Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రమ్యా రఘుపతీ..! నీ మొగుడు నాలుగో పెళ్లి చేసేసుకున్నాడట తెలుసా..?!

March 10, 2023 by M S R

ఒక పవిత్ర బంధం

రెండు మనసులు

మూడు ముళ్లు

ఏడు అడుగులు

మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు

– మీ #PavitraNaresh

……… అని సీనియర్ యాక్టర్ నరేష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు… ఓ వీడియో కనిపిస్తోంది… అందులో నరేష్, పవిత్ర పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఉంది… ఓహ్, వీళ్లిద్దరూ పెళ్లి చేసేసుకున్నారా అనిపించేలా ఉంది… అయితే ఇది నిజమేనా..? నరేష్ ఆమెను పెళ్లిచేసుకోవడం నిజమేనా..?

naresh pavitra

నరేష్‌కు ఇప్పటికి మూడు పెళ్లిళ్లయ్యాయి… మూడూ పెటాకులే… ఇప్పుడు పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్నాడు… కలిసే ఉంటున్నారు… ఆమెకు మొదటిది కాదు, అతనికీ మొదటిది కాదు… నరేష్ వయస్సు తక్కువేమీ కాదు… అరవయ్యేళ్లు… సరే, తనిష్టం, ఆమె ఇష్టం… ఏ అంశం వారిద్దరినీ కలిపిందనే చర్చ ఇక్కడ ముఖ్యం కాదు కానీ…

మూడో పెళ్లాం రమ్య… ఆమెతో చాన్నాళ్లుగా గొడవలున్నయ్… నా పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేసిందంటాడు నరేష్… పవిత్రను, నరేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బుక్ చేయాలని చూస్తుంది రమ్య… ఆమెకు విడాకులు ఇచ్చేశాడంటారు… కానీ కోర్టులో ఉందని అంటుంది ఆమె… నరేష్‌ను తేలికగా వదిలిపెట్టే చాన్సే లేదంటుంది ఆమె… సరే, ఇదంతా తెలుగు టీవీ సీరియల్ కథకు కాస్త ఎక్కువ… సినిమా కథకు తక్కువ…

మొన్నామధ్య పవిత్రను పెదాలపై ముద్దుపెట్టుకుంటూ మేం త్వరలో ఒక ఇంటి వారం అవుతున్నాం అని నరేష్ ఏదో ట్వీటాడు… ఈ వీడియో యాడ్ చేశాడు… ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అనిపించేలా ఈ తాజా వీడియో… దీని మీద నరేష్ కానీ, పవిత్ర కానీ అధికారికంగా ఏమీ మాట్లాడలేదు. మేం పెళ్లి చేసుకున్నాం అనే వాక్యం మాత్రం చెప్పడం లేదు… అయితే ఇద్దరూ తలంబ్రాలు పోసుకొని, జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పెట్టుకున్నట్టు, ఏడు అడుగులు నడుస్తున్నట్టు వున్న వీడియో మాత్రం బయటకి వచ్చింది…



Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗

ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏

మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g

— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023



ఇది నిజమైన పెళ్లే అయితే మాత్రం రమ్య ఊరుకోదు… తనతో ఏదీ తేలకముందే, విడాకుల కేసు కోర్టులో ఉండగానే నాలుగో పెళ్లి చేసుకుంటే… ఆమె బహుభార్యత్వం కేసు, గృహహింస కేసు, వేధింపుల కేసు, మోసగించిన కేసు, వ్యభిచారం కేసు గట్రా అన్నీ పెట్టేస్తుంది… ఈ అరవయ్యేళ్ల వయస్సులో కొట్లాడలేక కిందామీదా పడాల్సి వస్తుంది నరేష్… అబ్బే, ఇదంతా తూచ్… ఫేక్… ఏదో సినిమా ప్రమోషన్ అని చెప్పి తప్పించుకోవాలి… అందుకే ఎక్కడా మేం పెళ్లిచేసుకున్నాం అనే మాటే రావడం లేదు… పైగా నిజంగానే ఆ వీడియో ఏదో సినిమా సీన్‌లాగా కనిపిస్తోంది… నిజమైన పెళ్లిని ఎవడూ ఇలా షూట్ చేసి, ఇలా ఎడిట్ చేయడు…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మంటల్లో మరో యూరప్ దేశం… పటిష్ట ఆర్థికదేశాలు కావు, ఉత్త డొల్ల…
  • ‘‘ఆ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్లల్లో నేను భయం గమనించాను…’’
  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions