ఆమె బిగ్‌బాస్ షోకు రావడమే తప్పు… మనం రెండు వారాల ముందే చెప్పుకున్నాం… అన్నట్టుగానే అక్కడ ఉండలేకపోయింది… ఆమె ఆ షో కల్చర్‌కు సూట్ కాదు… అందుకే ఎలిమినేట్ అయిపోయింది…
ఆమెకు ఆ షోలో ఏ స్ట్రాటజీతో ఆడాలో కూడా తెలియదు… ఆమె సోషల్ మీడియా టీం కూడా హుందాగా ఓ పద్ధతిలో వోట్లు అడిగిందే తప్ప ఎక్కడా గీత దాటలేదు… మెచ్యూర్డ్… కరాటే తెలుసు, కలరి తెలుసు, లా గ్రాడ్యుయేట్, ఎన్జీవోతో ప్రొ కన్సర్న్ యాక్టివిటీ… ఎస్, ఆమె ఈ షోకు అస్సలు సూట్ కాదు… వెళ్లిపోయింది… జస్ట్, అలా తలెత్తుకుని… హుందాగా… (ఎంట్రీ సమయంలోనూ నాగార్జున ఎదుట మిగతా కంటెస్టెంట్లలా ఓవరాక్షన్ చేయలేదు, జస్ట్ అలా ఓ దండం పెట్టి హౌజులోకి వెళ్లింది…)
కన్నీళ్లు లేవ్, ఎమోషన్స్ లేవ్… ఫేక్ సీన్ క్రియేషన్ లేదు… సింపుల్‌గా నాగార్జునకు ఏమాత్రం ఎక్సయిట్ ఫీల్ గాకుండా ‘బై సర్’ అని సింపుల్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్లిపోయింది… ఎస్, ఆ షో కిరాక్ సీత, విష్ణుప్రియలది… ఇక్కడ పుణ్యస్త్రీ, అడల్టరేటెడ్ జోక్స్ వంటి మాటలు, విమర్శల జోలికి వెళ్లాల్సిన పని లేదు…
Ads
గత సీజన్‌లో శివాజీ, తన శిష్యులు పల్లవి ప్రశాంత్, యావర్‌ను మోసిన ఓ సెక్షన్ మీడియా ఇప్పుడు విష్ణుప్రియను మోస్తోంది… సోనియాకు పడని మొత్తం గ్యాంగును మోస్తోంది… నిన్నటి నుంచే మీమ్స్‌తో సోనియా ఎలిమినేషన్ వార్తను మీమ్స్‌తో పండుగ చేసుకుంటోంది… కానీ సోనియా అంటే సోనియాయే…
పులిహోర కలిపింది, ఇద్దరితో ఆడుకుంది… ఇవన్నీ హంబగ్ అండ్ ఫేక్ కామెంట్స్… బిగ్‌బాస్ స్క్రిప్ట్ ఉంటుంది… దాన్ని గుడ్డిగా పాటించి భంగపడింది, అంతే… అమెకు స్టెప్పులు చేతకావు, ఆర్జీవీ ఏదో ప్రమోట్ చేశాడు గానీ ఆమె ఆ హౌజులో ఫిట్ కాలేకపోయింది… పృథ్వి గురించి చెప్పుకోవడం వేస్ట్ గానీ… నిఖిల్ డెఫినిట్‌గా స్ట్రాంగ్ కంటెస్టెంట్… కూల్, స్ట్రాటజిక్… నాగార్జున అదే ప్రొ విష్ణుప్రియ స్టాండ్‌తో ఏదో ప్రేమ కురిపిస్తున్నాడు, నిఖిల్‌ను కార్నర్ చేయబోయాడు గానీ… నప్పలేదు… స్టిల్ నిఖిల్ కూల్… ఆ మొహంలో అసలు ఎమోషన్సే కనిపించవు…
మణికంఠలు, ఆదిత్య ఓంలు… జుజుబీ… నబీల్‌కు డెఫినిట్‌గా వోటింగ్ ఉంటుంది… సో, నిఖిల్‌కు నబీల్ మాత్రమే పోటీ… నిఖిల్‌లో కనిపించే డిగ్నిటీ వేరు… అసలు ఆట ముందుంది… ఇప్పుడున్న మెంటల్ కేసులకు అసలు సిసలు పోటీ రాబోయే అవినాష్, రోహిణి, హరితేజలతో ఉండబోతోంది… అవి ముదురు కేసులు… నయని పావని వస్తుందంటున్నారు గానీ ఆమె పెద్ద పోటీ ఏమీ కాదు…
ఐతే మొదటి నుంచీ ఉన్నవాళ్లను మించి వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ప్రయారిటీ సరైందేనా..? ఈ ప్రశ్న వేరు… ఇది అట… లిమిట్ లెస్… ఎస్, లిమిట్ లెస్ ఫూలిష్ నెస్… ఇదిలాగే ఉంటుంది… ఇమిడితే ఉండగలరు, లేదంటే సోనియాలాగే జస్ట్ అలా ఓ దండం పెట్టి వెళ్లిపోతారు… వెరసి ఇప్పటికైతే ఈ బిగ్‌బాస్ 8 సీజన్ టోటల్లీ ఫన్ లెస్, ఎంటర్‌టెయిన్‌మెంట్ లెస్… నాట్ లిమిట్ లెస్..!!
Share this Article