Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సిరిమువ్వల సింహనాదం… థియేటర్ రిలీజుకే విశ్వనాథ్ పట్టు… కనుమరుగు…

February 26, 2023 by M S R

Bharadwaja Rangavajhala……….   “నేనేదో గొప్ప సినిమా తీశాను. అది విడుద‌ల కాక‌పోతే ప్ర‌పంచం ఏదో కోల్పోయింద‌ని నేన‌న‌నుగానీ … నేను తీసిన సినిమాల్లో ఒక‌టి రిలీజ్ కాకుండా ఆగిపోవ‌డం నాకెందుకో కొంచెం బాధ‌గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడూ ఇలా వేసి న‌లుగురికీ చూపించాల‌నే కోరిక కూడా నాకు లేదు. ఎవ‌రో వ‌చ్చి అడుగుతారు … నేను ల్యాబు నుంచీ ఈ ప్రింటు తెప్పించి వేయ‌డం జ‌రుగుతోంది. ఈ సినిమా కూడా జ‌నంలోకి వెడితే … నేను అనుకున్న విష‌యం త‌ప్పో ఒప్పో వారు చెప్పేస్తే … చాలు … అంత‌క‌న్నా నేను ఇంకేమీ కోరుకోవ‌డం లేదు. ….”

స‌రిగ్గా ఇవే మాట‌లు విశ్వ‌నాథ్ గారు ఆ రోజు సాయంత్రం అన్నారు. ఆడ వేషంలో న‌ర్తించి గొప్ప కీర్తిని సంపాదించిన క‌ళాకారుడి జీవితంలోని వివిధ కోణాల్ని తెర మీద ఆవిష్క‌రించారు విశ్వ‌నాథ్. అర్ధ‌నారీశ్వ‌ర త‌త్వాన్ని చెప్ప‌డంగా కొంద‌రు వ్యాఖ్యానించిన‌ప్ప‌టికీ … సినిమా మొత్తంగా విశ్వ‌నాథ్ ప‌ద్ద‌తిలోనే వినోదాత్మ‌కంగా న‌డుస్తూనే ఓ స‌మ‌స్య‌ను చ‌ర్చించేదిగా సాగుతుంది…

కూచిపూడి నేర్చుకున్న హీరో… స్టేజ్ మీద భామా కలాపం అద్భుతంగా చేస్తాడు అని పేరు… అతను ఎందుకు ఆడ పాత్రలే చేస్తాడు? తను ఆడ పాత్రలో ఎలా ఉంటాడో వాళ్ళ అమ్మ కూడా అలాగే ఉంటుంది అని ఆడ పాత్రలే చేస్తాడు… మరదలితో పెళ్లి అనుకుంటారు పెద్దలు. మరదలు ఒద్దు అంటుంది. కారణం స్టేజ్ మీద ఆడ పాత్రలు వేసే మనిషిని పెళ్లాడను అంటుంది.

Ads

viswanath
ఆ అమ్మాయి జీవితంలో ఒక ఊహించరాని మలుపు. ఓ ఎంపీ కొడుకు తనను పాడు చేస్తాడు. ఆ ఎంపిని చంపేయాలి అన్నంత కోపం వచ్చినా ఆ అమ్మాయి మ్యాన్లీ హీరో అనుకున్న వాడు ఒద్దు అంటాడు. కానీ డాన్సర్ ఊరుకోడు…. దీపావళికి సత్యభామ విజయంగా భావించేలా వేస్తున్న నృత్య సంప్రదాయంలో భాగంగా ఆ ఎంపిని చంపేస్తాడు. అదే చిత్రం కథ. అదే సిరిమువ్వల సింహనాధం …. ఆ అమ్మాయి కళ్ళు తెరుచుకుంటాయ్…
……

హీరోయిన్ మాధ‌వీమాల న‌ట‌న , న‌ర్త‌న రెండూ చాలా చాలా బాగున్నాయి. ఓంపురి ఈ సినిమాలో విల‌న్ గా న‌టించ‌డం విశేషం. మ‌హ‌దేవ‌న్ సంగీతం ముఖ్యంగా నేనెవ‌రో … అనామిక‌నో పాట … చాలా గొప్పగా వ‌చ్చాయి. డిజిట‌ల్ ఫార్మాట్ లోకి మార్చి ఈ చిత్రాన్ని క‌నీసం యూట్యూబులో అయినా విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని విశ్వ‌నాథ్ గారితో అంటే… ఆయన ఒప్పుకోలేదు.

నిజంగానే … అంత‌టి ద‌ర్శ‌కుడు త‌న సినిమా విడుద‌ల కోసం వేచి చూడ‌డం … ఆ ప‌రిస్థితి క‌ల్పించ‌డం బాధాక‌ర‌మే. ఆనాటి నా బాస్ రామలక్ష్మి గారితో కలసి విశ్వనాథ్ గారితో మాట్లాడా… ఆయన థియేటర్ రిలీజ్ కే మొగ్గుచూపారు… మా మేడం నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆయన కన్విన్స్ కాలేదు… ఏం చేస్తాం…

May be an image of 3 people, people sitting, people standing and indoor

(విశ్వనాథ్ సినిమాల్లో కొన్ని గొప్పవి ఉన్నాయి… అదేసమయంలో అసలు రిలీజుకు నోచనివీ ఉన్నాయి… ప్రత్యేకించి సిరిమువ్వల సింహనాదం సినిమా వాటిల్లో ఒకటి… కనీసం డిజిటల్ రిలీజ్‌కు కూడా ఆయన అంగీకరించలేదు… థియేటర్లలోనే జనం ఆ సినిమాను చూడాలని కోరుకున్నాడు… ఆ దిశలో ప్రయత్నించి నిరాశకు గురైనవారిలో ఈ రచయిత కూడా ఉన్నాడు…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions