Subramanyam Dogiparthi… Dream girl హేమమాలిని అందమైన నాట్యం చేసిన రెండవ తెలుగు సినిమా 1971 లో వచ్చిన ఈ శ్రీకృష్ణ విజయం . నరకాసుర వధ అయ్యాక కృష్ణ సత్యభామలకు గౌరవార్థం ఏర్పాటు చేసిన ఇంద్ర సభలో రంభగా జోహారు శిఖిపించ మౌళీ అనే అద్భుతమైన పాటకు చక్కటి నాట్యం చేస్తుంది . మన పౌరాణిక సినిమాలలో సందు చిక్కితే చాలు ; ఇంద్ర సభ , నృత్యాలు . ఇంద్రుడికి మరో పని లేదన్నట్లుగా …
పౌరాణిక సినిమాలో కూడా జానపద సినిమాల్లాగా NTR కు మారువేషాలు , మారువేషంలో విలన్ని టీజ్ చేసే హీరోహీరోయిన్ల పాటలు అతకలేదు . సినిమా అందంగా ఉంటుంది , పాటలు బాగుంటాయి , NTR , SVR , నాగభూషణం , పద్మనాభం , కాంతారావు , అల్లు రామలింగయ్య , జయలలిత , దేవిక , జమున వంటి హేమాహేమీలందరూ పాత్రోచితంగా చక్కగా నటించారు , నృత్యాలు బాగుంటాయి . అయినా కమర్షియల్ డిజాస్టర్ . కేవలం కధ , స్క్రీన్ ప్లే కారణాలు అని నా అభిప్రాయం .
అయినను పోయి రావలె హస్తినకు అన్నట్లు , ఈ సినిమా ఫ్లాప్ సినిమా అయినా చూడాల్సిందే . అంత అందంగా ఉంటుంది . జయలలిత నృత్యాలు కాస్త పౌరాణిక బాణిలో ఉండకపోయినా కూడా బాగుంటాయి . Enjoyable . ఇంతకుముందు చూసి ఉండకపోతే , యూట్యూబులో ఉంది . వాచ్ లిస్టులో పెట్టేసుకొండి . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . తర్వాత టి విలో కూడా చూసా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Ads
Share this Article