ఒకటి ఆనందమేసింది… బలగం అనే సినిమా రీసెంటుగా టీవీలో రీటెలికాస్ట్ చేస్తే… మళ్లీ మంచి రేటింగ్స్ సంపాదించింది… అసలు ఈమధ్య పెద్ద పెద్ద స్టార్ల, భారీ సినిమాలనే ఎవడూ దేకడం లేదు… చూస్తే ఓటీటీలో పైపైన చూస్తున్నారు అంతేతప్ప టీవీల ఎదుట కూర్చుని ఓపికగా ఎవడూ ఏ సినిమానూ చూడటం లేదు… కానీ ఈ బలగం సినిమా థియేటర్లలో హిట్… ఊళ్లల్లో ఫ్రీషోలలో హిట్… ఓటీటీలో హిట్… అంతేకాదు, టీవీల్లో కూడా హిట్… ఈలెక్కన కొన్నాళ్లాగి థియేటర్లలో రీరిలీజ్ చేస్తే రీహిట్ అవుతుందేమో…
బలగం మొదటిసారి టీవీల్లో రిలీజ్ చేసినప్పుడు 14.3 ఓవరాల్ రేటింగ్స్ వచ్చాయి… ఈరోజుల్లో అది చాలా ఎక్కువ… గత వారం మళ్లీ ప్రసారమైతే ఈసారి ఏకంగా 9.08 రేటింగ్స్ వచ్చాయి… సూపర్… సరే, మనం చెప్పుకోదగిన విషయం మరొకటి ఉంది… అది ధనుష్ నటించిన సర్ సినిమా గురించి… ఇది కూడా గత వారం టీవీల్లో ప్రసారం చేశారు… కానీ జెమిని టీవీలో… దానికేమో రీచ్ తక్కువ… ఎంత భారీ సినిమా అయినా సరే, జెమిని టీవీలో ప్రసారం అయ్యిందంటే చాలు, దానికి రేటింగ్స్ రావు, ఎవడూ చూడనట్టే లెక్క…
Ads
అంతేనా..? కాదు… ఈ సినిమాను థియేటర్లలో కూడా తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు… ఓటీటీ సంగతేమిటో తెలియదు, ఓటీటీ మేనేజర్లు ఏది చెబితే అదే నమ్మాలి తప్ప ప్రేక్షకుల వాస్తవ సంఖ్య అనగా డౌన్‌లోడ్స్, వ్యూ అవర్స్ సంఖ్య అస్సలు బయటపడే మార్గం లేదు… మరి టీవీలో..? జస్ట్, 4.61 రేటింగ్స్ వచ్చాయి హైదరాబాద్ బార్క్ కేటగిరీలో… అంటే చాలా తక్కువ… నాసిరకం సీరియల్స్ కూడా ఇంతకుమించి రేటింగ్స్ సాధిస్తున్నాయి…
నిజానికి సర్ సినిమా విడుదలైనప్పుడు మంచి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి… రొడ్డకొట్టుడు, ఇమేజీ బిల్డప్పుల, ఫార్ములా సినిమా గాకుండా భిన్నమైన సబ్జెక్టును బాగానే డీల్ చేశారనే అభిప్రాయమే వినిపించింది… ధనుష్ నటనకూ వంకపెట్టలేం… హీరోయిన్ సంయుక్త మేనన్‌కూ మంచి మార్కులే పడ్డయ్… కథ కొంత లాజిక్ రహితంగా ఉన్నా సరే ఓవరాల్‌గా వోకే… కానీ చివరకు ఏం జరిగింది..? ఏమీ లేదు… తెలుగు టీవీ తెర మీద ఫ్లాప్ అయిపోయింది…
Share this Article