Prasen Bellamkonda……….. ఒక జ్ఞాపకం
ఆమె కోసం కొన్న ప్రతి సినిమా టికెట్టూ ఆమెకు రాసిన ప్రేమలేఖే…. ఆమె సినిమా విడుదలైన రోజు వాలంటైన్స్ డేనే
అసలు నా తరానికి యవ్వనం వచ్చిందని తెలిసింది ఆమెను కలగన్నాకే
కోకమాటు సిగ్గు తడుస్తున్నపుడు ఎవడు చూసాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిని
సుభ్రమణ్నీ సుభ్రమ్మణ్నీ అని వసంతకోకిల గారాల రాగాలు తీస్తున్నపుడు ఎవడు చూసాడు మహానటుడు కమల్ ని
చాందినీ, లమ్హే, ఆకలిరాజ్యాల్లో ఆమెను చూసి ఈ అందం వెనుక ఇంత అభినయం ఉందా అని ఎవడున్నాడు పాదాక్రాంతం కాకుండా
వాననీటితో తడిపినపుడు సంబరపడ్డ హ్రుదయాలే కార్తీకదీపంలో పసుపునీటి స్నానం చేయిస్తే కోప్పడ్డాయి
బుర్రదో నడ్డిదో నీ అందాన్నిఏ ప్లాస్టిక్ సర్జరీ సవరించలేదమ్మా అని కోట్ల గుండెలు ప్రేమగా మందలించాయి
అద్భుతంగా నటించినా శ్రీదేవి మామ్ అవగలదా అని నా తరం గిలగిలలాడింది
పిక్కల పైకి చీర జరిపినపుడు తడబడ్డ గుండెలే థండర్ థైస్ అన్నపుడు గాయపడ్డాయి
మాట్లాడుతోంది దేహం గురించి గానే ఉంటుంది గానీ బాసూ ఇది అచ్చమైన అమలిన శ్రుంగారం
ఈ సిరి కచ్చితంగా స్వర్గానికి చెందిందే…
జస్ట్ షి హాల్టెడ్ ఫర్ ఎ బ్రేక్ జర్నీ హియర్
.
ఆర్జీవీ…
నువ్వేమీ విర్రవీగక్కర్లేదు.. నీకంటే తోపు ప్రేమికులం కుప్పలు కుప్పలుగా ఉన్నాం ఇక్కడ..
Ads
.
.
.
ఎవడ్రా అదీ …
తప్పుడు స్క్రోలింగ్ లూ తప్పుడు వాయిస్ ఓవర్లూనూ….
కల ఎక్కడైనా మరణిస్తుందా???
Share this Article