.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో టీమ్ ఇండియా స్టార్లు అందరూ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు… కొందరు ప్రైవేట్ జెట్‌లు, మరికొందరు ఖరీదైన కార్లలో విహరిస్తుంటే, టీమ్ ఇండియా ‘సిక్సర్ కింగ్’ శివం దూబే మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు… అహ్మదాబాద్ నుండి ముంబైకి ఏ హడావిడి లేకుండా… పొద్దున్నే థర్డ్ ఏసీ ఎక్కి, తన భార్యతో కలిసి సాధారణ ప్రయాణికుడిలా రైలు (Train) ఎక్కి వెళ్ళిపోయారు…
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి… దూబే దంపతులు రైలులో వెళ్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది… టికెట్ చెక్ చేయడానికి వచ్చిన టీసీ (TC), దూబేని చూసి గుర్తుపట్టాడు…
Ads
“సార్, మీరు క్రికెటర్ శివం దూబే కదా?” అని అడిగాడు… దానికి దూబే భార్య అంజుమ్ ఖాన్ నవ్వుతూ.. “అయ్యో, లేదు సార్, ఆయన శివం దూబే కాదు.. కేవలం ఆయనలా కనిపించే డూప్లికేట్ అంతే!” అని చమత్కరించింది…
దానికి దూబే కూడా వంత పాడుతూ టీసీతో సరదాగా మాట్లాడటం, ఆ తర్వాత టీసీకి ఆటోగ్రాఫ్ ఇవ్వడం విశేషం… అయితే ఈ ఫన్నీ సంభాషణ తాజా రైలు జర్నీలో కాదు, అంతకుముందు ఐపీఎల్ సీజన్‌లో ఓసారి ఇలాగే అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తున్నప్పుడు జరిగింది… ఆ ఇద్దరూ ఎక్కువగా ట్రెయిన్ ప్రయాణాలనే ప్రిఫర్ చేస్తారు ఎందుకో మరి…
“గతంలోని ఆ రైలు ప్రయాణంలో ఎదురైన ఫన్నీ అనుభవాన్ని సోషల్ మీడియా మళ్ళీ తాజాగా తవ్వి తీస్తోంది… అప్పుడు టీసీతో జరిగిన ఆ సరదా సంభాషణ ఇప్పుడు దూబే రైలు ప్రయాణంతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది…”

ఉత్తరప్రదేశ్ టూ ముంబై.. పరిచయం ఎలా? అంజుమ్ ఖాన్..? అంటే దూబెది మతాంతర ప్రేమవివాహమా..? ఇంట్రస్టింగు… ఏమిటీ కథ..?
శివం దూబే ముంబైలో పుట్టి పెరిగిన లోకల్ బాయ్ అయితే, అంజుమ్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన మహిళ… అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయిన అంజుమ్, మోడలింగ్, నటనపై ఆసక్తితో ముంబై చేరుకున్నది…
ముంబైలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది… మొదట్లో స్నేహితులుగా ఉన్నా, దూబే తన కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు అంజుమ్ ఇచ్చిన మద్దతు వారిని ప్రేమ వైపు నడిపించింది… సుమారు నాలుగేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేసినా, ఎక్కడా మీడియాకు చిక్కకుండా తమ బంధాన్ని గోప్యంగా ఉంచారు…
ప్రణయం.. పరిణయం.. రెండు పద్ధతులు! వీరి ప్రేమకథలో అత్యంత అందమైన విషయం ఏమిటంటే.. మతాలు వేరైనా ఒకరి సంప్రదాయాలను ఒకరు గౌరవించుకోవడం…
-
2021 జూలై 16న ముంబైలో వీరి వివాహం జరిగింది…
-
తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు…
-
ఆ వెంటనే ఇస్లామిక్ పద్ధతిలో ‘నికాహ్’ కూడా చేసుకున్నారు…
పెళ్లి సమయంలో దూబే ముస్లిం సంప్రదాయం ప్రకారం ‘దువా’ చేస్తున్న ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమర్శలు వచ్చినా, “ప్రేమకు మతం లేదు.. కేవలం పరస్పర గౌరవం మాత్రమే ఉంటుంది” అని ఈ జంట నిరూపించింది…
దూబే సక్సెస్ వెనుక ‘అంజుమ్’ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు దూబే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన రోజుల్లో అంజుమ్ అతనికి కొండంత అండగా నిలిచింది… ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు… వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తర్వాత కూడా ఎలాంటి పటాటోపం లేకుండా భార్యతో కలిసి రైలులో ప్రయాణించి, సామాన్యుడిలా కనిపించిన దూబే ఇప్పుడు రియల్ హీరో…

Share this Article