ఆల్‌రెడీ మలయాళంలో ఒరిజినల్ రిలీజై ఏడాది… హీరో మోహన్‌లాల్… మధ్యలో తెలుగులో కూడా రిలీజైంది… హీరో వెంకటేష్… అద్భుత విజయం సాధించిన దృశ్యం సినిమాకు సీక్వెల్ దృశ్యం-2 గురించి చెప్పుకుంటున్నాం మనం… కథ మీద ఇంట్రస్టుతో చాలామంది హిందీ ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళమో, తెలుగో సబ్ టైటిళ్లు పెట్టుకుని చూశారు కూడా…
ఐతేనేం… హిందీలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్… మూడేమూడు రోజుల్లో పెట్టిన పెట్టుబడి వచ్చేసింది… థియేటరేతర రెవిన్యూ గాకుండా… ముంబైలోనే 1052 షోలు… ఇక దేశవ్యాప్తంగా..? 5 కోట్లో, 6 కోట్లో వస్తుందిలే అనుకున్నారు పంపిణీదారులు… ఆదివారం ఏకంగా 27 కోట్ల షేర్ వచ్చింది సినిమాకు… ఈమధ్యకాలంలో ఓ హిందీ సినిమా ఈ రేంజులో కలెక్షన్లు సాధించిందీ అంటే గ్రేటే… ఈ లెక్క ఎందుకు అంటే… మొన్నమొన్నటిదాకా వరుస ఫ్లాపులతో విపరీతంగా దెబ్బతిన్న హిందీ సినిమా కోలుకుని, మళ్లీ పరుగు పెడుతోంది అని చెప్పడానికి…
అనేక థియేటర్లు మళ్లీ జనంతో కళకళలాడుతున్నాయి అని చెప్పడానికి… సినిమా బాగుంటే, బాగుందనే టాక్ ఉంటే ఓటీటీ బదులు థియేటర్లకు రావడానికి మేం రెడీ అని చెబుతున్నారు ప్రేక్షకులు, ఇదే నిదర్శనం… అన్నట్టు సినిమాకు పెట్టిన ఖర్చు 50 కోట్లు… థాంక్ గాడ్… ఆ దిక్కుమాలిన గ్రాఫిక్స్ వాసన కూడా కనిపించదు మీకు… వందల కోట్ల తప్పుడు లెక్కలు అవసరమే లేదు… ప్రతి రాష్ట్రంలో ప్రమోషన్లు, మీటింగులు కూడా ఏమీ లేవు… సినిమాలో దమ్ముంది… దుమ్ము రేపుతోంది, అంతే…
Ads
నిజానికి కంగన రనౌత్ ఎక్కడో మెచ్చుకుంటోంది… ఈ వయస్సులో కూడా టబు హిందీ సినిమాకు మళ్లీ పాత వైభవం తీసుకొస్తోంది అని… టబు కాదు, మెచ్చాల్సింది అజయ్ దేవగణ్… ఆర్ఆర్ఆర్, గంగూభాయి సినిమాల్లో తనది ప్రయారిటీ పాత్రలేమీ కావు… అతిథి పాత్రలు… రన‌్‌వే 34 ఫ్లాప్… థాంక్ గాడ్ మూవీ జస్ట్, సేఫ్… ఈ స్థితిలోనూ డిప్రెషన్‌కు గురికాలేదు… దృశ్యం-2 హిట్‌తో మళ్లీ తొవ్వలోకి వచ్చిపడ్డాడు… ఇప్పుడు తన దృష్టంతా భోలా మూవీపై… తన సొంత సినిమా… తనే హీరో… తనే దర్శకుడు…
అక్షయ్ కుమార్ కూడా అంతే… వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్… ఇప్పుడు రామసేతుతో కాస్త తేరుకున్నాడు… అది ఫ్లాప్ అని ప్రచారం జరిగినా 100 కోట్లు వసూలు చేసింది… తెరిపిన పడ్డాడు… తమిళ సూపర్ హిట్ సూరూరం పొట్రు రీమేక్ సహా చేతిలో నాలుగు సినిమాలున్నయ్ ఇప్పుడు… అమితాబ్ నటించిన ఉంచాయి కూడా 35 కోట్లు వసూలు చేసింది ఇప్పటికే… సేఫ్ ప్రాజెక్టు… ఇదీ ప్రస్తుతం హిందీ థియేటర్ల ప్రస్తుత దృశ్యం-2… దృశ్యం-2 అంటే కరోనా అనంతర దృశ్యం అన్నమాట…
Share this Article