మొత్తానికి రాజ్‌తరుణ్ – ఆయన పాత సహజీవని లావణ్య బ్రేకప్ యవ్వారం కాస్తా ఓ మాంచి మసాలా వెబ్ సీరీస్‌లాగా… రకరకాల ట్విస్టులతో కొనసాగుతూనే ఉంది… ముందుగా ఈ యవ్వారం నేపథ్యం తెలియని వాళ్ల కోసం కాస్త సంక్షిప్తంగా పాత కథ ఇదీ…
రాజ్‌తరుణ్ పదీ పదకొండేళ్లుగా లావణ్య అనే అమ్మాయితో సహజీవనంలో ఉన్నాడు… అది రాజ్‌తరుణ్ కూడా అంగీకరిస్తున్నాడు… ఈమధ్య ఆమెను వదిలేసి వేరే వాళ్లతో తిరుగుతున్నాడని ఆరోపణ… ఆమే చేసింది… అవును, ఆమెకు డ్రగ్స్ అలవాటు, వేరేవాళ్లతో సంబంధం ఉంది అని ఉల్టా ఆరోపిస్తున్నాడు రాజ్‌తరుణ్… ఇలాంటి వ్యవహారాల్లో చాలామంది మగాళ్లలాగే రాజ్‌తరుణ్ కూడా కేరక్టర్ అసాసినేషన్‌కు పూనుకున్నాడు…
మరి సహజీవనం దేనికమ్మా, పెళ్లి చేసుకోకపోయారా అంటే… తాళి కట్టాడు, కానీ ఆ ఫోటోలు మిస్ అంటోంది… అబ్బో, తెలివి కాస్త ఎక్కువగా ఉన్నదే… డ్రగ్స్ కేసులో అరెస్టయిందట, కానీ ఆ అలవాటు లేదట… రాజ్‌తరుణ్‌కు మాన్వి మల్హోత్రా అనే సినిమా నటితో సంబంధం ఉందని లావణ్య ఆరోపించింది… అనవసరంగా నన్ను బజారుకీడ్చి బదనాం చేస్తున్నారంటూ సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది…
Ads
ఇప్పుడు లావణ్య (ఒకదానితో ఒకటి పొంతన లేని ట్విస్టులు తిప్పుతూ పోతోంది ఆమె ఈ కథను…) తాజాగా బోల్డ్ యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీకి రాజ్‌తరుణ్‌కు సంబంధం ఉందని ఆరోపిస్తోంది… ఆమెనూ బజారుకీడుస్తోంది… అంతేకాదు, రాజ్‌తరుణ్ కేరక్టరే బ్యాడ్, చాలామందితో సంబంధాలు పెట్టుకున్నాడంటోంది… మరిన్నాళ్లూ ఎందుకు మాట్లాడలేదు..? ఆమె దగ్గర జవాబు లేదు…
‘‘అరియానాతో రాజ్‌తరుణ్ ఒక్కరోజే షూైటింగుకు వెళ్లాడు, కానీ నేను ఓ కోర్స్ కోసం 3 నెలలు గోవా వెళ్లేసరికి వాళ్లిద్దరూ దగ్గరయ్యారు, ఇదెవరో చెప్పలేదు, రాజ్‌తరుణ్ మేనేజర్, నటుడు రాజారవీంద్ర ఫోన్ చేసి చెప్పారు, వెంటనే గోవా నుంచి వచ్చేశాను… నాకు రాజ్‌తరుణ్ కావాలి, తనెలాంటివాడైనా పర్లేదు… ఎంతమందితో సంబంధాలు పెట్టుకున్నా సరే… నాకు మస్తాన్ అనే వ్యక్తితో అఫైర్ ఉందని, అతను నన్ను పెళ్లి చేసుకోవడం లేదని కేసు కూడా పెట్టానని అంటున్నారు గానీ అవన్నీ ఫేక్, వీళ్లు క్రియేట్ చేసినవే…’’
‘‘రాజ్‌తరుణ్‌తో సంబంధాలున్న హీరోయిన్ల పేర్లు చెబితే వాళ్లు కేసులు పెడతారని ఆగిపోతున్నా… మొదట్లో తనకు ఓ లవర్, నేను పరిచయమయ్యాక అది క్లోజ్… తరువాత ఇద్దరి లోకం ఒకటే సినిమా హీరోయిన్ (షాలిని పాండే..?) తో ఎఫైర్… తరువాత అరియానా, తరువాత మాల్వీ మల్హోత్రా…’’ అంటోంది… హీరోయిన్లు పేర్లు బయటపెట్టను అంటూనే షాలిని పేరునూ పరోక్షంగా చెప్పేస్తోంది… నన్ను మాల్వీ మల్హోత్రా బెదిరిస్తోంది అంటోంది, కానీ తనే బెదిరించే ఆడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి…
ఆమె డ్రగ్స్ కేసులో ఉండి, ఓసారి జైలుకు వెళ్లడమే నిజం కావచ్చుగాక… కానీ ఆమె ఏం చెప్పినా, ఎన్ని కేసులు పెట్టినా లీగల్‌గా రాజ్‌తరుణ్‌ను బుక్ చేయడం కష్టం… సహజీవనంలోని సంక్లిష్టత, సున్నితత్వం అదే… దానికి చట్టబద్ధత కష్టం… చట్టం గుర్తించని బంధానికి విడాకులూ ఉండవు… పోనీ, మోసం చేశాడు అనడానికీ ఆస్కారం లేదు, ఇద్దరూ ఇష్టపడే కలిసి ఉన్నారని వాళ్లే చెబుతున్నారు… ఇప్పుడు ఇద్దరికీ పడటం లేదు, అంతే… పైగా ఆమె ఘడియకో మాట చెబుతోంది… ఎవరెవరినో బజారుకు లాగుతోంది… భలే సహజీవనితో ‘కాపురం’ చేశావోయి రాజ్‌తరుణ్..!!
Share this Article