Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్రహ్మముడి తెలుగు టీవీ సీరియల్‌కు షారూక్ ఖాన్ ప్రమోషన్… ఇంట్రస్టింగు…

January 17, 2023 by M S R

ఒక తెలుగు టీవీ సీరియల్‌కు బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడైన షారూక్ ఖాన్‌తో ప్రమోషన్..! మీరు చదివింది నిజమే… ఈ శనివారంతో ఎట్టకేలకు కార్తీకదీపం సీరియల్‌కు పూర్తిగా తెరపడబోతోంది… ఆ దర్శకుడెవరో గానీ తెలుగు ప్రేక్షకులను ఎట్టకేలకు కరుణించి విముక్తిని ప్రసాదించాడు… ఏ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు రానట్టుగా రేటింగ్స్ రాబట్టి, స్టార్ మాటీవీ ఓవరాల్ రేటింగ్‌ను దాదాపు డిసైడ్ చేసిన ఆ సీరియల్ ఏదో ఒక క్లైమాక్స్‌తో ముగిసిపోతోంది కదా… సరే, వాట్ నెక్స్ట్..?

అదే స్లాటులో బ్రహ్మముడి అనే సీరియల్ స్టార్ట్ చేయబోతోంది స్టార్ మాటీవీ… ప్రోమో చూడబోతే బిగ్‌బాస్ ఫేం మానస్ తో పాటు హమీద మొహం కనిపిస్తోంది… మిగతా వాళ్లెవరో గానీ మాటీవీ అడ్డగోలుగా ప్రమోట్ చేస్తోంది ఆ సీరియల్‌ను… కార్తీకదీపం ఆగిపోతే, ఏమేరకు మాటీవీ ఓవరాల్ రేటింగ్స్ మీద ప్రభావం కనిపిస్తుందో పెద్దగా అంచనా లేదు… కానీ ఓ కలవరం ఉన్నట్టుంది… ఆ సీరియల్‌కు ఏకంగా షారూక్ ఖాన్ ప్రమోట్ చేయించడం టీవీ, ఫిలిమ్ సర్కిళ్లను ఆశ్చర్యపరుస్తోంది… దాదాపు 4, 5 కోట్ల మేరకు ఖర్చు…

నిజానికి మాటీవీ బలం సీరియల్స్… ఫిక్షన్ కేటగిరీ… అదే దాన్ని తెలుగులో ఫస్ట్ ప్లేసులో నిలబెడుతోంది… ఇప్పుడు కార్తీకదీపం ఆగిపోవడం వల్ల ఏర్పడబోయే స్పేస్‌ను బ్రహ్మముడితో భర్తీ చేయాలనే తాపత్రయం కనిపిస్తోంది… జీతెలుగు కూడా తన సీరియల్స్ ద్వారా ఈ ఫిక్షన్ కేటగిరీలో మాటీవీకి రేటింగ్స్ పరంగా దగ్గరగా వస్తోంది… అదీ మాటీవీ కలవరం…

sharuk

నిజానికి గుప్పెడంత మనసు, ఇంటింటి గృహలక్ష్మి సీరియళ్లు కూడా బాగా పికపయ్యాయి… వాటిని మాటీవీ బాగా పైకి లేపుతోంది… కానీ కార్తీక దీపం కార్తీక దీపమే… మల్లి, ఇంటికి దీపం ఇల్లాలు, కృష్ణా ముకుంద మురారి సీరియల్స్‌ను కూడా బాగా ప్రమోట్ చేయాలని అనుకున్నా సరే, అది పైకి లేవడం లేదు… ఇప్పుడు మాటీవీకి రేటింగ్సులో దుమ్మురేపే సీరియల్ కావాలి… అదీ కథ…

ఎంతగా ఒక సీరియల్‌ను ప్రమోట్ చేయాలని అనుకున్నా సరే… ఓవరాల్ రేటింగ్స్ మీద కలవరం ఉన్నా సరే, మరీ షారూక్ ఖాన్‌తో ప్రమోట్ చేయించడం ఆశ్చర్యకరమే… నిజానికి స్టార్ హీరోలు టీవీ సీరియళ్లను ప్రమోట్ చేయడం పెద్ద విశేషమేమీ కాదు… జీతెలుగులో త్రినయని, ప్రేమ ఎంత మధురం వంటి సీరియళ్లను మహేశ్ బాబు ప్రమోట్ చేశాడు… ఆమధ్య ఏదో షోకు కూతురు సితారతో కలిసి మరీ మహేశ్ బాబు ప్రమోషన్ వర్క్ చేశాడు… కాకపోతే తను జీతెలుగు టీవీకి అధికారికంగానే బ్రాండ్ అంబాసిడర్, డబ్బు తీసుకుంటాడు… కాబట్టి ఆ టీవీ సీరియళ్లకు ప్రమోషన్ వర్క్ చేయకతప్పదు… కానీ మరీ ఒక మాటీవీ సీరియల్‌కు షారూక్ ఖాన్‌తో ప్రమోషన్ వర్క్ అంటే ఆశ్చర్యమే…

https://muchata.com/wp-content/uploads/2023/01/WhatsApp-Video-2023-01-17-at-19.04.00.mp4

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions