నిజమే… శుభమా అని షర్మిల తన కొడుకు పెళ్లి ఘనంగా, అపురూపంగా జరుపుకుని సంబరపడుతూ ఉంటే… అనేక వ్యాఖ్యలు, విమర్శలు, వెక్కిరింపులు, గేలి మాటలు ఇంకా సోషల్ మీడియాలో కేనిపిస్తూనే ఉన్నాయి…! ప్చ్, బాగాలేదు…
ఎస్, ఎప్పుడూ చేతిలో బైబిల్ పట్టుకుని తిరిగే విజయమ్మ మనమడు… క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్, ఆయన భార్య షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి సనాతన ధర్మ పద్ధతిలో జరగడం ఒకింత ఆసక్తి రేపే విషయమే… కాదనలేం… కానీ ఏ పద్ధతిలో ఎలా పెళ్లి చేసుకోవాలనేది ఆ వధూవరుల ఇష్టం, దాన్ని ఎవరైనా ఎందుకు గేలిచేయాలి..? నెగెటివ్ కోణంలో ఎందుకు చూడాలి..?
ఆ వధూవరులు హిందూ పద్ధతిలో పెళ్లికి సమ్మతించారు, ఇద్దరి తల్లిదండ్రులు అలాగే జరిపించారు… ఇక్కడి వరకు వోకే… అయితే క్రిస్టియానిటీని బలంగా నమ్మి, ఆచరించే కుటుంబం హిందూ పద్ధతిలో పెళ్లికి ఎందుకు మళ్లిందో ఎవరూ బయటివారు చెప్పలేరు… చెప్పదగిన షర్మిల కుటుంబం చెప్పదు… సో, అక్కడ ఫుల్ స్టాప్…
Ads
నిజానికి విదేశంలో రాజారెడ్డి, ప్రియ తరచూ చర్చి దగ్గర కలిసేవారనీ, అక్కడే మాటాముచ్చటా కలిసి పెళ్లి వరకూ వచ్చిందంటారు కదా… మరి రెండు కుటుంబాలూ క్రిస్టియానిటీని ఆచరించేవే అయినప్పుడు ఈ సనాతన ధర్మ పద్ధతికి ఎందుకు మళ్లినట్టు..? ఇదీ ప్రశ్న… పైగా ఏపీ పాలిటిక్స్ అంటేనే రెడ్డి వర్సెస్ కమ్మ పోరాటంలా మారిపోయిన దుస్థితిలో ఈ సేమ్ కులాంతరం కూడా ఓ విశేషమే… ఈ ప్రశ్నలపై డిబేట్లు వద్దన్నా కొంత నడుస్తాయి… కానీ ఎటొచ్చీ పరిధులు దాటి విమర్శలు సాగుతున్నాయనేదే అభ్యంతరకరం…
జగన్‌కూ షర్మిలకూ టరమ్స్ బాగా లేవు… తెలంగాణ రాజకీయాల్లో ఆమె తిరుగుతున్నప్పుడు పెద్దగా జగన్ క్యాంపుకి కూడా పట్టలేదు… ఎప్పుడైతే జగన్‌ను జైలులో పెట్టి వేధించిన ఆ కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి, ఏకంగా పీసీసీ పదవి చేపట్టిందో అప్పటి నుంచీ జగన్ క్యాంపు భగ్గుమంటోంది… ఇక్కడి దాకా వచ్చాక ఇక బాసు చెల్లెలు అయితేనేం అన్నట్టుగా మారింది… వైఎస్ ఇంటి పేరు బదులు ఏదో మెరుసుమిల్లి అనే బ్రదర్ అనిల్ ఇంటిపేరు రాస్తున్నారు, రెడ్డి బదులు శాస్త్రి అని రాస్తున్నారు…
మొత్తానికి వైఎస్ కుటుంబం నుంచి, ఆ లెగసీ నుంచి ఆమెను దూరం చేసే ప్రచారం జోరుగా సాగుతోంది… ఇక ఈ పెళ్లి హిందూ పద్ధతిలో జరగడంతో ఆ ప్రచారం మరింత పదునెక్కింది… జగన్‌తో పడకపోతే ఇక ఆమె కులం బ్రాహ్మణం అయిపోయి, హఠాత్తుగా ఆమె నుంచి వైఎస్ అనే ఇంటిపేరు కూడా కత్తిరించబడాలా…? ఇదంతా ఒకెత్తు, కాషాయం బ్యాచ్ కూడా కాస్త ఈ విమర్శల్లో ఆజ్యం పోస్తోంది…
అందరినీ క్రైస్తవం వైపు మళ్లించే బ్రదర్ అనిల్ కుమార్ దంపతులు ఇప్పుడు ఏమిటీ హిందూ పద్ధతిలో కొడుకు పెళ్లి చేయడం అనే ప్రశ్న మీద రకరకాల వ్యాఖ్యానాల్ని గుప్పిస్తున్నారు… దొరికింది కదా విమర్శకు చాన్స్ అన్నట్టు నానారకాల పోస్టులు… కొందరైతే రాజకీయ లబ్ధి కోసం, మేమూ హిందూ విశ్వాసాలకు వ్యతిరేకం కాదు అని చెప్పుకోవడానికి ఆమె ఇలా కొడుకు పెళ్లిని హిందూ పద్ధతిలో చేసిందని వ్యాఖ్యలు చేస్తున్నారు… మరి అంతటి హార్డ్ కోర్ క్రిస్టియన్ కుటుంబం హిందూ తంతును ఆచరించడాన్ని ఆహ్వానించాలి గానీ, వెక్కిరింపులు దేనికి..?
(అధికారం కోసం, దాని సుస్థిరత కోసం చేసే రాజశ్యామలయాగంలో జగన్, ఇది తాజా చిత్రం)
పోనీ, పొలిటికల్‌గా హిందూ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నదనే అనుకుందాం… ఎవరు చేయడం లేదు..? రాహుల్ గాంధీ ఎన్నికలు రాగానే ఏం చేస్తాడు..? తనదీ క్రిస్టియన్ ఫ్యామిలీయే కదా… శివభక్తుడయిపోతున్నాడు, కశ్మిరీ బ్రాహ్మణ గోత్రంతో గుళ్లు తిరుగుతుంటాడు… ప్రియాంక గంగా స్నానాలు చేస్తుంది, జగన్ పుష్కర స్నానాలు చేస్తాడు, పంచాంగ శ్రవణాలు, స్వరూపానంద చేయించే పూజలు సరేసరి… సో, వాట్..? షర్మిల చేస్తే తప్పేమిటి..?
Share this Article