Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూక్ష్మదర్శిని…! ఆ దరిద్ర దర్శకుడినీ బుక్ చేసే వీలుందా సార్..!!

January 29, 2025 by M S R

.

Satya Sakshi …. ఇప్పటి దాకా నా జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు… సాధారణంగా మనకు ఓ సినిమా చూడడానికి కారణం లేదా స్ఫూర్తి ఏమై ఉంటుంది?

ఆ సినిమా హీరో మీద అభిమానమో దర్శకుడిపై నమ్మకమో ముందే పెట్టుకున్న అంచనాలో… రిలీజ్ అయ్యాక మౌత్ టాకో, రివ్యూయర్ల పెన్ టాకో.. ఊహించని ట్విస్టులో.. ఎఫ్బీ ఫ్రెండ్స్ పోస్టులో… కదా

Ads

కానీ సమాజంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఓ హత్యానంతర ఘాతుకం… ఓ సైకో మనస్తత్వం… ఓ సినిమా చూడడానికి పురికొల్పడం… అరుదుగా ఎవరికైనా జరిగిందేమో…కానీ దీనికి ముందు నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు…

తన దృష్టి లో పడిన ప్రతీ అంశాన్ని భూతద్దంలో నుంచీ చూసి అరచి గీపెట్టే అలవాటున్నవారు మనకూ అక్కడక్కడా తారసపడే వుంటారు. సాధారణంగా వాళ్ళు మనకి కమెడియన్ లా అగుపిస్తారు. కానీ ఈ సూక్ష్మ దర్శిని సినిమాలో హీరోయిన్..

అదే అలవాటుతో మన పొరపాట్లు ఎత్తి చూపుతుంది దేన్నీ నిశితంగా పట్టించుకోకుండా ఉరుకులు పరుగులు పెడుతుండడం వల్ల మన చుట్టూ ఎన్ని మేక వన్నె పులులున్నాయో అవి ఎన్ని అమాయక జీవుల్ని తినేస్తున్నాయో.. చెప్పకనే చెప్పి చెంప ఛెళ్లుమనిపిస్తుంది.

ఆహ్లాదకరమైన అనుబంధాలు అనూహ్యమైన మలుపులు రెండింటినీ మేళవించి ఓ క్రైం థ్రిల్లర్ ని సృష్టించడం అంత వీజీ కాదు. ఒక్క నిమిషం కూడా కళ్ళు తిప్పనివ్వకుండా కళ్ళు విప్పార్చుకుని తననే దర్శించేలా చేసే ఈ సూక్ష్మ దర్శిని… బాగున్నా కూడా బాగుంది అనలేని విచిత్ర పరిస్థితి ఇప్పుడు నాది

ఎందుకంటే మన మధ్య మనలాగే సంచరించే ఓ అడవి మృగానికి ఈ సినిమా స్ఫూర్తిని అందించింది. కట్టుకున్న భార్యను చంపి ముక్కలు చేసి తగలబెట్టడానికి దారి చూపించింది

ఈ క్రూరోదంతం గురించి చదివిన తర్వాత.. సదరు హంతకుడు ఈ సినిమా చూసి స్ఫూర్తి పొందాడని తెలిసిన తర్వాతే నేనీ సినిమా చూశాను.

విచిత్రంగా… ఈ సినిమాలో ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా అనిపించదు, కనీసం హత్య చేయడం కూడా చూపించకుండా.. ప్రేక్షకులకి విషయం అర్ధమయ్యే విధంగా అదే సమయంలో ఆ సినిమా అందిస్తున్న ఫీల్ గుడ్ ఫీలింగ్ పోకుండా అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు.

అయినప్పటికీ… ఓ కౄర మృగం అందులో నుంచీ మనిషి కాలిన వాసన పసిగట్టేసిoది అదే దారుణానికి ఒడిగట్టేసింది. ఓటీటీ పుణ్యమాని వైవిధ్యమైన కధలతో సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయని సంతోషించాలో … సినిమా చూసి “బాగుంది చూడండి” అని చెప్పడానికి సైతం సంకోచించేలా.. చేసే సైకోలున్న సమాజంలో బ్రతుకుతున్నామని భాధపడాలో… ప్చ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions