ఈరోజు తెగనచ్చేసిన వార్త… మెయిన్ స్ట్రీమ్‌లో ఇలాంటివి కనిపించవు… ఇలాంటివి సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో మాత్రమే కనిపిస్తాయి… శుభకార్యమైనా, అశుభకార్యమైనా సరే, సెలబ్రిటీల ఇళ్లల్లో ఏది జరిగినా మీడియాకు పండుగ… పాపం శమించుగాక… వచ్చీపోయే సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, బైట్స్‌తో రోజులతరబడీ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వగలవు చానెళ్లు… పత్రికలు ప్రత్యేక సంచికలు, కథనాలకు పూనుకోగలవు…
కానీ అట్టహాసాలు లేకుండా… అనవసర షో లేకుండా… నిరాడంబరంగా సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల్ని మాత్రం పొగడవు… ఇలా ఉండాలిరా అని సొసైటీకి హితబోధ చేసే ఇలాంటి వార్తలు వాటికి పట్టవు… ఆమధ్య ప్రధాని తల్లి మరణిస్తే… సింపుల్‌గా వెళ్లాడు… పాడె మోశాడు… పరామర్శల ఆర్భాటాలు ఏమీ లేవు… జస్ట్, రెండుమూడు గంటల్లో ఆ కుటుంబం ఆమెను పరలోకానికి పంపించేసి వచ్చింది… అవును, ఆమె మరణానికి దేశమంతా ఏడ్వాల్సిన ప్రయాస ఏమీ అక్కర్లేదుగా… ఇక్కడ మోడీ తత్వం చూస్తే మెచ్చుకోబుద్ధయింది…
మరో ఉదాహరణ… నిర్మలా సీతారామన్ అంటే దేశప్రజల్లో చాలామందికి వ్యతిరేకత… ఆమెకు పేదల సమస్యలు పట్టవు… ప్రజానీకానికి మంచి చేసే ఏ ఒక్క నిర్ణయమూ ఆమె వల్ల కాలేదు… అఫ్‌కోర్స్, మోడీయే కారకుడు… తను చెబితే కదా ఆమె చేసేది… సరే, పవర్ ఫుల్ పోస్టులో ఉంది ఆమె… దేశ ఆర్థిక వ్యవస్థకు డ్రైవర్ ఆమె… అలాంటి ఆమె ఇంట్లో పెళ్లి అంటే ఎంత ఆడంబరం ఉండాలి నిజానికి… దిగువ మధ్య తరగతి కూడా, అవసరమైతే అప్పులు తెచ్చి మరీ పెళ్లిళ్లను ధూంధాం చేస్తున్న రోజులివి…
Ads
కానీ దానికి భిన్నంగా, సింపుల్‌గా తన బిడ్డ పెళ్లి చేసింది నిర్మలమ్మ… ఆమె కుమార్తె పేరు వాంగ్మయి… ఎంత నిరాడంబరంగా పెళ్లి చేసిందీ అంటే… ఏ రంగానికి చెందిన ప్రముఖులు రాలేదు… రాజకీయ నాయకుల షో అస్సలు లేదు… అసలు ఆమె వాళ్లను పిలవనేలేదు… వావ్… ముఖ్యుల ఇళ్లల్లో పెళ్లిళ్లు ఇలా ఉంటేనే సొసైటీకి మంచిది, మంచి సంకేతం కూడా… నిరాడంబర పెళ్లి అనేదే సత్సంప్రదాయం అనే భావన బాగా పెరగాలి కూడా…
వాంగ్మయి పెళ్లి గుజరాత్‌కు చెందిన ప్రతీక్‌తో జరిగింది… (ఇక్కడా గుజరాతే)… (ఈయన సింగపూర్‌లో మేనేజ్‌మెంట్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చేశాడు… మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సీఎం ఆఫీసులో రీసెర్చ్ అసిస్టెంట్… తను 2014 నుంచీ పీఎం కార్యాలయంలో ఓఎస్డీగా చేస్తున్నాడు… 2019 నుంచి జాయింట్ సెక్రెటరీ…) పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లిని ఉడుపిలోని అదమరు మఠానికి చెందిన బ్రాహ్మణ పూజార్లు నిర్వహించారు… తన బిడ్డ పెళ్లి గురించి నిర్మలమ్మ అధికారికంగా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు… కాకపోతే ఈ వేడుక బాపతు ఫోటోలు కొన్ని బయటికి వచ్చి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా… మెచ్చుకుంటూ…
వాంగ్మయ్య కొలువు ఏమిటో తెలుసా..? మిట్ లాంజ్ ఫీచర్స్ విభాగంలో బుక్స్, కల్చర్ సెక్షన్‌లో ఓ సాదాసీదా ఉద్యోగి… దీనికిముందు ది హిందూ పత్రికలో ఫీచర్స్ రాసేది… ఆమె జర్నలిజంలో మాస్టర్స్ చేసింది… ఇక్కడ కాదు, నార్త్ వెస్టరన్ మెడిల్లీ స్కూల్ ఆఫ్ జర్నలిజం… అంగరంగవైభవంగా పెళ్లి చేయగలదు… కానీ సింపుల్‌గా పెళ్లి చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచింది… నిర్మలమ్మ భర్త పరకాల ప్రభాకర్ ఫోటోలో కనిపించడం లేదు కానీ నీకూ అభినందనలు సార్…
Share this Article