Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు తండ్రిని నేనేనా..?! కుటుంబ వ్యవస్థనే కూల్చేసే ‘పితృత్వపరీక్షలు’..!!

November 26, 2025 by M S R

.

ఎప్పటి నుంచో ఉన్నదే కదా… తల్లి నిజం, తండ్రి నమ్మకం..! అంతేకదా మరి..! ఒకవేళ పిల్లలు తనకు పుట్టినవారేనా..? (జెనెటిక్ పేరెంట్) ఈ సందేహాలు చాలామంది తండ్రులకు వస్తుంటాయి… గతం వేరు… ఇప్పుడు డీఎన్ఏ పరీక్షలు వచ్చాయి… అసలు తండ్రేనా కాదా తేల్చేస్తాయి అవి…

కానీ….. ఈ డీఎన్ఏ పెటర్నటీ పరీక్షలు ఓ సామాజిక సంక్షోభాన్ని క్రియేట్ చేస్తాయి… కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి… విడాకుల రేట్ పెరుగుతుంది… వెరసి పిల్లలు అభద్రతలోకి నెట్టేయబడతారు… సొసైటీ ఓ కల్లోలక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది…

Ads

నిజం… ఉగాండాలో జరుగుతున్నది అదే… లేబరేటరీల ఎదుట తండ్రులు క్యూలు కడుతున్నారు… తమ పిల్లలు నిజంగా తమకు పుట్టినవారేనా తేల్చుకోవడానికి..!

  • షాకింగ్ ఫలితాలు…: ఉగాండా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించిన దాని ప్రకారం…

    • స్వచ్ఛందంగా పరీక్షలకు వస్తున్న వారిలో 95% మంది పురుషులే…

    • అయితే, వీరిలో 98% కంటే ఎక్కువ మంది పురుషులు ఆ పిల్లలకు జీవసంబంధ తండ్రులు కారని ఫలితాలు వస్తున్నాయి…

  • ప్రభావం…: ఈ ఫలితాలు ఆయా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి, అనేక వివాహాలు విచ్ఛిన్నం అవుతున్నాయి…

  • ప్రభుత్వ హెచ్చరిక…: పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి “గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ పరీక్షలకు వెళ్లవద్దు” అని బహిరంగంగా హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది…

కొన్ని ప్రముఖ కేసులు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పురుషుల్లో తమ పిల్లలపై అనుమానాలు పెరిగాయి… ఆస్తి పంపకాలు, విడాకుల కేసులలో కూడా ఈ పరీక్షలు కీలకంగా మారుతున్నాయి…

సంప్రదాయ పెద్దలు, మత గురువులు కుటుంబాలు నిలబడాలని, పిల్లలు ఎలా పుట్టినా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, ఆధునిక సాంకేతికత బయటపెడుతున్న నిజాలు సమాజంలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి…

ఇదంతా చదువుతుంటే… ఆమధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు గుర్తొచ్చింది ఎందుకో హఠాత్తుగా… పిల్లలకు తను జెనెటిక్ ఫాదర్ అని తేలినా సరే… ఇంకెవరికో పుట్టినా సరే… ఆ పిల్లల బాధ్యత ఈ తండ్రిదే అనే తీర్పు…

ఒకసారి నిజం బద్ధలయ్యాక… ఇక ఆ కుటుంబం నిలబడటం కష్టం… ప్రత్యేకించి భారతీయ సమాజంలో మరీ కష్టం… మరీ వారసత్వాలు, విడాకులు, భరణం, ఆస్తి పంపకాలు వంటి కేసుల్లో తప్ప మన సమాజంలో డీఎన్ఏ పరీక్షలకు అనుమతి లేదు… కానీ ఉగాండా..?

  • 98% పురుషులు తమ పిల్లలకు జీవసంబంధ తండ్రులు కారని తేలడం అనేది ఒక సాధారణ అనుమానం లేదా చిన్న సమస్య కాదని, అది ఒక తీవ్రమైన సామాజిక సంక్షోభం…

 

  • కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం: నమ్మకం, విశ్వాసం అనే పునాదులపై నిలబడే వివాహ వ్యవస్థ, ఈ ఫలితాల కారణంగా వేగంగా కూలిపోయే ప్రమాదం ఉంది… అనేక కుటుంబాలు విడిపోవడం, పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి పరిణామాలు ఉంటాయి…

  • మానసిక ఆందోళన: తండ్రులు తమ జీవిత భాగస్వామి పట్ల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారు. అలాగే, తాము సంవత్సరాలుగా పెంచుతున్న పిల్లలు తమవారు కాదనే నిజం తెలుసుకున్నప్పుడు తీవ్రమైన మానసిక వేదనకు, కోపానికి గురవుతారు…

  • పిల్లల భవితవ్యం: పితృత్వ పరీక్షలలో ‘నెగిటివ్’ ఫలితం వచ్చిన పిల్లలు సామాజికంగా నిరాదరణకు, వివక్షకు గురయ్యే ప్రమాదం ఉంది… వారి విద్య, ఆస్తి హక్కులు, భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశం ఉంది…

  • ఆస్తి వారసత్వంపై ప్రభావం: తమవారని భావించి ఆస్తిని వారసత్వంగా అందించాలని అనుకున్న తండ్రులు, ఇప్పుడు ఆ పిల్లలు తమవారు కాదని తేలడంతో, ఆస్తి పంపకాల విషయంలో పెద్ద న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయి…


ఈ గణాంకాలు (98% నెగిటివ్ ఫలితాలు) ఆ సమాజంలో అక్రమ సంబంధాలు (Infidelity) లేదా వివాహేతర సంబంధాలు చాలా సాధారణం అయ్యాయనే వాస్తవాన్ని బలపరుస్తున్నాయి…

    • నిజాయితీ లేమి: చాలా మంది మహిళలు తమ భాగస్వాములను మోసం చేశారనడానికి ఈ ఫలితాలు ప్రత్యక్ష ఆధారంగా నిలుస్తున్నాయి…

    • సంస్కృతి లేదా ఆర్థిక కారణాలు: అక్రమ సంబంధాలు పెరగడానికి సాంస్కృతిక కారణాలు, ఆర్థిక అభద్రత లేదా లింగ సంబంధాలలో అసమానతలు కూడా కారణం కావచ్చు… కొన్నిసార్లు, జీవన పరిస్థితులు, భర్త దూరంగా ఉండటం వంటి అంశాలు కూడా దీనికి దారితీయవచ్చు…

డీఎన్ఏ పరీక్షలను అధికారికంగా నిషేధించడమా..?  లేక ఈ పరీక్షల ద్వారా బయటపడుతున్న సామాజిక వాస్తవాన్ని అంగీకరించి, దానికి దారితీస్తున్న సామాజిక, ఆర్థిక, నైతిక కారణాలను పరిష్కరించడానికి కృషి చేయడమే దీర్ఘకాలంలో మంచి మార్గమా..? పే--ద్ధ చిక్కు ప్రశ్న..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…
  • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
  • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions