Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన కారునే కోర్టు రూం‌గా మార్చేశాడు ఈ ఓరుగల్లు ముద్దుబిడ్డ..!

December 25, 2024 by M S R

.
. ( Shankar Shenkesi ) .. …. ఐఏఎస్‌గా తనదైన ముద్ర చాటుతున్న ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ‌ శ్రీ‌సాయి ఆశ్రిత్‌… యూపీలో కారులో నుంచే విధులు నిర్వర్తించి సంచలనం

పిన్న వయస్సులోనే అత్యున్నత ఐఏఎస్‌ సర్వీసుకు ఎంపికైన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ‌ శాఖమూరి శ్రీ‌సాయి ఆశ్రిత్‌… ఉత్తరప్రదేశ్‌లో విధినిర్వహణలో తనదైన ముద్ర చాటుతున్నారు.

ప్రస్తుతం ప్రధాన మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారాణసీ జిల్లా రాజతలాబ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆశ్రిత్ మంగళవారం న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో తన అధికారిక వాహనం నుంచే విధులు నిర్వర్తించి సంచలనం సృష్టించారు.

Ads

విధి నిర్వహణలో ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజతలాబ్‌లోని రెవెన్యూ కోర్టులో మంగళవారం ఆశ్రిత్ ఒక భూ వివాదానికి సంబంధించి తాజా పత్రం జతచేయాలని న్యాయవాదికి సూచించి, తదుపరి తేదీ ప్రకటిస్తూ వాయిదా వేశారు.

srisai Asrith ias

సదరు న్యాయవాది ఆశ్రిత్ తో వాగ్వాదానికి దిగారు. కేసు వాయిదా వేయకూడదని, త‌క్ష‌ణ‌మే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆయనకు మద్దతుగా ఇతర న్యాయవాదులు వచ్చి కోర్టు తలుపులు మూసివేశారు.

ఆగ్రహానికి లోనైన ఆశ్రిత్ కోర్టు ఆవరణలో వున్న తన అధికారిక వాహనంలోనే కూర్చొని, దానికి వున్న లౌడ్‌స్పీకర్‌ ద్వారా కోర్టు కార్యకలాపాలను ప్రారంభించారు. పిటిషనర్లను పిలుస్తూ వారి వాదనలను రికార్డు చేయడంతో పాటు అక్క‌డిక‌క్క‌డే ఆదేశాలు ఇవ్వ‌డం మొదలుపెట్టారు.

న్యాయవాదులు బిత్తరపోయి మెట్టు దిగారు. సీనియర్‌ న్యాయవాదులు జోక్యం చేసుకొని కోర్టులోకి రావాలని అభ్యర్థించడంతో ఆశ్రిత్ లోనికి వచ్చారు. అనంత‌రం య‌థావిధిగా విధులు కొనసాగించారు. బాధితుల పక్షం వహిస్తూ ఆశ్రిత్ వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలు పొందుతోంది.

రాజ‌త‌లాబ్‌లోని కోర్టు ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న యూపీ మీడియాతో పాటు జాతీయ మీడియాను ఆక‌ర్షించింది. కాగా, ఆర్నెల్ల క్రితమే ట్రెయినీ ఐఏఎస్‌గా పోస్టింగ్‌ పొందిన ఆశ్రిత్‌… విధినిర్వహణలో చూపుతున్న నిబద్దతకు అక్క‌డి ప్ర‌జ‌లు జేజేలు ప‌లుకుతున్నారు.

హ‌నుమ‌కొండ‌లోని ప్ర‌ముఖ వ్యాపారి శాఖ‌మూరి అమ‌ర్ కుమారుడైన ఆశ్రిత్‌.. 22 ఏళ్ల వ‌య‌స్సులోనే సివిల్స్‌ (2022)లో జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపిక‌య్యారు. ప్ర‌జ‌ల అధికారిగా ఎదిగే క్ర‌మంలో కెరీర్ ఆరంభంలోనే త‌న‌దైన‌ ప‌నితీరు క‌న‌బ‌రుస్తుండం అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions