శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు… అంతే కదా… ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి, గోడల్ని తడిమి చూసి, వీడియోలు తీసి, అక్కడక్కడా కాస్త తవ్వి శాసనాలు తీసి చదివి ఓ రిపోర్టు ఇస్తే అది నిజం అయిపోయింది… నిజానికి జస్ట్, ఆ గోడల్ని చూస్తే చాలు, జ్ఞానవాపి మసీదును ఓ భారీ ఆలయాన్ని కూల్చేసి కట్టారని తెలుస్తుంది…
ఇదేమీ బాబ్రీ కట్టడం కాదు, పూర్తిగా నేలమట్టం చేసి దానిపై మసీదు కట్టలేదు… ఆ గోడలు, హిందూ ఆలయ స్థంభాలు అలాగే ఉన్నాయి… తవ్వితే గుడి గాకుండా, ఆ శాసనాలు గాకుండా ఇంకేం బయటపడతాయి..? అదీ పలు ద్రవిడ భాషల్లో శాసనాలు… అది ఇంట్రస్టింగ్ అనిపించింది… ఆ చరిత్ర తెలుసుకోవాలని ఉంది… అక్కడిదాకా విస్తరించిన ఏ తెలుగు సామ్రాజ్యకాలంలో ఆ గుడి నిర్మితమైంది… ఆ చక్రవర్తి ఎవరు..?
Ads
అయోధ్యలాగే దీనిపైనా దశాబ్దాలుగా వివాదం ఉంది… ఔరంగజేబు హయాంలో కూల్చివేయబడిన ఈ కట్టడాన్ని అయోధ్య, మధుర గుళ్లతోపాటు హిందువులకు అప్పగించాలని… మతాధిపత్య ధోరణితో కూల్చేయబడిన ఆ కట్టడాలను తమ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆత్మాభిమాన సంకేతాలుగా పునర్నిర్మించుకుంటామని హిందూ సమాజం చాన్నాళ్లుగా కోరుతూనే ఉంది…
అయోధ్య గురించి మొన్న ప్రాణప్రతిష్ఠ సమయంలో మాట్లాడుతూ అయోధ్య ఒక వివాదం కాదు, సమాధానం అన్నాడు… ఆ సమాధానమే కాశి, మధుర ఆలయాలపై కరువైంది… వాట్ నెక్స్ట్ అన్నాడు తను, రామ్ సే రాష్ట్ర అనీ తనే అన్నాడు… రాముడి నుంచి రామరాజ్యం వైపు వెళ్దాం అని..! మరి మధుర, కాశిల మాటేమిటి అనే ప్రశ్నకు మోడీ దగ్గర తక్షణ సమాధానం లేదు…
ఈలోపు కోర్టు సూచనల మేరకు ఏఎస్ఐ తన సర్వే రిపోర్టును కక్షిదారులకు ఇచ్చింది… హిందువుల తరఫు న్యాయవాది ఆ వివరాల్ని వెల్లడించాడు… ఆ మసీదు కింద భారీ ఆలయం ఆనవాళ్లున్నాయని వెల్లడించాడు… ఢిల్లీ పాలకుల హయాంలో దేశంలో వేల గుళ్లను నేలకూల్చారు… గర్భగుళ్లలో విగ్రహాల కింద భాండాగారాలు ఉంటాయని మొత్తం విధ్వంసం సృష్టించారు… తవ్విపోశారు… అడ్డొచ్చిన వేల మందిని ఊచకోత కోశారు… అత్యాచారాలు, ఆస్తి దహనాలు, మతమార్పిళ్లు సరేసరి…
మరి పరిష్కారం..? కోర్టులోనే తేల్చుకోవాలనే పక్షంలో అయోధ్య కేసు తీర్పు ఓ రెఫరెన్స్‌గా ఉంది… అది హిందూ ఆలయమే అనే పక్కా ఆధారాలున్నాయి… కానీ జరగాల్సింది ముస్లిం మత పెద్దలతో ఓ సయోధ్యపూర్వక సంప్రదింపులు… గత చరిత్ర చెబుతున్న విధ్వంసాలు, మారణకాండలు గతం గతః… అప్పుడలా సాగింది, సాగించుకున్నారు ఆధిపత్యాన్ని… కానీ వాట్ నెక్స్ట్..? ఇదే సంప్రదింపుల ఎజెండా… రాముడి దీవెనల సాక్షిగా మళ్లీ ప్రభుత్వంలోకి వస్తే బీజేపీ ఆ పని చేస్తుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జ్ఞానవాపి సర్వే ఫలితాల మీదే పెద్ద ఎత్తున ఈ చర్చే సాగుతోంది…!!
Share this Article