.
సెలబ్రిటీలకు ఏదో ఒక రంగంలో ప్రతిభ ఉండవచ్చుగాక… వర్తమాన వ్యవహారాల్లో బుర్రలు పనిచేయవు… మూర్ఖత్వానికి తోడు తామేదో తోపులుం, తురుములం అనే పిచ్చి భ్రమల్లో బతుకుతుంటారు…
ఈమధ్య బోలెడు చూస్తున్నాం కదా… సెలబ్రిటీలు దిక్కుమాలిన ఏవో పిచ్చి కూతలు కూయడం, చెప్పదలుచుకున్నది కూడా చెప్పలేకపోవడం, బలుపు, పొగరు ప్లస్ ఇంకా ఏవేవో… తరువాత సారీలు చెప్పడం, లెంపలేసుకోవడం, వివాాదాలు, కేసులు…
Ads
సోనూ నిగమ్ అని ఇలాంటి కేరక్టరే… 51 ఏళ్లు వచ్చాయి గానీ జ్ఞానదంతం రాలేదు ఇంకా… వెధవ… ఈ మాట అనడానికి సాహసిస్తున్నా… సో వాట్, జూనియర్ రఫీలా కొలవబడే వీడు హిందీ, కన్నడమే కాదు, తెలుగు, భోజ్‌పురి, తమిళం తదితర 32 భాషల్లో 6 వేల పాటలు పాడాడు…
పద్మశ్రీ ఇచ్చింది ప్రభుత్వం వీడి గురించి తెలియక… నటుడు, సంగీత దర్శకుడు కూడా… ఎక్కువగా పాప్ మ్యూజిక్… బెంగుళూరులో ఓ కాన్సర్ట్… ఇప్పుడందరూ ఈ కచేరీలకు ఎగబడి సొమ్ము చేసుకుంటున్నారు కదా… తను ఎక్కువగా పాడేది కన్నడంలో… సో, బెంగుళూరులో కచేరీ పెట్టాడు…
ఈమధ్య కన్నడ మేనియా బాగా ప్రబలింది కదా ఆ రాష్ట్రంలో… ఎవడూ వేరే భాషను సయించడం లేదు… ఎవడో కుర్రాడు మధ్యలో పెద్దగా అరుస్తూ కన్నడంలో పాడు అని అరుస్తున్నాడు… సోనూ నిగమ్ టెంపర్ కోల్పోయాడు… ఇదుగో ఇలాగే అక్కడా అలాగే చేస్తుంటే ఆ పహల్‌గాం జరిగింది అన్నాడు…
క్షుద్రమైన, ఇడియాటిక్ కామెంట్… వీడికి కామన్ సెన్స్ కూడా లేనట్టుంది… ఇక్కడెవరో కన్నడంలో పాట పాడాలని అరవడానికి, అక్కడ మతం పేరిట పైశాచిక హత్యలకు దిగిన మత ఉగ్రవాదానికీ సంబంధం ఏమిటి అసలు..? ప్రపంచంలో ఎవడినైనా, ఎంత ధూర్తుడినైనా ఆ ఉగ్రవాదులతో పోల్చగలమా అసలు..?
ఈ వ్యాఖ్యలతో కన్నడనాట సోనూ నిగమ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి… అభిమాన గాయకుడు మన్నూమశానం పక్కన బెట్టి వాడి మీద అర్జెంటుగా కేసు పెట్టి, అరెస్టు చేయాలని ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి… సరే, అక్కడుంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అలాంటివేమీ జరగబోవని వాళ్లకూ తెలుసు… ఐనా తమ ఆగ్రహాన్ని వ్యక్తీకరించాలి కాబట్టి…
అక్కడే ఆ వేదిక మీదే సవరణకు, వివరణకు పూనుకుని, తనకు కన్నడం అంటే ఎంత అభిమానమో చెప్పుకొచ్చాడు… అదంతా సరే, దీనికీ పహల్‌గాం ఇన్సిడెంటుకూ సంబంధం ఏమిటో మాత్రం చెప్పడు, చెప్పలేడు… ఎస్, ఇండియన్ సెలబ్రిటీలు ఒకడు తక్కువ కాదు, మరొకడు ఎక్కువ కాదు… తాజా ఉదాహరణ సోనూ నిగమ్… కాలా సోనూ నిగమ్…!!
Share this Article