కిషోర్ కుమార్ జయంతి ఇవాళ… 70వ దశకంలో దేశాన్ని ఊపేసిన చలనచిత్ర నేపథ్య గాయకుడు కిషోర్ కుమార్. అప్పటికే రఫీ మహోన్నతమైన గాయకుడుగా విలసిల్లుతున్నారు. 50, 60 దశాబ్దులు రఫీవి ఐతే 70వ దశకాన్ని కిషోర్ కుమార్ ఆక్రమించుకున్నారు.
కిషోర్ కుమార్ 1948లోనే జిద్ది సినిమాలో నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారు. మన దేశ సినిమాల్లో నమోదైన తొలి baritone గాయకుడు కిషోర్ కుమార్! కిషోర్ కుమార్ 1969 నుంచి ఊపందుకున్న గాయకుడైనారు.
తలత్, రఫీ, మన్నాడేలలా కాకుండా కిషోర్ open throat singing చేశారు. మన దేశ సినిమాల్లో yodelling చేసిన తొలి గాయకుడు కిషోర్. నై దిల్లీ సినిమాలో శంకర్- జైకిషన్ సంగీతంలో “నఖరీ వాలీ…” పాటలో కిషోర్ తొలిగా, గొప్పగా yodelling చేశారు.
Ads
ఎస్.డి. బర్మన్, ఆర్.డి. బర్మన్, కళ్యాణ్ జీ – ఆనంద్ జీ ల సంగీతంలో కిషోర్ గొప్ప పాటలు పాడారు; గొప్పగా పాడారు. ఘర్ ఘర్ కీ కహానీ సినిమాలో కళ్యాణ్ జీ – ఆనంద్ జీ సంగీతంలో “సమాహే సుహాన…” పాట కిషోర్ గొప్పగా పాడిన పాటల్లో ఒకటి. ఆర్. డి. బర్మన్ సంగీతంలో కిషోర్ ఎన్నో గొప్ప పాటల్ని ఎంతో గొప్పగా పాడారు.
అమర్ ప్రేమ్ సినిమాలో “చింగారీ కోయీ…” పాట mood and modulation తో కిషోర్ ఎంతో బాగా పాడారు. ఆర్. డి. బర్మన్ సంగీతంలో ఖుద్రత్ సినిమాలో “హమే తుంసే ప్యార్…” పాటను విశేషంగా పాడారు. ఎస్.డి. బర్మన్ సంగీతంలో శర్మిలీ సినిమాలో “కైసే కహే హం ప్యార్ నే హంకో…” పాటను కిషోర్ అత్యున్నతంగా పాడారు. 1955లోనే సజ్జాద్ హుస్సైన్ సంగీతంలో రుఖ్సానా సినిమాలో ” ఏ చార్ దిన్ బహార్ కీ… ” పాటనూ, ” తేరే జహాన్ సే చల్ దియా…” పాటనూ జనరంజకంగా పాడారు. పలువురు సంగీత దర్శకుల పలు గొప్ప పాటల్ని కడుగొప్పగా పాడారు. ఆర్. డి. బర్మన్ కిషోర్ ను “god gifted singer” అన్నారు.
కిషార్ కుమార్ ఒక సంగీత దర్శకుడుగా గొప్ప పాటల్ని చేసేలా పాడారు. దూర్ కా రాహీ సినిమాలో “బేకరార్ దిల్ తు గాయే జా…” పాట అందుకు ఒక మచ్చుతునక. చాల గొప్పగా చేశారు కిషోర్ ఈ పాటను. ఝుంరూ సినిమాలో “కోయీ హమ్ దమ్ నరహా” పాట ఆయన్ను ఒక గొప్ప సంగీత దర్శకుడు అన్న నిజాన్ని మనకు విశదపరుస్తుంది. సరస్వతీ దేవి 40 లలో చేసిన ఒక పాటలోని చిన్న melody ని తీసుకుని కిషోర్ ఈ పాటను గొప్పగా చేశారు.
కిషోర్ గొప్ప గాయకుడు మాత్రమే కాదు గొప్ప నటుడు కూడా! కథ, స్క్రిప్ట్, దర్శకత్వం వంటి వాటిల్లోనూ కిషోర్ తన ప్రతిభను ప్రదర్శించారు.
భారతదేశ సినిమాకు అంతర్జాతీయను తీసుకొచ్చిన సత్యజిత్ రే పథేర్ పాంచాలి సినిమా నిర్మాణం ఒక దశలో ఆగిపోతే ఆ సినిమా గొప్పతనాన్ని అర్థం చేసుకుని కావాల్సిన ధన సహాయం చేశారు కిషోర్. సినిమాపరంగా కిషోర్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. నేపథ్య గానంపరంగా ‘ఒక ధోరణి (genre)’ కిషోర్… కిషోర్ కుమార్ స్మరణలో… రోచిష్మాన్.. 9444012279
Share this Article