Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పఠాన్ పేరు మారుస్తారా..? బేశరం రంగ్ పాట తీసేస్తారా..? షారూక్‌కు షాక్..!

January 3, 2023 by Rishi

పార్ధసారధి పోట్లూరి ….. పఠాన్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా ? తనకి తాను ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకుంటూ ఉండే కమాల్ రషీద్ ఖాన్ [KRK] నిన్న తన అఫిషియల్ ట్విట్టర్ హాండిల్ లో ఒక ట్వీట్ చేశాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమా రిలీజ్ ముందు అనుకున్నట్లుగా జనవరి 25 న రిలీజ్ కాదని, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం అంటూ ట్వీట్ చేశాడు.

కమాల్ రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ మీద షారూఖ్ ఖాన్ అభిమానులు ఒక్కసారిగా KRK మీద విరుచుకుపడ్డారు ఎదురుదాడి చేస్తూ ! KRK ను ఉద్దేశిస్తూ షారూఖ్ అభిమానులు నువ్వొక వెధవవి, నీకు నువ్వే గొప్ప సినిమా విమర్శకుడివి అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటావు, కానీ మామూలు ప్రేక్షకుడి కన్నా నీ విమర్శలు ఏవీ గొప్పగా ఉండవు కాబట్టి నోరు మూసుకో అని!


మరోవైపు షారూఖ్ కూడా KRK తనని టార్గెట్ చేయడం మీద మండి పడ్డాడు. కానీ మరో న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతున్నది అది ఏమిటంటే సెన్సార్ బోర్డ్ పఠాన్ సినిమాకి చాలా కట్స్ చెప్పిందని..! అయితే లేటెస్ట్ గా ఇండియన్ ఎక్స్ప్రెస్స్ పఠాన్ సినిమా సెన్సార్ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఛైర్మన్ అయిన ప్రసూన్ జోషి ఒక స్టేట్మెంట్ లో పఠాన్ మూవీలో చాలా అభ్యంతరకరమయిన దృశ్యాలు ఉన్నాయి, వాటిని తీసివేసి మళ్ళీ సర్టిఫికెట్ కోసం రమ్మని చెప్పాము. దృశ్యాలతో పాటు పాటల మీద కూడా కట్స్ చెప్పాము, వాటిని కూడా సరిచేసి, మళ్ళీ సర్టిఫికెట్ కోసం రమ్మని చెప్పాము! సో, KRK ముందుగానే చెప్పిన విషయం నిజమేనని తెలిసింది !


***********************************************************
కమాల్ రషీద్ ఖాన్ చెప్తున్న దాని ప్రకారం పఠాన్ సినిమాలో కొన్ని సీన్స్ తో పాటు ‘బేషరమ్ రంగ్ ‘ పాట కూడా తీసేయాలని లేదా మార్చమని సెన్సార్ బోర్డ్ చెప్పింది అని. నిజానికి ఈ రోజు అంటే జనవరి 3న పఠాన్ ట్రైలర్ రిలీజ్ కావలసి ఉంది, కానీ ఈ రోజు రిలీజ్ కాలేదు. దీనిబట్టి సెన్సార్ బోర్డ్ చెప్పిన కట్స్ కి మార్పులు చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది.పఠాన్ పేరు పెట్టడం మీద కూడా సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి కానీ పేరు మీద అభ్యంతరం పెడితే మాత్రం విషయం కోర్టు వరకు వెళ్ళవచ్చు. మిగతా కట్స్ మీద కోర్టుకి వెళ్ళినా ముందు అవి పూర్తి చేసుకొని మళ్ళీ రమ్మని అడగవచ్చు కోర్టు.


***********************************************************************
కమాల్ రషీద్ ఖాన్ మాత్రం తాను చేసిన ట్వీట్స్ మీద మళ్ళీ మళ్ళీ రీట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. తనని సెల్ఫ్ ప్రొక్లయిమ్డ్ క్రిటిక్ అని విమర్శిస్తున్న వాళ్ళకి ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నాడు. నాకు [KRK] యష్రాజ్ చోప్రా కానీ అతని కొడుకు ఆదిత్య చోప్రా కంటే సినిమా తీయడంలో మంచి పట్టు ఉంది. నేను సినిమాకి పఠాన్ పేరుని పెట్టినప్పుడే చెప్పాను ఆ పేరు పెట్టవద్దని, కానీ నా మాట వినలేదు షారూఖ్ కానీ ఇప్పుడు పఠాన్ పేరుని మార్చాలనే ఆలోచనలో ఉన్నారు ఆదిత్య చోప్రా మరియు షారూఖ్ ఖాన్ లు ! నేను అప్పట్లో చెప్పిన మాట విని ఉంటే ఇప్పుడు ఇంత గందరగోళం ఉండేది కాదు కానీ ఇప్పుడు నా మాటని బలవంతంగా వినాల్సి వస్తున్నది !


***********************************************************************
కమాల్ రషీద్ ఖాన్ మొదటి నుండి వివాదాస్పద వ్యక్తి ! హిందీ, భోజ్ పురి సినిమాల నిర్మాతగాను దర్శకుడిగాను ఉన్నాడు. దుబాయిలో వస్త్ర వ్యాపారం ఉంది. తెలుగు సినిమాల డబ్బింగ్ హక్కులో చవకగా కొని, హిందీలో రిలీజ్ చేసి చాలానే లాభపడ్డాడు. కానీ చాలా కాలం నుండి హిందీ చిత్ర పరిశ్రమ తీస్తున్న సినిమాల మీద తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ఒక దశలో తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి, హిట్ కొట్టి, లాభాలు ఎలా సంపాదించాలో దక్షిణాది సినిమాలని చూసి నేర్చుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు! 2020 లో అక్షయ్ కుమార్, రామ్ గోపాల్ వర్మల మీద విమర్శలు చేసి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన చరిత్ర ఉంది KRK కి. చివరకి కోర్టు బెయిల్ ఇచ్చింది అనుకోండి కానీ తగ్గట్లేదు, విమర్శలు చేస్తూనే వస్తున్నాడు, అందుకే KRK చేసిన ట్వీట్ల మీద ఎవరికీ నమ్మకం లేదు కానీ ఇప్పుడు అదే నిజం అయ్యింది… KRK కి ట్విట్టర్ లో మంచి ఫాలోయింగ్ ఉంది !


************************************************************
యష్ రాజ్ ఫిల్మ్స్, కరణ్ జోహార్ లకి ఇప్పుడు విషమ పరీక్ష ఎదురవబోతున్నది ! పఠాన్ సినిమా మొదటి నుండి వివాదాలలో చిక్కుకొని ఆలస్యం అవుతూ వచ్చింది కానీ ఇప్పుడు సెన్సార్ చెప్పిన కట్స్ తో పాటు బేషరమ్ రంగ్ పాట తీసివేయమని అడిగినది నిజమే అయితే తిప్పలు తప్పవు.
ఇంకా 22 రోజుల సమయం ఉంది ముందు చెప్పిన రిలీజ్ డేట్ జనవరి 25 కి ! ఈ లోపు సెన్సార్ బోర్డ్ చెప్పిన కట్స్ కి తగినట్టు మార్పులు చేస్తారా లేక కోర్టుకి వెళతారా ? 

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions