Subramanyam Dogiparthi….. మైరావణ + శ్రీకృష్ణ తులాభారం + శ్రీకృష్ణ పాండవీయం + శ్రీకృష్ణ రాయభారం = శ్రీకృష్ణ సత్య . అయితేనేం ! మూడు గంటలూ ఎన్టీఆరే కనిపించినా , బోర్ కొడితేనేగా …! రాముడిగా , వృధ్ధ రావణుడిగా , మహా విష్ణువుగా , కృష్ణుడిగా దర్శనమిస్తాడు ఈ సినిమాలో . యస్వీఆరుకి కూడా రెండు పాత్రలు . మైరావణుడు , దుర్యోధనుడు . ప్రముఖ దర్శకులు , NTR మెంటార్ కె వి రెడ్డి దర్శకత్వం వహించిన చివరి సినిమా . అంతే కాదు ; NTR- SVR లు కలిసి నటించిన చివరి పౌరాణిక చిత్రం కూడా ఇదేనట . (పింగళికి కూడా చివరి సినిమా..?)
ద్వాపర యుగంతో ప్రారంభమయి , త్రేతాయుగంలోకి వెళ్లి , మళ్ళా ద్వాపర యుగంలోకి వచ్చి ముగుస్తుంది సినిమా . శ్రీకృష్ణ తులాభారం సినిమాలో సత్యభామగా జమునని చూసి , ఈ సినిమాలో జయలలితను చూడటానికి నాలాంటి ప్రేక్షకులు కాస్త కష్టబడ్డారు . మొత్తం మీద NTR సినిమాను లాగిస్తాడు . పేరుకి కె వి రెడ్డి దర్శకుడయినా ఆయన మార్కు కన్నా NTR మార్కే ఎక్కువ కనిపిస్తుంది . మార్క్ ఎవరిదయినా దృశ్యశ్రవణ కావ్యమే ఈ సినిమా .
పెండ్యాల సంగీత దర్శకత్వంలో పాటలు , పద్యాలు అన్నీ లోపలా బయటా హిట్టయ్యాయి . అన్నీ కలిపి 36 . అలిగితివా , మీరజాలగలడా నా యానతి వంటి సూపర్ హిట్ పాటల్ని తిరగ వ్రాయించారు . అలుక మానవే చిలుకల కొలికిరో తలుపు తీయవే , మాట మీరగలడా నే గీచిన గీటు దాటగలడా పాటలుగా వినిపిస్తాయి . ప్రియా ప్రియా మధురం , కలగంటి కలగంటిని ఓ చెలియా పాటలు అందంగా ఉంటాయి . శ్రీరామ జయరామ జయజయ రామ పాట ఈరోజుకీ దేవాలయాల్లో కూడా వింటూ ఉంటాం .
Ads
24 రీళ్ళ , మూడు గంటటలకు పైన సినిమా అయినా భక్తితో , ఇష్టంగా చూసారు . 25 కేంద్రాల్లో యాభై రోజులు , ఏడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది . తర్వాత కాలంలో 1987 లో 18 రీళ్ళకు తగ్గించి మరలా రిలీజ్ చేసినా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు . రామాయణ , మహాభారతాల మీద మక్కువ , NTR మీద అభిమానం అలాంటివి .
గొప్ప దృశ్యశ్రవణ కావ్యం . యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . టి విలో వస్తే అసలు మిస్ కాకండి . థియేటర్ అయితే ఇంకా బెటర్ . నేనయితే కాలేజీ రోజుల్లోనే మూడు నాలుగు సార్లు చూసి ఉంటా .
సినిమాల్లో తనకు శ్రీకృష్ణునిగా గొప్ప ఇమేజి సంపాదించిపెట్టిన కె.వి.రెడ్డి సినిమాలు లేక ఇబ్బందిపడుతూండడంతో ఎన్టీయార్ ఆయనకు డబ్బుఇవ్వబోయారు… ఊరికే వచ్చే సొమ్ము తనకు వద్దని, ఏదైనా సినిమాకు దర్శకత్వం చేయించుకుని ఇస్తే పుచ్చుకుంటానని కేవీ రెడ్డి చెప్పారు… దాంతో తన స్వంత బ్యానర్లో శ్రీకృష్ణసత్య సినిమా కె.వి.రెడ్డికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి నిర్మించారు..
Share this Article