Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణుడికి తొమ్మిదో భార్య వసుంధర అట… ప్రేక్షకులు ఫోఫోవోయ్ అనేశారు…

May 17, 2024 by M S R

Subramanyam Dogiparthi… Dream girl హేమమాలిని అందమైన నాట్యం చేసిన రెండవ తెలుగు సినిమా 1971 లో వచ్చిన ఈ శ్రీకృష్ణ విజయం . నరకాసుర వధ అయ్యాక కృష్ణ సత్యభామలకు గౌరవార్థం ఏర్పాటు చేసిన ఇంద్ర సభలో రంభగా జోహారు శిఖిపించ మౌళీ అనే అద్భుతమైన పాటకు చక్కటి నాట్యం చేస్తుంది . మన పౌరాణిక సినిమాలలో సందు చిక్కితే చాలు ; ఇంద్ర సభ , నృత్యాలు . ఇంద్రుడికి మరో పని లేదన్నట్లుగా …

పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించినా, NTR , SVR వంటి హేమాహేమీలు నటించినా, సినిమా ఫ్లాప్ అయింది . కారణం నిర్మాత M.S.రెడ్డియే … కధ , స్క్రీన్ ప్లే ఆయనవే … ఏ పురాణం నుండి ఈ కధను పట్టుకొచ్చారో కానీ , జనానికి ఎక్కలేదు . కృష్ణుడికి తొమ్మిదో భార్య వసుంధరను తెలుగు ప్రేక్షకులు ఆమోదించలేదు . అలానే , కాలయవనుడు , మహోదరుడు , పౌండ్రక వాసుదేవుడు పాత్రలు , వారి కధా ప్రేక్షకులకు తెలియకపోవటం కూడా కారణాలు అయిఉంటాయి . SVR ఈ సినిమాలో కూడా కాలయవనుడు , మహోదరుడు రెండు పాత్రల్లో నటించారు …

పౌరాణిక సినిమాలో కూడా జానపద సినిమాల్లాగా NTR కు మారువేషాలు , మారువేషంలో విలన్ని టీజ్ చేసే హీరోహీరోయిన్ల పాటలు అతకలేదు . సినిమా అందంగా ఉంటుంది , పాటలు బాగుంటాయి , NTR , SVR , నాగభూషణం , పద్మనాభం , కాంతారావు , అల్లు రామలింగయ్య , జయలలిత , దేవిక , జమున వంటి హేమాహేమీలందరూ పాత్రోచితంగా చక్కగా నటించారు , నృత్యాలు బాగుంటాయి . అయినా కమర్షియల్ డిజాస్టర్ . కేవలం కధ , స్క్రీన్ ప్లే కారణాలు అని నా అభిప్రాయం .

జయహే నవనీల మేఘశ్యామా , జేజేల తల్లికి జేజేలు మా గౌరమ్మ పెళ్ళికి బాజాలు , పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు , అనరాదే బాలా కాదనరాదే బేల , నా జీవితమూ నీకంకితమూ , నీవైనా చెప్పవె మురళీ , హాయి హాయి హాయి ఏమిటో ఈ హాయి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . పద్యాలు కూడా బాగుంటాయి . పెండ్యాల వారి సంగీత దర్శకత్వంలో ఎలాంటి పొరపాటు లేదు … (ఇష్టమొచ్చినట్టు పురాణాల్ని మార్చేయడం ఆనాటి నుంచీ ఉన్నదన్నమాట)… 

అయినను పోయి రావలె హస్తినకు అన్నట్లు , ఈ సినిమా ఫ్లాప్ సినిమా అయినా చూడాల్సిందే . అంత అందంగా ఉంటుంది . జయలలిత నృత్యాలు కాస్త పౌరాణిక బాణిలో ఉండకపోయినా కూడా బాగుంటాయి . Enjoyable . ఇంతకుముందు చూసి ఉండకపోతే , యూట్యూబులో ఉంది . వాచ్ లిస్టులో పెట్టేసుకొండి . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . తర్వాత టి విలో కూడా చూసా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసియాలోకెల్లా అత్యంత సంపన్న కార్పొరేషన్ పగ్గాలు… ఎవరీమె..?
  • నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…
  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…
  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions