ప్రజలందరి ఎదుట నా మొదటి ప్రదర్శన నా తొమ్మిదో ఏట… అప్పటికే మ్యూజిక్ కెరీర్ వేటలో ఉన్న నా అక్కలు నన్ను హమీద్ సయానీ ఆఫీసుకు తీసుకెళ్లారు… తద్వారా సిలోన్ రేడియోలో ఓవల్టీన్ అమెచ్యూర్ అవర్ ప్రోగ్రామ్‌లో పాడే అవకాశం వచ్చింది… చిన్నతనం, బెరుకు, భయంతో ఆ పాట మరిచిపోయాను… వా అంటూ ఆరున్నొక్క రాగంలో ఏడుపు అందుకున్నాను…
‘‘నావరకు అది ఓ ముఖ్యమైన లర్నింగ్ అనుభవం… రెండోసారి మళ్లీ అదే ప్రోగ్రామ్‌లో పాడాను… Itsy Bitsy Teenie Weenie Yellow Polkadot Bikini పాట అది… లిరిక్స్ మొత్తం గుర్తులేవు నాకు… కానీ అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేశాను… నా సొంతంగా కొన్ని లైన్స్ యాడ్ చేశాను… నా తెలివితక్కువ తనాన్ని మొత్తానికి ఎవరూ గుర్తుపట్టలేదు… పాట మాత్రం బాగానే పాడాను…
అలా రేడియోకు కొన్నేళ్లు పాడాక చెన్నైలోని ఓ నైట్ క్లబ్బులో పాడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది… నిజానికి నైట్ క్లబ్బులో కన్వెన్షనల్ పాటలు పాడటం ఉండకపోయేది… పైగా నాలాగా పద్ధతైన పాటలు పాడేవాళ్లు ఎవరూ లేరు అప్పట్లో… ఎక్కువగా పాప్ మ్యూజిక్ చెలామణీలో ఉండేది… పాశ్చాత్య దుస్తులు వేసుకుని, జుట్టుకు రంగేసుకుని, మంచి అందమైన శరీరాలతో పాటతోపాటు వెలిగిపోయేవాళ్లు…
Ads
మరి నేను..? ఒక చీరె కట్టుకుని, ముడుచుకున్న కొప్పు, అందులో తట్టెడు పూలు… 1969లో నేను నైట్ క్లబ్బులో పాడటం స్టార్ట్ చేశాను గానీ చాలామందికి నచ్చలేదు… ఆడ్‌గా అనిపించేది… నైట్ క్లబ్బులకు సరిపోయే రకం కాదు అనిపించింది అందరికీ… పైగా పాటలు పాడటమే తప్ప, క్లబ్బులో పాడటానికి అవసరమైన గ్లామర్ అద్దలేకపోయాను నేను నా సంగీతానికి…
అలాగని నేను దాన్ని ఓ ఫ్యాషన్ షోగా మార్చడానికి కూడా ప్రయత్నించలేదు… వినేంతకాలం వింటారు, లేదంటే నా సిలోన్ రేడియో నాకు ఉండనే ఉందిగా… ఓ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చాను… ఈ కొత్త డ్రెస్సులు, ఫ్యాషన్లు గట్రా నాకు నప్పేవి కావు, అంతగా అలవాటయ్యేవీ కావు… నా స్కూల్ యూనిఫామ్ తరువాత నాకు తెలిసిన దుస్తులు అంటే అది చీరె మాత్రమే… అప్పుడప్పుడూ సల్వార్ కమీజు…
నేను చీరెను ఎక్కువగా కట్టుకునేదాన్ని ఎందుకంటే మా అమ్మ కట్టుకోవడం చూసి, ఆమెలాగా కనిపించాలని ప్రయత్నించేదాన్ని… మొదట్లో అందరూ ఆడ్‌గా చూసినా సరే, కొన్నాళ్లకు పరిస్థితిలో మార్పు వచ్చింది… నన్ను గుర్తించడం ప్రారంభించారు కస్టమర్లు… అప్పటిదాకా మగాళ్లే ఎక్కువగా వచ్చేవాళ్లు ఆ క్లబ్బులకు… మెల్లిగా ఇంట్లోని మహిళలను తీసుకురావడం స్టార్ట్ చేశారు… భార్యలు, తల్లులు, బిడ్డలు, చెల్లెళ్లు మగాళ్లతోపాటు వచ్చేవాళ్లు… ఇలా నైట్ క్లబ్బులు కూడా ఫ్యామిలీ గ్యాదరింగు కేంద్రాలయ్యాయి… అలా నేను ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్ అయిపోయాను… — ఉషా ఉతుప్
Share this Article