Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టాప్ వన్ ధనికురాలు… ఆ తండ్రి జాగ్రత్తగా చెక్కిన బిడ్డ ఆమె…

December 10, 2020 by M S R

కుళ్లు, కుట్రలకు పేరొందిన కార్పొరేట్ ప్రపంచంలో… సవాళ్లకు ఎదురీదుతున్న కాఫీడే మాళవిక గురించి చెప్పుకున్నాం కదా… అందులోనే మన దేశపు టాప్ టెన్ ధనిక స్త్రీల ప్రస్తావన కూడా వచ్చింది… అవునూ, మన దేశంలో అత్యంత ధనిక మహిళ ఎవరు..? ఇదీ ప్రశ్న…! ఆమె పేరు రోష్ని నాడార్… దాదాపు 55 వేల కోట్ల ఆస్తిపరురాలు… అంతా వైట్ మనీ… అంటే లెక్కకు వచ్చే సొమ్మే… ఇంతకుమించి ధనం ఉండీ, బయటికి అధికారికంగా చెప్పుకోలేని మరింత ధనిక మహిళలు ఉంటే ఉండవచ్చుగాక… లెక్కప్రకారం రోష్నీయే టాప్… అసలు ఎవరీమె..? అందరిలాగే కేవలం కాగితాలపై కనిపించే డమ్మీకేరక్టరా..? దమ్మున్న కేరక్టరా..? ఓసారి చెప్పుకుందాం…

తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని ఓ కోస్తా గ్రామంలో పుట్టిన శివ నాడార్ వయస్సు ఇప్పుడు 75 ఏళ్లు… అప్పుడెప్పుడో నలభై ఏళ్ల క్రితం హెచ్‌సీఎల్ కంపెనీ స్థాపించాడు… పెంచుకుంటూ పోయాడు… మన ఐటీ, హార్డ్‌వేర్ ఉత్పత్తులకు, ఎగుమతులకు ప్రధాన కంపెనీగా మారింది… ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా ఇచ్చింది ప్రభుత్వం… ఆయనే రోష్నీ తండ్రి…

తనకు ఒక్కతే కూతురు… వేల కోట్ల తన కంపెనీకి, తన గౌరవానికి అర్హురాలిగా తన వారసురాలిని జాగ్రత్తగా చెక్కాడు… అకస్మాత్తుగా తీసుకొచ్చి కంపెనీ మీద రుద్దలేదు… ఆమె పర్సనల్ ఆకాంక్షలకు అడ్డుపడకుండానే… తన ఆశలకు తగినట్టుగా మౌల్డ్ చేసుకున్నాడు…  డబ్బు తాలూకు మైకం ఆమె కళ్లను కమ్మేయకుండా జాగ్రత్తపడ్డాడు…

ఆమె శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానంది… నేర్పించాడు… యోగా కావాలంది… నేర్పించాడు… ఈరోజుకూ వాటిని వదలదు ఆమె… బాగా చదవాలని ఉంది నాన్నా అనడిగింది… అమెరికాలో కమ్యూనికేషన్స్ చదువుకుంది… జర్నలిస్టు నెత్తురు కదా… (శివ నాడార్ బావమరిది, అనగా రోష్ని మేనమామ ఎస్పీ అదితనార్ దినతంతి అనే పాపులర్ డెయిలీ ఓనర్…)

చదువు అయిపోయింది… సీఎన్బీసీ, సీఎన్ఎన్ తదితర మీడియా హౌజుల్లో కొన్నాళ్లు ఇంటర్న్‌షిప్… ఇందులో అందరూ మీడియా మొఘల్ రూపర్డ్ మర్డోక్‌లు కాలేరమ్మా అని నచ్చజెప్పాడు బిడ్డకు… బిజినెస్ మేనేజ్‌మెంటులో చేర్పించాడు… అదయ్యాక… ఇండియా తిరిగొచ్చాక… పేరుకు ఆమెను కంపెనీ సీఈవోగా ప్రకటించాడు… కానీ ఎకాఎకిన కంపెనీ బాధ్యతలు పూర్తిగా అప్పగించలేదు ఆమెకు… వేల కోట్ల టర్నోవర్, వేల మంది ఉద్యోగులు… ఆమెను రుద్దలేదు నేరుగా… రిస్క్ కదా…

కంపెనీ ట్రస్టు తరఫున నడిచే స్కూళ్లు, ఇతర సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమాల్ని ప్రధానంగా చూడమన్నాడు… సమాజం పట్ల కొంత జవాబుదారీతనం పెరగటానికి అది అవసరం అనుకున్నాడు… గొప్ప ఆలోచన… 26 ఏళ్లకే ఓ లిస్టెడ్ ఐటీ కంపెనీకి సీఈవో అయిన తొలి మహిళ… తరువాత డైరెక్టర్‌ను చేశాడు… ఆర్థిక వ్యవహారాలు అప్పగించాడు… ఒక్కొక్క అంశమే నేర్పించాడు… ఒక్కసారి ఫైనాన్షియల్ మేటర్స్ అర్థమైతే చాలు, ఇక ఎవరూ వేలు పెట్టి నడిపించనక్కర్లేదు… ఆమె నేర్చుకుంది…

ఆమె పర్సనల్ విషయాలను గౌరవించాడు… ఆమె ప్రేమించిన మల్హోత్రా అనే హోండా డిస్ట్రిబ్యూటర్‌తో పెళ్లి చేశాడు… ఓ అనామక డీలర్ కొన్ని వేల కోట్ల హెచ్సీఎల్ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయాడు… తరువాత ఓ టైం వచ్చింది… అల్లుడు, బిడ్డకు అప్పగించి, రిటైర్ కావాల్సిన టైం వచ్చేసిందని ఫీలయ్యాడు…

ఆమెను ఆమధ్య ఏకంగా కంపెనీ ఛైర్ పర్సన్‌ను చేశాడు… కొడుకైనా, బిడ్డయినా ఆమే కదా… అల్లుడిని ఉపాధ్యక్షుడిని చేశాడు… ఐనాసరే, కంపెనీని వదిలేయలేదు… ఇప్పటికీ ఆమె తండ్రి చాటు బిడ్డలాగే కనిపిస్తుంది… హంబుల్… తండ్రి కూడా అన్నింట్లోనూ వేలు పెట్టడు… కానీ చీఫ్ స్ట్రాటజిక్ డైరెక్టర్ హోదాలో ఎప్పుడూ ఓ కన్నేసే ఉంటాడు… ఆమెను పెంచిన తీరు, మల్చుకున్న తీరు, ఆమెకు క్రమేపీ అన్నీ నేర్పి, ప్రత్యేకంగా సమాజానికి మనం తిరిగి ఏమివ్వాలో నేర్పించి, అన్నీ అప్పగించి… ఈరోజుకూ ఒక కంటితో ఆమెను చూసి గర్విస్తాడు… మరో కంటితో కంపెనీని గమనిస్తూనే ఉంటాడు… ఎవరూ గాడితప్పకుండా…! గొప్ప తండ్రి… ఆ తండ్రికి తగ్గ తనయ…!!

ఆమె ఆ వేల కోట్లు సంపాదించలేదు, కానీ అవి ఇప్పుడు కాపాడితే చాలు, తండ్రి బాటలో నడుస్తూ, కొన్ని వేల కుటుంబాలకు ఆధారంగా కొనసాగితే చాలు… అదే ఆమె ప్రతిభకు సవాల్… ఎందుకంటే…? లక్షన్నర మంది ఉద్యోగులు… యాభై దేశాల్లో వ్యాపారం… ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల సంపాదన… అన్నింటికీ మించి వాళ్ల ఆదాయం నుంచి భారీగా ఖర్చయ్యే సేవా కార్యక్రమాలు… ఆమె కూర్చున్న కుర్చీకి చాలా బాధ్యత ఉంది…!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now