Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పౌరాణికాలు తీయాలంటే మన తెలుగు దర్శకులే పర్‌ఫెక్ట్…

December 7, 2024 by M S R

.

(దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…… శ్రీ వినాయక విజయం… బాపు తీసారా అని అనిపిస్తుంది . అంత చక్కగా తీసారు కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాను . Of course . దర్శకుడిగా , ముఖ్యంగా పౌరాణిక చిత్రాల దర్శకుడిగా కమలాకర కామేశ్వరరావే సీనియర్ . పౌరాణిక బ్రహ్మ అని కూడా అంటారు ఆయన్ని . ఈ సినిమాలో అక్కడక్కడా బాపు మార్క్ కనిపిస్తుంది

రచయిత బోణం ఆంజనేయులు వ్రాసిన కధ ఆధారంగా 1979 లో వచ్చింది ఈ వినాయక విజయం సినిమా .
పౌరాణిక చిత్రాల కధలన్నీ కాస్తో కూస్తో మనకు తెలిసినవే . అయితే వాటిని సినిమాకు అనుగుణంగా కూర్చటంలోనే ఉంటుంది నైపుణ్యం .

Ads

గజాసుర వధ , మూషికాసుర సంహార ప్రయత్నం వంటి ఉప కధల సమాహారమే ఈ సినిమా . ఈ కధలన్నీ మనం వినాయక చవితి నాడు చదువుకునేవే . ఈ సినిమా విజయానికి స్క్రీన్ ప్లే , దర్శకత్వంతో పాటు సాలూరి వారి సంగీతం కూడా కారణమే . పాటలు పద్యాలు చాలా బాగుంటాయి . గాయనీగాయకులు కూడా చాలామందే ఉన్నారు . పాటల్ని కూడా చాలామందే వ్రాసారు .

దేవులపల్లి వారి ఎవరవయా ఎవరవయా పాట పార్వతీదేవి పాత్రను ధరించిన వాణిశ్రీ మీద ఉంటుంది . సుశీలమ్మ పాడారు . బాగా హిట్టయింది కూడా . సినిమా ప్రారంభమే శివపార్వతులను స్తుతించే బృంద నృత్యంతో ప్రారంభం అవుతుంది . నమో నమో తాండవకేళీ లోలా నమో నమో ఆశ్రిత జనపాలా పాట , చిత్రీకరణ చాలా బాగుంటాయి . వేటూరి వ్రాయగా బాలసుబ్రమణ్యం పాడారు .

అలాగే మరో పాట గజాసుర సంహారం సీన్లో ఉంటుంది . డూడూడూ బసవన్న భళిరా అందెల బసవన్నా పాట . కొసరాజు వ్రాయగా బాలసుబ్రమణ్యం , శైలజ , విజయలక్ష్మి శర్మలు పాడారు .

మ్రోగి మ్రోగి మూగవైనవేలా ఆ గంధర్వ వీణల తీగెలు , విలాసాల వేళ లాలించనీ సరాగాలతో మనోహర లీల , కిలకిల నగవుల జలకములాడగ జిలిబిలి పలుకుల వంటి చాలా శ్రావ్యమైన పాటలు , పద్యాలు , శ్లోకాలు ఉన్నాయి . సినిమాను పకడ్బందీగా తీసారని అర్థం అవుతుంది .

శివపార్వతులుగా కృష్ణంరాజు , వాణిశ్రీల జంట చాలా అందంగా ఉంటుంది . ఇద్దరూ చాలా బాగా నటించారు . ముఖ్యంగా వాణిశ్రీ … వినాయకునిగా మదనగోపాల్ , సుబ్రమణ్యునిగా రోహిణి , మూషికాసురినిగా సత్యనారాయణ , ఆయన భార్య ప్రియంవదగా ప్రభ , నారదుడిగా నాగరాజు , విష్ణువుగా రామకృష్ణ నటించారు . ఇతర పాత్రల్లో కె ఆర్ విజయ , పుష్పలత , పద్మనాభం , ధూళిపాళ , జయమాలిని , తదితరులు నటించారు .

జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మాత . సినిమా , కొన్ని సీన్లు మరియు పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . పౌరాణిక సినిమాలను ఇష్టపడే వారు తప్పక చూడవచ్చు . వినాయక చవితి నాడు ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది . వాణిశ్రీ భక్తులు ఎన్నిసార్లయినా చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?
  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…
  • అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? మోడీ ఏమైనా తప్పుచేశాడా..?
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!
  • నాగార్జునా… ఈ కల్యాణ్ అనే రూడ్ కేరక్టర్‌ను బయటికి పంపించగలవా..?
  • హిడ్మా..! తెలంగాణలో రోజుకూలీగా అనామకంగా బతికాడా..? దేనికి..?!
  • ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!
  • దైవశక్తులు Vs మంత్రశక్తులు… అందరిదీ ఇదే బాట… ఇదే జానర్…!!
  • కుటుంబ బాధితుడిగా… బేలగా రెబల్ స్టార్… ఆ పాత్రే తనకు నప్పలేదు…
  • జస్టిస్ సూర్యకాంత్..! సుప్రీంకోర్టు కొత్త సీజేఐ కొన్ని కీలక తీర్పులు ఇవీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions