.
శబ్దం అంటే మ్యూజిక్ కంపోజర్ థమన్‌కు ప్రాణం… నిశ్శబ్దం అంటే అస్సలు పడదు… ఆ శబ్దం కూడా బాక్సులు పగిలేంత ఉంటేనే తనకు ఆనందం… బాలయ్య వంటి మాస్ హీరో, మాస్ కంటెంటు సినిమా దొరికితే మరింత పండుగ…
కాపీలు కొడతాడు, దొరికిపోతాడు కానీ మనసు పెడితే మంచి కంపోజరే… ఈరోజు థియేటర్లలోకి వచ్చిన శబ్దం సినిమాయే దానికి ఉదాహరణ… ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ బీజీఎం… పాటలు ఉత్త డొల్ల, వదిలేయండి… కానీ సీన్‌కు తగినట్టు బీజీఎం ఇచ్చి భలే ఎలివేట్ చేశాడు అనిపించింది… గతంలో కూడా ఈ దర్శకుడు అరివళన్‌కు థమన్ ఏవో సినిమాలకు మంచి బీజీఎం ఇచ్చినట్టు గుర్తు… గుడ్ వేవ్ లెంత్… శబ్దం సినిమాకు తనే అసలు హీరో…
Ads
గతంలో ఇదే దర్శకుడు, ఇదే హీరో వైశాలి అని సినిమా చేశారు… వాటర్ బేస్ హారర్… డిఫరెంట్ ప్రజెంటేషన్… ఇప్పుడు అదే టీం… కాకపోతే వాటర్ బదులు సౌండ్ బేస్ కంటెంట్… థ్రిల్లర్, హారర్… మనల్ని రొమాంటిక్ హారర్, కామెడీ హారర్, క్రైమ్ హారర్, మిస్టరీ హారర్ గట్రా పలు జానర్లు పలకరిస్తుంటాయి కదా… ఇదో తరహా హారర్…
సినిమాలో మరొక ఆకర్షణ… సిమ్రాన్, లైలా… ఒకరు 48 ఏళ్లు, మరొకరు 44 ఏళ్లు బహుశా… అప్పట్టో కొలబద్ధ అంటూ లైలా ఎగిరే పావురమా సినిమాలో అబ్బాయిల మనసులు చూరగొంది… నవ్వు ఆమె అందం… స్టిల్ ఈరోజుకూ… అంత వయస్సొచ్చినట్టుగా ఏమీ లేదు… అప్పట్లో ఒక్క మగాడు అంటూ ఉర్రూతలూగించిన సిమ్రాన్‌కు కాస్త ‘పెద్ద వయస్సు’ కనిపిస్తోంది దీంట్లో… (తమిళంలో అడపాదడపా చేస్తున్నారేమో గానీ తెలుగులో చాన్నాళ్లయింది వీళ్లు కనిపించక)…
ఇప్పుడు పాత తారల రీఎంట్రీల సీజన్ కదా… అప్పుడెప్పుడో మన్మథుడులో మెప్పించిన అన్షు అంబానీ మళ్లీ వచ్చింది… కాకపోతే సినిమా, ఆమె పాత్ర తేలిపోయాయి… ఆమని రెగ్యులర్ ఆర్టిస్టు అయిపోయింది… ప్రియమణికి గ్యాపే లేదు… ఇంద్రజ కూడా ఒకటీరెండు పాత్రలు చేసినట్టుంది ఈమధ్య…
శబ్దం సినిమాలో లైలా పాత్ర వోకే, సిమ్రాన్ సో సో… అసలు ఫిమేల్ మెయిన్ లీడ్ లక్ష్మి మీనన్… పర్లేదు… హీరో ఆది పినిశెట్టికి ఈ పాత్ర మంచినీళ్లు తాగినంత ఈజీ… సటిల్డ్ పర్‌ఫామెన్స్… కాకపోతే ఆత్మలు, దెయ్యాల హారర్ సినిమాలకు లాజిక్కులు పెద్దగా ఆలోచించం కదా… ఇదీ అంతే…
సీన్లు రాసుకున్న తీరు, కంటెంట్, హారర్ ఎలిమెంట్స్, ప్రజెంటేషన్ అన్నీ వైవిధ్యం… బీజీఎంతో సీన్లు ఎలివేటయ్యాయి… కానీ సెకండాఫ్ నుంచి కథ ఎటెటో వెళ్లిపోయి ఎక్కడో ముగుస్తుంది… ఫస్టాఫ్‌లో థ్రిల్ సెకాండఫ్ వచ్చేసరికి పలుచబడిపోయింది… ఒరిజినల్‌గా తమిళ మూవీ… తెలుగులోకి కూడా డబ్ చేశారు…
కథ కూడా అంత తేలికగా సగటు ప్రేక్షకుడి బుర్రకు ఎక్కదు… ఆది ఇందులో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్ర చేశాడు… ఈ కోర్స్ నిజంగానే ఉంది దేశంలో… ఈ సినిమా కథలో తను ఘోస్ట్ హంటర్… (ఆమధ్య నాగార్జున మెంటలిస్ట్ పాత్ర చేశాడు, ఆ ప్రొఫెషన్‌లో రాణిస్తున్నవాళ్లూ ఉన్నారు దేశంలో చాలామంది…)
భిన్నమైన కథావస్తువులు, భిన్నమైన ప్రజెంటేషన్ విషయంలో తమిళ సినిమా మన తెలుగు సినిమాకన్నా చాలా దూరం ముందుంది… ఆ దిశలో శబ్దం కూడా పర్లేదు… హారర్ జానర్ ఇష్టపడేవాళ్లకు నచ్చే వీలుంది..!
Share this Article