ఇప్పుడు ఆంటీ పెద్దగా టీవీ తెరల మీద కనిపించడం లేదు… ఆమె చేతిలో హోస్ట్ చేయడానికి షోలు లేవు… ఆమె ఉన్నన్ని రోజులూ పొట్టి దుస్తులు, వెగటు దుస్తులకు వేరేవాళ్లకు చాన్స్ ఇచ్చేది కాదు… ధరించేది… అదేమంటే, చివరకు మా దుస్తుల మీద కూడా ఆంక్షలా అంటూ ఫైటింగుకు వచ్చేది…
ఆమె అలా ఉండేది కాబట్టే ఒకటీరెండు సినిమా వ్యాంప్ పాత్రలు వచ్చి, నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నది అనే భ్రమ ఏమైనా శ్రీముఖిని ఆవరించిందేమో తెలియదు… అందుకని ఆంటీ బాటలోకి వచ్చిపడింది… నాట్ చూడబుల్ అగ్లీ డ్రెస్సింగుతో విమర్శల పాలవుతున్నది… ఐనా తను మారే రకం ఏమీ కాదు…
నిజానికి తెలుగు టీవీ ఫిమేల్ యాంకరింగ్ అంటే సుమ… అంత సీనియర్, అంత పవర్ఫుల్… మేల్ యాంకర్ అంటే ప్రదీప్… వాళ్ల షోలు రేటింగుల్లో తల్లకిందులైనా సరే, వాళ్లిద్దరే తెలుగు టీవీలను ఏలుతున్నారు… అఫ్కోర్స్, వాళ్ల మెరిట్, స్పాంటేనిటీ, టైమింగ్ ఎట్సెట్రా వాళ్లను అలా నిలబెడుతున్నాయి… కానీ ప్రస్తుతం సుమ చేతిలో ఉన్న టీవీ షోలకన్నా శ్రీముఖి చేతిలో ఉన్న షోలు ఎక్కువ…
Ads
ఏ చానెల్ చూసినా… ఏ షో చూసినా ఆమే… ఓటీటీలో కూడా ఆమే… ఇప్పుడు శ్రీముఖి హవా నడుస్తోంది… ఇలాంటి సమయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి… కానీ పిచ్చి డ్రెస్సులతో వెగటు పుట్టిస్తోంది… ఒరిజినల్‌గా తన ఎనర్జీ లెవల్స్, స్పాంటేనిటీ ఆమె బలం… ఎవరూ తనకు పోటీకి రాలేరు… ఈ స్థితిలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తోందనే విమర్శ బలంగా వినిపిస్తోంది…
మోడరన్ డ్రెస్సుల పేరిట అశ్లీలం వైపు వెళ్తోంది శ్రీముఖి… వాస్తవానికి గతంలో శ్రీముఖి వస్త్రధారణ పద్దతిగా ఉండేది… కానీ ఇప్పుడు వెగటు డ్రెస్సింగుతో థైస్, క్లీవేజీ నిర్మొహమాటంగా ప్రదర్శనకు పెడుతోంది… చివరికి కోస్టార్లకు, నెటిజన్లకు కూడా శ్రీముఖి పద్ధతి నచ్చడం లేదు… ఆమధ్య ఇలాంటిదే ఓ డ్రెస్ వేసుకుని వస్తే డాన్స్ ఐకాన్ అనే షోలో జడ్జి రమ్యకృష్ణ సహా అక్కడున్న ఇతరులు కూడా పకపకా నవ్వుతూ వెక్కిరించారు… ప్యాంటు వేసుకోవడం మరిచిపోయి వచ్చావా అని ఆటపట్టించారు కూడా… ఇదీ ఆ వార్త లింకు… శ్రీముఖితో కాసేపు ఆడుకున్న రమ్యకృష్ణ… శేఖర్, యశ్ మాస్టర్స్ సరేసరి…
ఇప్పుడు బీబీ జోడీ అనే ప్రోగ్రాం ప్రోమోలోనూ అలాగే కనిపిస్తోంది… ఇదీ ఓతరహా డాన్స్ ప్రోగ్రామే… కాకపోతే పాత, కొత్త బిగ్‌బాస్ సెలబ్రిటీలు, కంటెస్టెంట్లను జోడీలుగా చేసి ఈ ప్రోగ్రాం రన్ చేస్తున్నారు… బిగ్‌బాస్ కంటెస్టెంట్లు నిజంగానే బాగా కష్టపడి, పర్ఫామ్ చేస్తున్నారు… ఎటొచ్చీ ఇదుగో ఇలాంటి శ్రీముఖి డ్రెస్సింగు వంటివే ప్రోగ్రాంకు దిష్టి తీస్తున్నట్టున్నాయి… మాజీ నటి మాధవీలత కూడా ఈ డ్రెస్సుల మీద కామెంట్ చేస్తూ… ‘‘నీకు నచ్చితే మోడరన్, అల్ట్రా మోడరన్ డ్రెస్సులు వేసుకో, కానీ అవి నీకు ఏమేరకు నప్పుతాయో చూసుకో’’ అని వ్యాఖ్యానించింది… నిజానికి మంచి సలహా… అఫ్కోర్స్, వరుస షోలు, సంపాదనతో బాగా దూసుకుపోతున్న శ్రీముఖికి ఇలాంటి సలహాలు ఎక్కుతాయనేది డౌటే…!!
Share this Article