దొరుకుతున్నది కదాని ఆబగా తినేయాలని ప్రయత్నించకూడదు… అది ఎదురు తన్నే ప్రమాదముంది…! ఈ సత్యం చాలామందికి తెలుసు… కానీ జీటీవీ వాడికి తెలియదు… అందుకే అడ్డంగా బోల్తాకొట్టాడు… తలబొప్పికట్టింది… చేతులు, మూతులు కాలినయ్… ఇప్పుడు ఆకులు పట్టుకుంటాడేమో ఇక…! అర్థం కాలేదా..? సంక్రాంతి వేళ రెండురోజులపాటు రెచ్చిపోయి ప్రత్యేక షోలు ప్రసారం చేశాడు కదా… ఇప్పుడు విశేషం ఏమిటో తెలుసా..? రేటింగ్స్‌లో ఎక్కడో కొట్టుకుపోయాయి ఆ రెండు ప్రోగ్రాములూ… తాజా రేటింగ్స్‌లో టాప్ 30 జీ చార్ట్ చూస్తే ఎక్కడా లేదు… ఫస్ట్ త్రినయని 8 రేటింగ్… ఇక అక్కడి నుంచి కిందకు వస్తే… రాధమ్మ కూతురు, ప్రేమ ఎంత మధురం, నంబర్‌వన్ కోడలు, కల్యాణ వైభోగమే… చివరకు 5.2 రేటింగ్ దగ్గర నాగభైరవి… మరి సంక్రాంతి సంబరాలు… ఏమో, రేటింగ్స్ జాడేలేదు… అంటే మరీ అయిదు లోపే అన్నమాట… జీవాడి ప్లానింగు ప్రకారం మంచి రేటింగ్స్ రావాలి నిజానికి… కానీ ఎందుకిలా కొట్టేసింది..?
- నాన్-ఫిక్షన్ కేటగిరీలో జీవాడు ఏం ప్రయోగం చేసినా సరే… ఫట్‌మని పేలిపోతోంది… అందుకని ఎలాగైనా రియాలిటీ షోలకు సంబంధించి తన రేటింగ్స్ పెంచుకోవాలని ఈమధ్య తెగప్రయత్నిస్తున్నాడు… పైగా ప్రకటనల డబ్బులు వస్తాయి, పాపులారిటీ వస్తుంది, రీచ్ పెరుగుతుంది… ఇలా చాలా ఊహించుకున్నాడు… ఆరు గంటల సుదీర్ఘ ప్రోగ్రామును రెండు ముక్కలు చేసేసి, ఒకటి భోగి రోజే ప్రసారం చేసేశాడు… మరొకటి సంక్రాంతి రోజు… ఫీడ్ మిగిలినట్టు లేదు, లేకపోతే కనుమ రోజూ లాగించేవాడే మూడో భాగం… ఎలాగూ యాడ్స్, రేటింగ్స్ వస్తాయి కాబట్టి మరీ ఇంత కక్కుర్తి వేషమా..?
- సింపుల్‌గా మాటీవీ, ఈటీవీ సంక్రాంతి పూట తమ స్పెషల్స్ ప్రసారం చేసుకున్నాయి… చివరకు సుధీర్ లేకపోయినా సరే, ప్రదీప్ ఓవరాక్షన్, రోజా అతి, క్రియేటివిటీ లేని ప్లాటు అయినా సరే… ఈ సంక్రాంతి రేటింగుల పోటీలో ఈటీవీ వాడి ‘అత్తో అత్తమ్మ కూతురో’ హిట్టయింది… రియాలిటీ షోలకు సంబంధించి ఈటీవీదే ఈరోజుకూ పట్టు… 9.2 రేటింగులు కొట్టేసింది… ఈటీవీ చార్టులో టాప్ ప్రోగ్రాం… మాటీవీ వాడు కూడా ‘ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ’ అని స్పెషల్ వేశాడు కదా… అది 7.7 రేటింగు సాధించింది… కాస్త నయమేగా… ఎటొచ్చీ బొక్కబోర్లా పడింది జీవాడే…
- నిజానికి ఈ స్పెషల్స్ పెద్ద కథేమీ కాదు… తమ సీరియళ్లలో నటించే నటీనటులు, నాలుగు గెంతులు, నాలుగు జోకులు, చివరలో భోజనాలు… శ్రీముఖి వంటి యాంకర్ దొరికితే ఆ అరుపులు… అంతే… ఈటీవీ వాడికి జబర్దస్త్ ఆర్టిస్టులే కాదు, ఢీ డాన్సర్లు కూడా ఉంటారు… జీవాడయితే మరీ సరిగమప సింగర్లను పట్టుకొచ్చి ఏవేవో పోటీలు నడిపించాడు… మాటీవీ అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్లను కొందరిని పట్టుకొచ్చి కథ నడిపించేసింది కాసేపు… సో, ఎవరూ ప్రత్యేకంగా ఏదీ కొత్తగా చేయరు… అన్నీ తూతూమంత్రం, తుమ్మకాయమంత్రం షోలు… పండుగపూట టీవీలో ఏది వచ్చినా జనం చూసి కాసేపు ఎంజాయ్ చేస్తారు కాబట్టి చల్తా… అయితే దీనికి ‘అతి’ పనికిరాదు… ఓవర్ యాక్షన్ చేస్తే ఇదుగో జీవాడిలాగే ఫడేల్… నిజం చెప్పొద్దూ… జీవాడి రెండు రోజుల ప్రోగ్రాములూ మహా బోర్… రేటింగులు రావాలంటే కొంతయినా సరుకు ఉండాలోయ్… అప్పుడే రేటింగులు, యాడ్స్, డబ్బులు, పాపులారిటీ…! పండుగ రోజు ఈ మూడు టీవీల పోటీ స్పెషల్స్ మీద ‘ముచ్చట’ రాసిన లింకు ఇదుగో…
Ads
Share this Article