.
సౌందర్య అసలు పేరు సౌమ్య… తెలుగులో తొలి సినిమా రైతుభారతం, నిర్మాత త్రిపురనేని శ్రీప్రసాద్ ఆమె ఇంటికి వెళ్లి, చూసి, నచ్చి, ఆమె తండ్రి సత్యనారాయణకు అడ్వాన్స్ ఇచ్చాడు…
ఇద్దరి నడుమ ఆమె పేరు మార్పుపై చర్చ జరిగింది… మూడక్షరాల పేరు పెడదాం తెలుగు తెరకు అన్నాడు త్రిపురనేని… ఆమె తండ్రి సత్యనారాయణ రచయిత, దర్శకుడు, నిర్మాత… ప్లస్ మంచి జ్యోతిష్కుడు… ఆయనే ఏవో గుణించి సౌందర్య అనే పేరు సజెస్ట్ చేశాడు, ఆమె జాతకానికి అదే కరెక్టు అన్నాడు…
Ads
ఆ పేరు అన్ని భాషలకూ సూటవుతుందని చెప్పి, అంగీకరించిన త్రిపురనేని ఆమె తండ్రిని అడిగాడు… ఆమె కెరీర్ ఎలా ఉంటుందని… సత్యనారాయణ తడుముకోకుండా వెంటనే చెప్పాడు… ఎనిమిదేళ్లు ఆమె కెరీర్ ఉజ్వలంగా వెలుగుతుందని… 2004లో ఆమె కెరీర్ ఎండ్ అవుతుందనీ చెప్పాడు…
అంటే… 2004లో ఆమె బతుకే సమాప్తమవుతుందని తండ్రికి ముందే తెలుసా…? అది చెప్పలేక కెరీర్ ఎండ్ అని చెప్పాడా..? తను అన్నట్టే ఆమె టాప్ స్టార్… ఎక్స్‌పోజింగుకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా, మంచి పాత్రలు చేసి… తెలుగులో ఇంటింటి మనిషి అయ్యిందామె… నటిగా ఆమె మెరిట్, సక్సెస్ ఇక్కడ వివరంగా చర్చించలేం గానీ… 2003లో తన మేనమామ రఘును పెళ్లి చేసుకుంది…
గర్భిణి… 2004లో విద్యాసాగర్‌రావు ఎన్నికల ప్రచారం కోసం కరీంనగర్‌కు చార్టర్డ్ విమానంలో బయల్దేరింది… తోడుగా సోదరుడు అమరనాథ్… కాసేపటికే కుప్పకూలి తగలబడిపోయింది విమానం… శవాలు గుర్తుపట్టరాకుండా మాంసం ముద్దలయ్యాయి… తెలుగు ప్రేక్షకులు, ప్రత్యేకించి మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు…
ఆమె మరణం తరువాత కుటుంబసభ్యుల నడుమ ఆమె ఆస్తి తాలూకు పంచాయితీలు జరిగాయి… ఆమె వదిన, అంటే అమర్‌నాథ్ భార్య నిర్మల 2009లో కోర్టును ఆశ్రయించింది… అసలు సౌందర్య వీలునామా రాయనేలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది, తనే తప్పుడు వీలునామా క్రియేట్ చేశాడని సౌందర్య తల్లి మంజుల, సౌందర్య భర్త రఘు కూడా కోర్టుకెక్కారు… చాలా తగాదాలు, కేసుల అనంతరం 2013లో రాజీపడి, సౌందర్య ఆస్తులు పంచుకున్నారు… (రఘు తరవాత వేరే పెళ్లి చేసుకున్నాడని సమాచారం…)
సో, ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? సౌందర్య ఆస్తుల మీద వివాదం ఇప్పుడు కొత్తేమీ కాదు… ఆమె మరణించిన 21 ఏళ్ల తరువాత కూడా అవి వార్తల్లోకి, కేసుల్లోకి వచ్చాయి… చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశాడు… ఏమనీ అంటే..?
‘‘సౌందర్యకు జల్‌పల్లిలో 6 ఎకరాల భూమి, గెస్ట్ హౌజ్ ఉండేది… మోహన్‌బాబు అది తనకు ఇవ్వాలని సౌందర్య, తన సోదరుడు అమర్‌నాథ్ మీద ఒత్తిడి తెచ్చాడు… ఆమె మరణించగానే అది అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు… ఆమె మరణం ప్రమాదం కాదు, హత్య, దాన్ని మళ్లీ విచారించాలి…’’ ఇదీ ఆ ఫిర్యాదు…
ప్రస్తుతం అదే జల్‌పల్లిలో మోహన్‌బాబును ఓ రాజభవనం ఉంది… అదే సౌందర్య భూమా అనేది తెలియదు… కానీ మోహన్‌బాబే ఏదో చేశాడనీ, సౌందర్య మరణించగానే ఆమె ఆస్తి స్వాధీనం చేసుకున్నాడనేది చిట్టిమల్లు ఆరోపణల సారం… (మోహన్‌బాబు, సౌందర్య శ్రీరాములయ్య, పెదరాయుడు, రాయుడు సినిమాల్లో కలిసి నటించారు, శివశంకర్ షూటింగ్ మధ్యలో ఆమె చనిపోయింది… ఆమె చివరి సినిమా కూడా అదే…)
ప్రస్తుతం మోహన్‌బాబుకూ చిన్నకొడుకు మనోజ్‌కూ పడటం లేదు… కేసులు పెట్టుకున్నారు… మనోజ్‌ను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు… ఇప్పుడు చిట్టిమల్లు ఫిర్యాదుల వెనుక మనోజ్ ఉన్నాడా..? ఐతే ఈ ఫిర్యాదు సారం నిజమేనా..? ఇదీ ఫిలిం సర్కిళ్లలో చర్చ… నో, నో, మోహన్‌బాబుతో మాకు ఎలాంటి పంచాయితీలూ లేవు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని సౌందర్య భర్త రఘు అంటున్నాడు…
నిజానికి 20 ఏళ్ల క్రితం జల్‌పల్లిలో నిజంగానే సౌందర్యకు ఆరెకరాలు ఉండి ఉంటే… అప్పట్లో దాని విలువ ఎంత..? ఆఫ్టరాల్… దానికోసం సౌందర్యను ఏదో చేసేంత సీన్ మోహన్‌బాబుకు అప్పట్లో ఉందా..? అదీ బీజేపీ విద్యాసాగర్‌రావు ప్రచారానికి వెళ్లే సౌందర్య జోలికి వెళ్లేవాడా..? ఆయనను గోకేంత ధైర్యం చేస్తాడా..? ఏదైనా డౌట్ వస్తే విద్యాసాగర్‌రావు మోహన్‌బాబును వదిలేవాడా..? మరి చిట్టిమల్లు అలా అంటాడేమిటి..?! డియర్ మనోజ్, ఎనీ ఐడియా..?!
Share this Article