వివిధ సమాచార మార్గాల్లో తమకు అందే లీకులు లేదా కాన్ఫిడెన్షియల్ సమాచారం ఆధారంగా మీడియా సంస్థలు పలు ఊహాగానాలు చేయడం సాధారణమే… కొన్నిసార్లు నిజంగానే అనుకోకుండా అవి నిజం అవుతుంటాయి… ఈ వార్త ఒకటి విస్మయకరంగా అనిపించింది… తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న విలేకరులతో చిట్‌చాట్ చేస్తూ… ప్రధాని, రాష్ట్రపతి, హోంమంత్రి తనకు బలమైన మద్దతుగా నిలుస్తున్నారని, చాలా అంశాల్లో ఒక గవర్నర్‌గా కేంద్రానికి నివేదికలు పంపిస్తున్నాననీ చెప్పుకొచ్చింది…
అదేసమయంలో ఆవేదనను షేర్ చేసుకుంది… పాత ఫోటోలతో ట్రోల్ చేస్తున్నారనీ, ఎక్కడా ప్రొటోకాల్ జాడలేదనీ, కావాలనే అవమానిస్తున్నారనీ చెప్పింది… ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని తాను ఎక్కడా, ఎప్పుడూ అనలేదనీ వివరించింది… ప్రత్యేకించి తనను మార్చేస్తారంటూ (గవర్నర్ పదవి నుంచి తప్పిస్తారని) బెదిరించలేరని ధీమాగా చెప్పింది… ఆమె ఆరోపణకు తగ్గట్టుగానే ఆంధ్రప్రభలో ఈ కథనం కనిపించింది… ఆమెను బదిలీ చేయబోతున్నారనీ, జస్ట్, పుదుచ్చేరికి పరిమితం చేస్తారని ఓ ఊహాగానం… ఈ పత్రిక అప్పుడప్పుడూ నమస్తే తెలంగాణను మించి టీఆర్ఎస్ రంగు పూసుకుంటుంది…
పర్ సపోజ్, నిజమే అనుకుందాం… గవర్నర్‌ను బదిలీ చేస్తారనే విశ్వసిద్దాం… చేయొద్దని ఏమీ లేదు… కానీ..? అలా చేస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు… అదీ కాస్త ఇంట్రస్టింగ్… (నేను శక్తిమంతంగా ఉన్నాను, నా పని నేను చేస్తాను అని ఆమె చెబుతుంటే… ఢిల్లీ వెళ్లి నన్ను మార్చండి మహాప్రభో అని కేంద్రానికి మొరపెట్టుకున్నట్టు ఆంధ్రప్రభ కథనం…)
Ads
- తెలంగాణ ప్రభుత్వం జస్ట్, ఆమెను అవమానిస్తోంది… కానీ బెంగాల్‌లో ప్రభుత్వంతో గవర్నర్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటున్నాడు… అక్కడ ఏమీ మార్చలేదుగా…
- తెలంగాణ గవర్నర్ పట్ల టీఆర్ఎస్ అమిత్ర వైఖరి సరే, కానీ ఆమెకు పుదుచ్చేరిలోనూ విపక్షాల నుంచి అదే వైఖరి కనిపిస్తోందిగా…
- ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లతో విభేదాలు, వివాదాలు మన వ్యవస్థలు సహజమే…
- తెలంగాణలో మాత్రమే కాదు, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ గవర్నర్లతో ప్రస్తుతం ఘర్షణ నడుస్తోంది…
- అలాగని ప్రతిచోటా గవర్నర్లను మార్చేస్తే ఇక కేంద్ర ప్రభుత్వ సుప్రిమసీ ఏమున్నట్టు..?
- ఒకవేళ కేసీయార్ అవమానిస్తున్నాడు కాబట్టి మార్చేసే పక్షంలో… మోడీ, అమిత్ షా కేసీయార్ చర్యల్ని ఆమోదించినట్టు అనుకోవాలా..? గవర్నర్‌ను గనుక బదిలీ చేస్తే, గవర్నర్ పరాభవపర్వం పట్ల కేసీయార్‌ను అభినందించినట్టు కాదా..?
ఒకవైపు తెలంగాణలో అధికారం కావాలని కొట్లాడుతూ… టీఆర్ఎస్‌తో రాజకీయ సమరం తప్పదని కేడర్‌కు సంకేతాలు ఇస్తూ… మరోవైపు కేసీయార్‌తో పడటం లేదని గవర్నర్‌ను మారుస్తారా..? ఒకవేళ మారిస్తే మోడీ, షాలను ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బీజేపీ కేడర్..? ష్, ఆల్‌రెడీ కొత్త గవర్నర్ రేసులో మహారాష్ట్ర, కర్నాటక, బెంగాల్ గవర్నర్ల పేర్లు వినిపిస్తున్నాయట… హేమిటో..! ఈమధ్య నమస్తే తెలంగాణ పత్రిక బాగా వెనుకబడిపోతోంది..!!
Share this Article