Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృత్రిమత్వం నుంచి సహజత్వంలోకి పారిపోయిన సినీనటి..!

October 29, 2024 by M S R

.

సీతాలు , కొండయ్య కధ 1978 లో వచ్చిన ఈ సీతామాలక్ష్మి సినిమా . Super duper musical , feel good , class & mass movie . విశ్వనాథ్ కళా తపస్సులో సిరిసిరిమువ్వ తర్వాత అలాంటి కళాత్మక మ్యూజికల్ హిట్ .

సినిమాలో అన్ని పాటలూ హిట్టే . వేటూరి , దేవులపల్లి వ్రాసిన పాటలు కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో సంగీత ప్రియులను ఈరోజుకీ అలరిస్తూనే ఉన్నాయి . దేవులపల్లి వారికి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు కూడా వచ్చింది . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , వాణీ జయరాం , జి ఆనంద్ , విజయలక్ష్మి శర్మలు పాటల్ని అద్భుతంగా పాడారు .

Ads

ఈ సినిమా స్క్రీన్ ప్లేని ముగ్గురు వండారు . విశ్వనాథ్ , జంధ్యాల , నిర్మాత మురారి . అంత పకడ్బందీగా తయారు చేసుకున్నారు కాబట్టే సినిమా అంత హిట్టయింది . స్క్రీన్ ప్లేని తెరకు ఎక్కించటంలో విశ్వనాథ్ బ్రహ్మాండంగా కృతకృత్యులు అయ్యారు .

ఎంత బాగా తీసారంటే ఈ సినిమా బ్లాక్ & వైట్ అని కూడా గుర్తుకు రాదు . కలర్ సినిమాలు విజృంభిస్తున్న కాలంలో బ్లాక్ & వైట్ సినిమాను సూపర్ హిట్ చేయడమంటే సామాన్యం కాదు . హేట్సాఫ్ టు విశ్వనాథ్ . డైలాగుల్ని జంధ్యాల వ్రాసారు .

అందమైన గ్రామీణ ప్రాంతంలోని ఓ రైల్వే స్టేషన్ కురుబల కోట రైల్వే స్టేషన్ . ఆ స్టేషన్నే వాడారు ఈ సినిమాకు . చిత్తూరు జిల్లాలో ఉంది . ఈ సినిమా సక్సెస్ అయ్యాక ఈ స్టేషన్ని సీతామాలక్ష్మి స్టేషన్ అని ఆ చుట్టుపక్కల ప్రజలు పిలుస్తూ ఉంటారట . ఈ స్టేషన్ చుట్టుపక్కల , హార్సిలీ హిల్సులో ఔట్ డోర్ షూటింగ్ చేసారు .

చంద్రమోహన్ గురించి చెప్పేదేముంది !? సిరిసిరిమువ్వ , పదహారేళ్ళ వయసు వంటి సినిమాలలో తన నట విశ్వరూపాన్ని చూపిన చంద్రమోహన్ ఈ సినిమాలో కూడా చాలా గొప్పగా నటించారు . తాళ్ళూరి రామేశ్వరికి తెలుగులో మొదటి సినిమా . ఎలాంటి ఇమేజ్ బేగేజ్ లేకుండా నటించటం వలన పాత్ర పండింది . ఆమెకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది .

వంకాయల సత్యనారాయణ . స్టేజి ఆర్టిస్టుగా ఎంతో పేరున్న వంకాయలకు ఈ సినిమా సినీ రంగంలో కూడా పాపులర్ని చేసేసింది . స్టేజి ఆర్టిస్ట్ కావటం వలన చక్కటి డిక్షన్ ఉంది ఆయనకు . తర్వాత తులసి … తులసి , రోజారమణి , శ్రీదేవి , రోహిణిలు చిచ్చరపిడుగులు . వీళ్ళందరూ పుడుతూనే ఆర్టిస్టులుగా పుట్టారా అని అనిపిస్తుంది . ఈ సినిమాలో నటించిన తులసికి ఉత్తమ బాల నటిగా నంది అవార్డు వచ్చింది .

విశ్వనాధ్ కి , బాపుకి అల్లు రామలింగయ్య మీద ప్రత్యేక శ్రధ్ధ . అల్లు పాత్రలను ప్రేక్షకులు మరచిపోకుండా ఉండేలా మలుస్తారు . సప్తపది సినిమాలో ఓపెన్ గా స్నానం . అందాల రాముడిలో తీతా . ఇలా ఎన్నో , అన్నీ . ఈ సినిమాలో ఆయన మలబధ్ధకం గోల . ఆయనతో పాటు ఓ నౌకరు , నౌకరుకి ఒక చేతిలో గొడుగు , మరో చేతిలో చెంబు . ఇదీ ఆయన కధ .

ఇతర పాత్రల్లో పల్లవి , ఈశ్వరరావు , పి యల్ నారాయణ , సాక్షి రంగారావు , డబ్బింగ్ జానకి , దేవదాస్ కనకాల ప్రభృతులు నటించారు . సినిమా హాల్లో వయ్యారంగా చిమ్మే సీతాలు సినిమా నటి కావటం , ఆ బంగారు పంజరంలో ఉండలేక తన ఐడెంటిటీని తానే చంపుకుని , తిరిగి కొండయ్య దగ్గరికి పోవటం ఈ సినిమా కధాంశం . ఈ కధలో చక్కటి పాత్ర శ్రీధర్ ది . చక్కగా , హుందాగా నటించారు .

ఇంత గొప్ప మ్యూజికల్ హిట్ సినిమా పాటల్ని తలచుకోకపోతే ఎలా ! వేటూరి వ్రాసిన సీతాలు సింగారం మాలచ్మి బంగారం బంగారు కొండయ్యంటే భగవంతుడవతారం సినిమాకు ఫ్లాగ్ షిప్ సాంగ్ . మావి చిగురు తినగానే కోయిల పలికేనా . మావిచిగురు అంటే ఖచ్చితంగా ఆ పాట దేవులపల్లి వారిదే . పదే పదే పాడుతున్నా , చాలు చాలు ఈ విరసాలు , ఏ పాట నే పాడనూ , కొక్కొరొక్కో , నువ్విట్టా నేనిట్టా మిగిలిన పాటలు . అన్నీ సూపరే .

ఈ సినిమా 1979 లో ఎనిప్పడిగళ్ టైటిలుతో రీమేక్ అయింది . శివకుమార్ , శోభ నటించారు .శివకుమార్ అంటే తమిళ హీరో సూర్య తండ్రి . 1980 లో హింందీ లోకి సితార టైటిలుతో రీమేక్ అయింది . హిందీలో మిధున్ చక్రవర్తి , జరీనా వహాబ్ నటించారు .

సీతామాలక్ష్మి సినిమా యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . ఈతరంలో చూడనివారు ఎవరయినా ఉంటే అర్జెంటుగా చూసేయండి . An unmissable musical feast . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions