ఒక మంచి హెడింగ్ పెడితే 50 రూపాయలు… ఒక మంచి వార్తను పట్టుకోగలిగితే 100 రూపాయలు… ఇంటర్నల్ మీడియా మ్యాగజైన్ ‘ఈనాడు సమీక్ష’లో పేర్లు, అభినందనలు… ఛైర్మన్ పేరిట అభినందనలు… ఇవన్నీ ఈనాడులో వర్క్ కల్చర్‌ను డెవలప్ చేశాయి గతంలో… మిగతా పత్రికలు ఈనాడును చూసి చాలా వాతలు పెట్టుకున్నా సరే, ఇలాంటి మంచి లక్షణాల్ని అలవరుచుకోలేకపోయాయి… ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న అభినందన, ఓ చిన్న కానుక, ఓ చిన్న గుర్తింపు… ఏ ఆర్గనైజేషన్‌లోనైనా సిబ్బంది పనిసామర్థ్యాన్ని, కమిట్‌మెంట్‌ను పెంచుతుంది…
మీడియా మాత్రమే కాదు, మీడియా హౌజుల్లో ప్రమాణాలు, సంస్కారాలు కూడా వేగంగా పతనం అయిపోతున్నయ్… టార్గెట్ల వేధింపులు తప్ప మెచ్చుకోళ్ల శాలువాలు ఎక్కడివి..? పొగడ్తల పొగడదండలు ఎక్కడివి..? ఈ ఉపోద్ఘాతం దేనికీ అంటే… ఫేస్‌బుక్‌లో హఠాత్తుగా ఓ పోస్ట్… ఉక్రెయిన్ వెళ్లి రిపోర్టింగ్ చేసిన టీవీ9 భారతవర్ష రిపోర్టర్ అభిషేక్ ఉపాధ్యాయ్ పోస్ట్ అది… టీవీ9 యాజమాన్యం తన రిపోర్టింగ్‌కు అభినందిస్తూ ఏకంగా ఓ బొలెరో కారు ఇచ్చింది, కెమెరామ్యాన్‌కు ఓ సెలరియో కారునిచ్చింది… చాలా పెద్ద గుర్తింపు…
అంతేకాదు, ఆమధ్య బార్క్ రేటింగుల్లో టీవీ9 భారతవర్ష మంచి స్థానం పొందినందుకు ఓ హైఫై పార్టీ ఏర్పాటు చేశారు… పెద్దపెద్ద వాళ్లను పిలిచారు… మిగతా భాషల చానెళ్ల హెడ్లను పిలిచారు… హంగామా… అట్టహాసం… కానీ కలుక్కుమనిపించే విషయం చెప్పనా..? అదే ఉక్రెయిన్ కవరేజీకి వెళ్లిన టీవీ9 తెలుగు రిపోర్టర్ మహాత్మకు కనీసం మారుతి ఆల్టో ఇచ్చి ఉండకపోరు అనుకున్నాను… ఫాఫం, కిలో స్వీట్ పాకెట్ కూడా ఇవ్వలేదట… ఓ ఢిల్లీ ప్రింట్ మీడియా జర్నలిస్టు చెప్పిన సంగతే ఇది… పోనీ, హసీనా కూడా వెళ్లింది కదా, ఆమెకు ఏమైనా ఇచ్చి ఉంటారా..? తెలియదు..!! ఏమీ ఇచ్చి ఉండరు… తను కూడా టీవీ9 తెలుగు కదా…!!
Ads
నిజానికి టీవీ9 అన్ని భాషల చానెళ్లకు మాతృ సంస్థ టీవీ9 తెలుగు… రవిప్రకాష్ ఉన్నప్పుడు వ్యవహారాలన్నీ హైదరాబాద్ ఆఫీసు కేంద్రంగా సాగేవి… ఇప్పుడు కనిపిస్తున్న వివక్ష నిజంగా టీవీ9లో అడ్మినిస్ట్రేషన్ వేగంగా దెబ్బతింటోందని చెప్పే మరో ఉదాహరణ… సరే, దాన్ని వదిలేద్దాం… ఆమధ్య సమ్మక్క-సారలమ్మ జాతర జరిగిందిగా…
ఎప్పటిలాగే ఈనాడు వాళ్లు ఓ సప్లిమెంట్ బుక్ వేశారు, అయిదారు రోజుల ప్రత్యేక కవరేజీ ఇచ్చారు… అందరూ బాగానే కష్టపడ్డారు… చాలా చాలా పెద్ద మీడియా హౌజు కదా… వాళ్లకు ఇన్సెంటివ్ ఏమిచ్చారో తెలుసా..? తలా 1500… ఫాఫం, అది పోనివ్వండి… ముగ్గురు సిబ్బంది ఈనాడు డిజిటల్ పేరిట ఉన్నారు… వాళ్లకు ఆ ముష్టి కూడా దక్కలేదు… ఎందుకని..?
ఈనాడు డిజిటల్ పేరిట అపాయింట్ అయినవాళ్లు కాబట్టి ఇవ్వలేదట… నిజానికి ఆ సంస్థే జీతాల దోపిడీ కోసం, చాకిరీ కోసం… వాళ్లకు ఇచ్చే జీతాలే అరకొర, చేయించుకునే పని మాత్రం మిగతావాళ్లలాగే… చివరకు 1500 ఇన్సెంటివ్ ఇవ్వడానికి కూడా అంత పెద్ద ఈనాడుకు మనస్కరించలేదు… ఈనాడు కక్కుర్తి, దిక్కుమాలినతనం తలుచుకుంటేనే సిగ్గేస్తోంది… ఫాఫం, వారిలో ఇద్దరు బాగా హర్టయి లాంగ్ లీవ్‌లో వెళ్లారని ఎవరో అన్నారు… నిజమే, పెయిన్ అనుభవించేవాడికే అర్థమవుతుంది… ఈనాడు పెద్ద తలకాయలు సిగ్గుపడాలి…
మొన్నమొన్నటివరకు నంబర్ వన్ చానెల్‌గా ఉన్న టీవీ9… ఈరోజుకూ నంబర్ వన్ తెలుగు పత్రిక ఈనాడుల్లోనే ఈ గతి కనిపిస్తుంటే… ఇక దిక్కుమాలిన ఇతర మీడియా హౌజుల్లో పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు…!!
Share this Article