.
Jagannadh Goud……. సింహం నుంచి ఒక విషయాన్ని, కొంగ నుంచి రెండు విషయాలని, కుక్క నుంచి ఆరు విషయాలని, గాడిద నుంచి మూడు విషయాలని, కాకి నుంచి అయిదు విషయాలని, కోడి నుంచి నాలుగు విషయాలని మనిషి నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి.
సింహం మృగాలని వేటాడేటప్పుడు సర్వశక్తులని ఉపయోగిస్తుంది. మనిషి కూడా తనకున్న అన్ని శక్తులని ఉపయోగించి తన అభివృద్ధికి, తమ కుటుంబ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధి కి కృషి చేయాలి.
Ads
కొంగ తన ఆహారాన్ని దేశ వాతావరణ ప్రకారం, కాలానుగుణంగా తీసుకుంటుంది. మనిషి కూడా మూడు పూటలా పూర్తిగా మెక్కకుండా తాము చేసే పనిని బట్టి, శరీర తత్వాన్ని బట్టి, శరీర అవసరాలని అనుగుణంగా, కాలాలకి అనుగుణంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, అదీ తగినంత మోతాదులో మాత్రమే.
కుక్క చిన్న చిన్న వాటికి సంతోషపడుతుంది, చక్కటి నిద్ర పోతుంది, అవసరమైనంత మాత్రమే భుజిస్తుంది, తగిన సమయానికి నిద్ర లేస్తుంది, నమ్మిన బంటుగా ఉంటుంది, అన్నిటి కంటే ముఖ్యంగా అవతల ఉంది చిన్న జంతువు అయినా, పెద్ద జంతువు అయినా తన పరాక్రమాన్ని చూపిస్తుంది. మనిషి కూడా ఈ ఆరు లక్షణాల్ని కుక్క నుంచి నేర్చుకొని పాటించాలి.
గాడిద తను మోయలేనంత బరువు కూడా మోయడానికి ప్రయత్నిస్తుంది, వాతావరణాన్ని లెక్క చేయకుండా పని చేస్తుంది, ఎంత పని చేసినా మరియూ అలిసి పోయినా బాధ పడకుండా సుఖంగా ఉంటుంది. మనిషి కూడా తాను చేయగలిగినంతకంటే కొంత ఎక్కువే చేయటం మరియూ తన పరిస్థితులు ఎలా ఉన్నా సుఖంగా ఉండటం గాడిద నుంచి నేర్చుకొని పాటించాలి.
కాకి కఠినంగా ఉంటుంది (ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించే మొండితనం ఉంటుంది), ఇల్లు నిర్మించుకోవటంలో జాగరూకత చూపిస్తుంది, సోమరితనం లేకుండా ఉంటుంది, అడ్డగోలు శృంగారం చేస్తుంది, ఎవరినీ పూర్తిగా నమ్మదు మరియూ చాలా పరిశీలనగా, ఓపి గా ఉంటుంది. మనిషి కూడా కాకి నుంచి ఈ అయిదు లక్షణాలు వంట పట్టించుకోవాలి.
కోడి పోరాటంలో వెనక్కి తగ్గదు, ఉదయాన్నే నిద్ర లేస్తుంది, కుటుంబంతో కలిసి భుజిస్తుంది, ఆపద వచ్చినప్పుడు తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. మనిషి కూడా ఈ నాలుగు లక్షణాలని కోడి నుంచి నేర్చుకొని పాటించవచ్చు….. – పెద్దల మాటలు (పూర్తి వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article