భక్తులు… పట్టణంలోకి ఏ మఠాధిపతినో పల్లకీలో ఊరేగిస్తూ, తాము పల్లకీ మోస్తూ తీసుకొస్తారు… ఆయన ఏవో పూజలు చేస్తాడు… ప్రవచనాలు చెబుతాడు… ఆ సీన్ చూస్తే, ఆ వార్త చదివితే మీకు ఏమనిపిస్తుంది..? అందులో తప్పేముంది..? స్వాములు ఇల్లిల్లూ తిరుగుతూ పాదపూజలు చేయించుకుని, దండిగా కానుకలు దండుకోవడం లేదా..? కొందరైతే పాదతాడనాలకూ డబ్బు తీసుకుంటారుగా… దొంగ బాబాలైతే నానా ఛండాలం పనులు చేయించుకుని భ్రష్టుపట్టించడం లేదా..? వాటితో పోలిస్తే ఈ పల్లకీ సేవలో తప్పేముంది… అది ఆ భక్తుల నమ్మకం, భక్తి… ఎందుకు తప్పుపట్టాలి అనిపిస్తోందా..?
భలేవారే… తమిళనాడులో అంత వీజీగా ఉండదు… ఏదైనా సరే, ఏదో ఓ వివాదంలోకి లాగేస్తుంటారు… ఇదీ అలాంటి వార్తే… ఈనెల 27న ధర్మపురం ఆధీనం (గుడి)కు చెందిన మసిలమణి దేశిక జ్ఞానసంబంధ పరమాచార్య స్వామి రావల్సి ఉంది… కానీ మయిలదుతురై ఆర్డీవో బాలాజీ ఏం చేశాడంటే… ఠాట్ వీల్లేదు, వాటీజ్ దిస్ నాన్సెన్, నేనొప్పుకోను అని బ్యాన్ చేశాడు, ఆర్డర్స్ ఇచ్చేశాడు… ఇదేందిరా అయ్యా, 500 ఏళ్ల నుంచి ఉన్న ఆచారం ఇది, ఐనా మేం మాకు నచ్చిన స్వామిని, పల్లకీలో ఊరేగిస్తే నీకొచ్చిన నష్టేమేంటి..? భుజాల మీద ఎక్కించుకొస్తాం, నీ ప్రాబ్లం ఏమిటి అనడిగితే… అది మానవ హక్కుల ఉల్లంఘన నేనొప్పుకోను అన్నాడు…
భలే దొరికింది స్టాలిన్ సర్కారు… డీఎంకే ఎంత హేతువాద (?) పార్టీ అయితేనేం..? అది అధికారంలోకి వస్తే ఇక హిందువుల మత విశ్వాసాలు, స్థానిక మనోభావాలను దెబ్బతీయాలా..? మేం ప్రతిఘటిస్తాం అని వెంటనే బీజేపీ రంగంలోకి దిగిపోయింది… తమిళనాడు బీజేపీ పాత బీజేపీ కాాదు… మాజీ ఐపీఎస్ అన్నామలై అక్కడ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక చాలా దూకుడుగా ఉన్నాడు… నేను స్వయంగా వెళ్లి ఆ పల్లకీ మోస్తాను అని సవాల్ విసిరాడు… హిందూ మక్కల్ కచ్చి అనే మరో దూకుడు హిందూ సంస్థ ఆందోళనలకు సిద్దమైపోయింది… మేమెక్కడ వెనుకబడతామో అన్నట్టుగా అన్నాడీఎంకే ఎంటరైపోయింది… డీఎండీకే ఈ బ్యాన్‌ను విమర్శించింది…
Ads
నరనరాన హిందూ వ్యతిరేకతను నింపుకున్న సీపీఎం పార్టీ బాలకృష్ణన్ ఎంటరైపోయి… ఆ సంప్రదాయ మానవతకు మచ్చ, బ్యాన్ చేయడం కరెక్టే అన్నాడు… ఇందులో మానవత్వ సంబంధం ఏముంది..? మానవహక్కులతో లింక్ ఏముంది..? అది హిందువుల సంప్రదాయం, మనం వ్యతిరేకించాలి, అంతే… అదొక్కటే సీపీఎంకు తెలిసిన సిద్ధాంతం… అదేమంటే..? 1960లోనే దాన్ని నిషేధించారు అని గుర్తుచేస్తారు… తమిళనాడులో మరో వీర హిందూద్వేష ఎంపీ ఉన్నాడు… పేరు థోల్ తిరుమాయాలవన్… తను విడుతలి చిరుతైగైగల్ కచ్చి సంస్థకు చీఫ్ కూడా… ఈ సంప్రదాయం అప్రజాస్వామికం అని వాదిస్తున్నాడు… ఇందులో డెమోక్రసీకి వచ్చిన నష్టమేమిటయ్యా అంటే జవాబు ఉండదు…
ద్రవిడ కజగం (డీాకే) అని మరో పెరియారిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది… దాని ఉపాధ్యక్షుడు కాలి పూంగుండ్రన్ ఏమంటాడంటే..? ‘‘మానవ హక్కుల అంశంపైనే దీన్ని 1960లోనే వదిలేశారు… యాభై ఏళ్లుగా ఎవరికీ పట్టని ఆ పాత సంప్రదాయాన్ని కావాలనే మళ్లీ స్టార్ట్ చేస్తున్నారు..’’ ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన ఏముంది అనడిగితే నో ఆన్సర్… ఓ ప్రతినిధి బృందం నేరుగా సీఎం ఆఫీసుతో మాట్లాడి, స్టాలిన్‌ను మే ఏడున కలిసింది… బ్యాన్ ఎత్తేయాలని కోరారు… ఇక్కడే స్టాలిన్ తెలివిగా ఆలోచించాడు…
బీజేపీకి, అన్నాడీఎంకే తదితర పార్టీలకు ఓ చాన్స్ ఇవ్వదలుచుకోలేదు… ఆ పాత సంప్రదాయంతో నష్టమేమీ లేదు… తను హిందూ వ్యతిరేకిగా ముద్రపడ దల్చుకోలేదు… ఏదైనా ఇష్యూ తలెత్తితే అందులో పెట్రోల్ పోసే చాన్స్ తమ మిత్రపక్షాలైనా సరే సీపీఎం వంటి పార్టీలకు ఇవ్వదలుచుకోలేదు… సరే, నేను చూస్తాను, మీరు వెళ్లండి అని ఆ ప్రతినిధి బృందానికి చెప్పాడు… తరువాత తమిళనాడు ప్రభుత్వం ఆ బ్యాన్ ఎత్తేసింది… పట్టిన ప్రవేశానికి దారి క్లియరైంది..!!
Share this Article