండ్రులు ఆ వీడియోలో ఉన్నది తమ కుమారుడే అని గుర్తించి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కలిశారు. దాంతో 2019 నవంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం (కేంద్ర హోం శాఖ, విదేశాంగ శాఖ) సహకారంతో ప్రశాంత్‌ విడుదల కోసం ప్రయత్నించారు.

ప్రశాంత్‌ వీడియో బయటకు రావడంతో… పాక్‌ ఆర్మీ అధికారులు అతణ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత మే-31న ప్రశాంత్‌ను పాక్‌ అధికారులు విడుదల చేస్తున్నట్లు ఇండియన్‌ ఎంబసీకి సమాచారం ఇచ్చారు. ప్రశాంత్‌ విడుదలవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు పంజాబ్‌ రాష్ట్రం అటారి వద్దకు వెళ్లారు. ప్రశాంత్‌ను అక్కడికి తీసుకొచ్చిన పాక్‌ అధికారులు అతణ్ని భారత అధికారులకు అప్పగించారు… ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, ప్రశాంత్ సోదరుడికి అప్పగించారు…  ప్రత్యేక వాహనంలో ప్రశాంత్‌ను విశాఖకు తరలించారు…………… ఇదీ కథ… మొత్తం మీడియాలో కనిపించిన, వినిపించిన కథ ఇదే…

love story

ఇక్కడ తెలంగాణ పోలీసులను ఖచ్చితంగా అభినందించాల్సిన విషయాలున్నయ్… 1) విదేశాంగ శాఖతో మంచి సమన్వయం చేసుకుని, పాకిస్థాన్ సరిహద్దుల దాకా వెళ్లి, ప్రశాంత్‌ను తీసుకొచ్చి, తన సోదరుడికి అప్పగించడం… ఎక్కడెక్కడో వేరే దేశాల్లో బతికే మనవాళ్లకు ఓ భరోసా, ఏదైనా సమస్య వస్తే మన పోలీసులు రెస్క్యూకి వస్తారనే ఓ నమ్మకం కలగడానికి ఇది ఉపయుక్తం… ఆ చొరవకు, ఆ ప్రయత్నానికి అభినందనలు… 2) ఆ అమ్మాయి ఐడెంటిటీని ఏమాత్రం బయటపెట్టకపోవడం… ఆ వివరాలు గనుక ఏమాత్రం చెప్పినా ఇప్పటికే యూట్యూబ్ చానెళ్లు, మీడియా ఆమెను బజారుకు లాగేవి… ఈ సెన్సిటివిటీని గుర్తించినందుకు తెలంగాణ పోలీసులకు రెట్టింపు అభినందనలు… ఇక ప్రశాంత్ కథలోకి వెళ్దాం… తెలుగు టీవీ సీరియల్‌లాగే తలాతోకా లేదు, లాజిక్కుల్లేవు, లింకుల్లేవు… ఇదొక సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… పాయింట్ల వారీగా ఆ డౌటనుమానాల్ని ఓసారి చెప్పుకుందాం… ఓ సినిమా రివ్యూలాగే…

  • తన సహోద్యోగి ఉద్యోగం మారితే, తను ప్రేమించిన వ్యక్తి వేరే కొలువుకు వెళ్లిపోతే… కొత్త కొలువు వివరాలు తెలియకపోవడం… ఢిల్లీకి వెళ్లి, ఆశ్రమాల్లో ఉంటూ ఆమె ఆచూకీ కోసం వెదకడం… సోషల్ మీడియా ఖాతాల్లో మెసేజ్ ఇవ్వడానికి దొరకలేదా ఆమె..?
  • మధ్యప్రదేశ్‌లో ఆమె పేరెంట్స్‌ను కనిపెట్టగలిగినవాడికి ఆమె వేర్ అబౌట్స్ తెలియలేదా..? వాళ్లు చెప్పారు, మా అమ్మాయి జోలికి రాకు అని… ఈ తిక్క కేసును సస్పెక్ట్ చేసినవాళ్లు ఆమె స్విట్జర్లాండ్‌ వెళ్లిపోయిందని ఎందుకు చెప్పారు..?
  • సరే, ఆమె కోసం వెళ్లాలనుకున్నాడు… స్విట్జర్లాండ్ వెళ్లడం పెద్ద కథా..? నేరుగా ఇక్కడ ఫ్లయిట్ ఎక్కి, అక్కడ దిగడమే కదా… అదేమీ కరోనా సీజన్ కాదు… ఏ ఆంక్షలూ లేవు… కాలినడకన వెళ్లడం ఏమిటి..?
  • పాకిస్థాన్, ఇరాన్, సిరియా, టర్కీల నుంచి వెళ్లడం అంటే….. సివిల్ వార్స్‌లో తన్నుకుంటున్న దేశాల్లో ఏ ఐడెంటిటీ లేకుండా, జేబులో రూపాయి లేకుండా ఎలా వెళ్లాలని అనుకున్నాడు..?
  • కామన్ సెన్స్ ఉన్నవాడెవడైనా సరే, తన ఐడెంటిటీ నిరూపించే కార్డో, పత్రమో వెంట ఉంచుకుంటాడు… పర్స్, ఇతర వివరాలు పారేసి, కాలినడకన వెళ్లాలని అనుకోవడం ఏమిటి..? చదువుకున్నవాడేనా..?
  • పాకిస్థాన్ సరిహద్దు కంచెను దూకడం ఏమిటి..? (ఈనాడు కథనంలో చెప్పినట్టు) అక్కడక్కడా మూత్రం తాగి ప్రాణం నిలుపుకోవడం ఏమిటి..?
  • గూఢచర్య ఆరోపణలతో జైల్లో పారేసిన వ్యక్తితో జైలు అధికారులు కలిసి భోజనాలు చేయడం ఏమిటి..? ఓ తెలుగు వీడియో చేసి ప్రపంచానికి పరిచయం చేయడం ఏమిటి..? గూఢచర్య నిందితులతో పాకిస్థాన్ ఎలా వ్యవహరిస్తుందో తెలిపే కథనమేనా ఇది..?
  • అంత సహృదయులయితే పాకిస్థాన్ కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదట…? సరే, ఏదో జరిగింది, ఏడాది జైలు శిక్ష వేశారు, అనుభవించాడు… విడుదలయ్యాక ఎంబసీకి అప్పగించారు… సరే, పాకిస్థానీయులు సహృదయులు అంటూనే నాలాగే బోలెడు మంది అక్కడ ఉన్నారు, ప్లీజ్ విడిపించండి అని చెప్పడం ఏమిటి..?
  • స్విట్జర్లాండ్ వెళ్లి ఏం చెప్పాలి..? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలా..? అది చెప్పడానికి ఆమె సోషల్ ఖాతాలు సరిపోవా..? ఎలాగూ వన్ సైడ్ లవ్వే కదా… ఆమె ఎలా రియాక్టవుతుందో తెలియదు, ఐనా ఎందుకు వెళ్లాలనుకున్నాడు..? నడిచి నీ దగ్గరకు వచ్చాను ప్రియా అని చెప్పాలనుకున్నాడా..? అతి పెద్ద హిపోక్రటిక్ కథనం కాదా..?
  • పాకిస్థాన్ నుంచి వచ్చాడు సరే, క్వారంటైన్ చేశారా..? డీబ్రీఫింగ్ జరిగిందా..? అంత పెద్ద స్థాయిలో రచ్చ జరిగిన పైలట్ అభినందన్ పట్టుబడితేనే, వదిలేస్తేనే… రా, ఐబీ నాలుగైదు రోజులు శారీరక, మానసిక పరీక్షలు జరిపారు… ప్రశాంత్‌ను అంత తేలికగా వదిలేశారా..? ఇదేమైనా తెలుగు టీవీ సీరియల్ అనుకున్నారా..? ఏది తోస్తే అది జనం మీదకు రుద్దడానికి..?!
  • ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ పోలీసుల పాత్ర ఏమిటి..? మాకెందుకీ దరిద్రం అనుకున్నారా..? పైగా హైదరాబాద్ వచ్చాక వదిలేయొచ్చు కదా… ప్రత్యేక విమానంలో విశాఖకు పంపించడం ఏమిటి..?
  • ఉఫ్…. సారీ బ్రదర్స్…. ఇప్పటికే మనం బికనీర్ ఎడారి దాకా వచ్చేశాం… ఇక ఆపేద్దాం… మళ్లీ హైదరాబాద్ వాపస్ వచ్చేద్దాం… లేకపోతే దేశద్రోహం అవుతుంది… ప్రశాంత్ మానసిక స్థితి సరిగ్గా లేకుండా ఉండాలి, లేదంటే ఇంకేదో పెద్ద కథ ఉండాలి… ఐనా మరీ లోతుల్లోకి వెళ్తే అది జాతిద్రోహం అవుతుంది… ప్రశాంత్ ఏదో చెప్పాడు, మనం నమ్మాం అని కాదు… ఏదో ఉంది… మనకెందుకు..?! అన్నీ అబద్ధాలు అయితేనేం…. మనం రోజూ మీడియాలో చూసేవన్నీ నిజాలా ఏం..?!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions