బీజేపీ వ్యతిరేక పోరాటంలో అసలు సమస్య ఏమిటంటే…? ప్రధానంగా హిందూవ్యతిరేకత… మమత, కేసీయార్, స్టాలిన్, అఖిలేష్, లాలూ ఎట్సెట్రా… వాళ్ల మీద పడ్డ ముద్ర ఏమిటంటే… వాళ్లు హిందూ వ్యతిరేకులు అని…! ఒకవైపు భారత్‌ను టార్గెట్ చేసుకుని, ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలు ఏదో సాకు చూపి మీదపడుతున్నయ్… కానీ యాంటీ-బీజేపీ క్యాంపులన్నీ మరింతగా యాంటీ-హిందు పోకడలతో సాగిపోతున్నయ్…
రాష్ట్రపతి ఎన్నికల అనేది మోడీ ప్రభుత్వానికి జుజుబీ… అది సోనియాకు తెలుసు, మమతకు తెలుసు… తెర వెనుక కేసీయార్‌కు అందరికన్నా ఎక్కువ తెలుసు… కానీ తెరపై కనిపించే దృశ్యాలు వేరు… తెర వెనుక నిజాలు వేరు… ఎవరు ఊహిస్తారు..? ఠాక్రే భావజాలాన్ని పాతరేసి మజ్లిస్‌తో శివసేన సయోధ్యతో వ్యవహరిస్తుందని..!
ఏయ్, మోడీ దమ్ముందా..? అని సవాల్ విసిరే మమత పట్ల గానీ, కేసీయార్ పట్ల గానీ…. బీజేపీ తెర మీద ప్రదర్శించేది వేరు… వాస్తవాలు వేరు… ఒకవైపు సోనియా ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రయత్నాల్లో పడిందీ అనే వార్తలు వచ్చాయో లేదో, వెంటనే మమత రంగంలోకి దిగింది… ఏటేటా రసగుల్లాలు, డ్రెస్సులు పంపించే తన రాజకీయ సోదరుడి కోసం ప్రయత్నాల్లో పడింది… పడుతుంది… ఇదంతా ఓ జాతీయ రాజకీయ మర్మం…
Ads
నో, నో, సోనియా ఏమిటి..? నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను, మీరంతా రండి, మాట్లాడదాం అని భేటీ ఏర్పాటు చేసింది… సహజంగానే సోనియాకే ప్రథమ ఆహ్వానం… ఆమెకు తెలుసు కదా… బీజేపీ ప్రధాన ప్రత్యర్థిని, అయితే గియితే మేం కదా రాబోయే రోజుల్లో సర్కారును ఏర్పాటు చేసేది, నడుమ ఈ మమత ఎవరు అనే ఇగోను రెచ్చగొట్టింది… వెరసి యాంటీ-బీజేపీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రయత్నాలకు పాతరేసే పనిలో పడింది మమత…
పైన ఫోటో చూడండి… మాయావతి, చక్రాలు తిప్పే చంద్రబాబు… పక్కన సోనియా… కానీ ఇప్పుడు ఆమె ‘‘కలిసి మాట్లాడుకుందాం రండి’’ అని పంపించిన ఆహ్వాన పత్రికల జాబితాలో ఆ చంద్రబాబు లేడు, ఆ మాయావతి లేదు… జగన్ కూడా లేడు… ఎందుకు..? భయంతో ఉన్న చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా పోయే సీన్ లేదు, ఆల్రెడీ గత ఎన్నికల ముందు సవాళ్లు విసిరీ విసిరీ అడ్డంగా బోల్తాకొట్టాడు కాబట్టి…. మాయావతి, జగన్ బీజేపీ బీ-టీంలు అని మమత ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది…
తనే కాదు, గత ఎన్నికల్లో తన వోట్లు చీల్చడానికి బెంగాల్‌లో పోటీకి దిగిన మజ్లిస్‌ను కూడా ఆమె బీజేపీ బీ-టీంగానే పరిగణిస్తోంది కాబట్టి… ఒవైసీని కూడా పిలవలేదు, పిలవదు… అంటే పూర్తిగా తన కోణంలో మాత్రమే ఉద్దేశించిన ఓ ప్రతిపక్ష ఐక్యత అనే ఓ ప్రహసనం… ఓసారి ఈ జాబితా చూడండి… ఆమె ప్రయత్నాల్లోని చిత్తశుద్ధిని అంచనా వేద్దాం ఓసారి…
సరే, కేసుల భయంతో జగన్, జగన్ నుంచి రక్షణకు చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా పోవడానికి వణికిపోతున్నారు సరే… కేసీయార్‌ను అలా వదిలేయండి… తను మూడేళ్లుగా మోడీ వ్యతిరేక పోరాటంలో ఏం చేశాడో చూశాం… చేయబోయేది కూడా పెద్దగా డిఫరెంట్ ఏమీ ఉండదు… సరే, కేసీయార్ దోస్త్ ఒవైసీని కూడా మమత నమ్మదు అనుకుందాం… బీజేపీ మరో బీ-టీం మాయావతి అనుకుందాం… కానీ…?
కేరళ సీఎం కాబట్టి పినరై విజయన్ రావాలట… ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రావాలట… ఇది వ్యక్తుల భేటీయా..? పార్టీల భేటీయా..? ఏచూరి వస్తే చాలదా…? పైగా అదే బెంగాల్‌లో అదే సీపీఎంను మమత తొక్కీ తొక్కీ నారతీసింది… ఆమె యాంటీ-మోడీ అని గొంతువిప్పి హైపిచ్‌లో అరవగానే వీళ్లు వెళ్లి ఆమె దగ్గర జీహుజూర్ అని మోకరిల్లాలా..?
సేమ్, సీపీఐ… దానికి ఇప్పుడు దేశంలోనే ఓ దశ లేదు, ఓ దిశ లేదు… ఉండీ లేనట్టు కొట్టుకునే పార్టీ… జేడీఎస్ అధినేత దేవెగౌడ రావాలట, ఓ మాజీ సీఎంగా కుమారస్వామి రావాలట… తీరా చూస్తే వోట్ల సంఖ్యలో ఆ పార్టీని దేకినోళ్లే లేరు… అసలు ఈ ఈక్వేషన్స్‌లో నవీన్ పట్నాయక్ ఎలా ఫిట్టయ్యాడు..? ఆప్ అధినేత కేజ్రీవాల్ రావాలట, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ రావాలట… ఇదేమిటో మరి… సోనియాను ప్రత్యేకంగా పిలిచేబదులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సోనియా చేసే ప్రయత్నాలకు మద్దతుగా నిలవొచ్చు కదా… ఇలా బోలెడు ప్రశ్నలు, సందేహాలు… అసలు మమత అడుగులే పెద్ద ప్రశ్నార్థకం..!! ఈ మమతలు, ఈ కేసీయార్‌లే బీజేపీకి శ్రీరామరక్ష…. పాపం శమించుగాక…!!
Share this Article