Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దిల్ రాజు ఎదుట వంగిపోయినా… చివరకు కోర్టు అక్షింతలు తప్పలేదు…

January 11, 2025 by M S R

.

ఒక తాజా వార్త చదవండి… గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.

సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్, స్పెషల్ షోలు లేనట్లే… గేమ్ ఛేంజర్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ రూ.100, రూ.150 పెంచుతూ జనవరి 8న ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం… ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు

Ads

దీంతో టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షో ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…

…… ఇదీ వార్త… ఆహా… ఒక దిల్ రాజు అనే ఓ సిండికేట్ సినిమా కేరక్టర్‌కు తలవంచి, వంగిపోయి… తన పాత మాటల్ని కూడా తుంగలో తొక్కేసి… సాగిలబడిన రేవంత్ రెడ్డికి తత్వం బోధపడింది… దీనికి హైకోర్టు కొరడా పట్టుకోవాల్సి వచ్చింది…

ఇదే, రేవంత్ రెడ్డి నేర్చుకోవల్సిన పాఠం… తన క్రెడిబులిటీ తనే చేజేతులా పోగొట్టుకుంటున్నాడనే సోయి లేకపోతే ఎలా..? ఏమిటీ దిక్కుమాలిన విధానాలు అని హైకోర్టు చురకలు అంటించగానే ఏపీ ప్రభుత్వం… అదీ సినిమావాళ్ల అనుకూల ప్రభుత్వం కూడా వెంటనే దిద్దుబాటుకు పూనుకుంది…

తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే లెంపలేసుకోవడానికి మనస్కరించలేదు… ఫాఫం, తెల్లకల్లు, మటన్ దిల్ రాజు ఫీలవుతాడేమో అని రేవంత్ రెడ్డి సర్కారు తెగ ఫీలైపోయింది… వెంటనే స్పందించలేదు… చివరకు తప్పలేదు…

బెనిఫిట్ షోలు లేవు, టికెట్ రేట్ల పెంపు లేదు, అదనపు షోలు లేవు అని మొదట్లో కనబరిచిన వైఖరికే కట్టుబడి ఉంటే ఇప్పుడెంత బాగుండేది… చివరకు దిల్ రాజుకు కూడా లొంగిపోతే ఇక సిస్టం, రాజ్యం, వ్యవస్థకు విలువ ఏమున్నట్టు..?

ఏపీలో టికెట్ రేట్లు పెంచారు, అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చారు అంటే అది వేరు… అది సినిమా ప్రభుత్వం… సీఎం చంద్రబాబుది సినిమా కుటుంబం… డిప్యూటీ సీఎం స్వయంగా సినిమా మనిషి… గేమ్ చేంజర్ తన అన్న కొడుకు సినిమా…

సరే, దండుకొండిరా అని పర్మిషన్లు ఇచ్చారు… ఐనాసరే కోర్టు వ్యాఖ్యలు వినగానే దిద్దుకున్నారు… లేటుగానైనా రేవంత్ సర్కారు లెంపలేసుకుంది… కానీ, నిర్ణయాలు తీసుకునే ముందే అన్నీ ఆలోచించుకోవాలి…

ఇప్పుడేమైంది…? వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు… మాట పోయింది, పరువు పోయింది, చివరకు తీసుకున్న నిర్ణయాన్ని మడతబెట్టి…. సరే, అటక మీదకు ఎక్కించాల్సి వచ్చింది… మరి సాధించిందేమిటి..? నిన్ను నడిపించాల్సింది హార్డ్ కోర్ సినిమా వ్యాపారి దిల్ రాజు కాదు నాయకా..? జనం… జనం కోరికలు..!!

You are not a game changer mr cm revanth… not even good player… once again yourself you projected it…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • అందరూ రాజ్‌పుష్పలు కాలేరు పుష్పా… అనవసర ప్రయాస, అగౌరవం…
  • సాక్షిలో చైనా సరుకు..! ఈ కరణ్ థాపర్ ఘొప్ప వ్యాసం చెప్పేది ఇదే..!
  • ఒక ధర్మబద్ధ ఫ్యూడల్ నియంత..! ఒక బొబ్బిలి బ్రహ్మన్న పాత్ర…!
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions