Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంకర్ సుమ కొడుకు Vs సింగర్ సునీత కొడుకు… ఇద్దరూ ఇద్దరే…

December 16, 2023 by M S R

మాంచి కొలువు మీదున్నప్పుడు… పవర్ మీదున్నప్పుడు… కలెక్టర్‌గా దర్పం ఒలకబోసే పెద్దమనిషి కాస్తా వృద్యాప్యం పైనబడ్డాక… శక్తులన్నీ ఉడిగిపోయాక మస్కూరిలాగా అయిపోతాడు అని అంటుంటారు… ది గ్రేట్ బొడ్డు దర్శకుడు రాఘవేంద్రరావు పోస్టు ఒకటి చూశాకే అదే అనిపించింది… ఆయన ‘సర్కారు నౌకరి’ అని ఓ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు…

దానికి సంబంధించిన ఓ పోస్టు పెట్టాడు ఫేస్‌బుక్‌లో… వోకే, తన టీం పెట్టినట్టుంది… 9 గంటల్లో దానికి వచ్చిన లైకులు ఎన్నో తెలుసా..? వంద..! నిజంగా వందే… మూడంటే మూడే కామెంట్లు… ఫాఫం అనిపించింది… ఏ తలకుమాసిన ఎక్సట్రా ఆర్టిస్టు ఇలాంటి పోస్టు పెట్టుకున్నా నిమిషాల్లో వందల లైకులు అలా పడిపోతయ్… అక్కడికి ఆయన బోలెడు హ్యాష్‌‌ట్యాగులు పెట్టాడు… ఐనా నో రిజల్ట్…

#SarkaaruNoukari, #GanganamoniShekar #AkashGoparaju #BhavanaVazhapandal Sunitha #SandiliyaPisapati @MangoMusicLabel

Ads

ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే… సునీత తెలుసు కదా… సింగర్ సునీత…అవునండీ అవును, మ్యాంగో రామ్‌ను పెళ్లిచేసుకున్న ఆ సునీతే… ఆమె కొడుకు హీరో కాబోతున్నాడు… ఆకాశ్ గోపరాజు తన పేరు… రామ్ కొడుకు కాదు, సునీత కొడుకు… అర్థమైంది కదా… సినిమా పేరు సర్కారు నౌకరి… భావన హీరోయిన్… జనవరి ఒకటిన రిలీజ్ అట… లాంచింగ్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ హైప్ రావడం లేదు… పెద్దగా హీరో సరుకులా కనిపించడం లేదు… ఐతేనేం, ఎవరి ఆశలు వాళ్లవి… తన పరిచయాల్ని మొత్తం వాడుతోంది సునీత…

అన్నట్టు ఇండస్ట్రీ పరిచయాలు అంటే గుర్తొచ్చింది… యాంకర్ సుమ కూడా తన కొడుకును బలంగా లాంచ్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది… టీవీల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ గట్రా… కొడుకు పేరు రోషన్ కనకాల… బబుల్‌గమ్ అనే సినిమాలో హీరోగా చేశాడు… అందులోని ఏదో ముద్దు సీన్ మీద బోలెడు విమర్శలు కూడా వచ్చాయి… ఈ సినిమా డిసెంబరు 29న రిలీజ్… మానస చౌదరి హీరోయిన్… ఈ ఇద్దరు వారసుల మీద ఆ ఇద్దరు లేడీ సెలబ్రిటీలు ఫాఫం ఫుల్ టెన్షన్‌లో ఉన్నారు… కానీ దురదృష్టం ఏమిటంటే ఇద్దరూ పెద్దగా చూడబుల్ కారు… ఈ ఇద్దరూ ఇప్పుడు ఈ సంవత్సరాంతంలో పోటీపడబోతున్నారు…

ఎస్, ఫలానా వ్యక్తులు వారసులు కాబట్టి అనర్హులు అనలేం… సత్తా ఉంటే నిలబడతారు… లేకపోతే అనామకులుగా తెర వెనక్కి వెళ్లిపోతారు… బోలెడంత స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లే గతంలో నిలబడలేక నిష్క్రమించారు… కాబట్టి ఒక సునీత కొడుకు, ఒక సుమ కొడుకు ప్రయత్నాల్ని తప్పుపట్టలేం… కానీ ఇండస్ట్రీలో బలమైన పరిచయాలున్నయ్, డబ్బులున్నయ్ అనే భావనతో గనుక ప్రేక్షకుల మీదకు వదిలితే, మెల్లిమెల్లిగా ప్రేక్షకులే వాళ్లను యాక్సెప్ట్ చేస్తారులే అనుకుంటే మాత్రం… ఏదో తేడా కొడుతున్నట్టే లెక్క…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్‌లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
  • ఫిక్సేనా..? ‘ఈసాల కప్ నమ్‌దే’ నిజమేనా..? ఈ జోస్యం ఫలిస్తుందా..?
  • ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!
  • రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
  • మొక్కు కోడెల ఉసురు… కలుక్కుమనిపించే మరణాల వార్తలు…
  • ‘మిస్ బిహేవ్’ అంటే… మిస్ వరల్డ్ వివాదం రేవంత్ మెడకు చుట్టడమా..?!
  • నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…
  • మూడు ‘నందుల’ ముచ్చటైన ‘ఉషాకిరణం’… కాంచనగంగ…
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • ఉహుహుహు… మనవాళ్లు వణికే చలిలోనూ వేడి పుట్టించగలరు సుమీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions