.
Subramanyam Dogiparthi ……… 100% కోదండరామిరెడ్డి మార్క్ వినోదాత్మక సినిమా . అక్కినేని స్వంత బేనరుపై నిర్మించబడిన ఈ శ్రీరంగనీతులు సినిమా 1983 సెప్టెంబరులో విడుదలయి బాగా హిట్టయింది . 14 సెంటర్లలో వంద రోజులు ఆడింది .
ANR , శ్రీదేవిల జోడీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది . ఇద్దరూ కలిసి సినిమా అంతా చిన్న పిల్లల్లాగా అల్లరి చేస్తారు . చెంగుచెంగునా గంతులు వేస్తారు . ఇద్దరూ కలిసి సత్యనారాయణని టీజ్ చేసే సీన్లు సరదాగా ఉంటాయి . సత్యనారాయణ చాలా బాగా నటించారు . చిన్న పిల్లాడిలా బుంగ మూతి పెట్టి చక్కగా నటించారు .
Ads
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో కోదండరామిరెడ్డి సినిమాలో ఉన్న ఆరు డ్యూయెట్లనీ అందంగా చిత్రీకరించారు .అయిదు ANR , శ్రీదేవిల మీద , ఒకటి చంద్రమోహన్ , విజయశాంతిల మీద . ఈ సినిమాలో శ్రీదేవి అన్నీ ప్లెయిన్ కలర్ చీరెల్నే కడుతుంది . చాలా సింపుల్ గా , అందంగా చిత్రీకరించాడు దర్శకుడు .
తొంగి తొంగి చూడమాకు చందమామా నీ సంగతంత తెలుసు మాకు చందమామా పాట చాలా హుషారుగా ఉంటుంది . అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా , గూటికొచ్చిన చిలకా , పంచమి పూట మంచిదని పాటలు హిట్టయ్యాయి .
ఈ సినిమాలో ఓ పాటకు అప్పట్లో జనం భలే పేరడీ కట్టారు . అదేంటంటే కళ్ళు ఓకే పళ్ళు ఓకే ఒళ్ళు ఓకే అంటూ సాగుతుంది . ఈ పాటకు పేరడీ కట్టి పాడుకుంటూ ఈలేసుకుంటూ వెళ్ళారు తుంటరి ప్రేక్షకులు . నాకు చాక్లెట్ కావాలి అంటూ సాగే పాటలో చంద్రమోహన్ , విజయశాంతిలు హుషారుగా నటించారు . పాటల్ని ఆత్రేయ , రాజశ్రీ వ్రాసారు .
ఇతర ప్రధాన పాత్రల్లో పండరీబాయి , యస్ వరలక్ష్మి , నాగేష్ , రమాప్రభ , చలపతిరావు , ప్రభృతులు నటించారు . 1967 లో తమిళంలో వచ్చిన ఊటీ వరై ఉరావు సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ తమిళ పేరు తప్పుగా వ్రాసి ఉంటే క్షంతవ్యుడిని.
తమిళంలో శివాజీ గణేశన్ , కె ఆర్ విజయ , యల్ విజయలక్ష్మి , ముత్తురామన్లు నటించారు . 1972 లో హిందీలోకి కూడా ఆంఖ్ మిఛోలి టైటిలుతో రీమేక్ అయింది . రాకేష్ రోషన్ , భారతిలు నటించారు . చాలా సరదాగా ఉండే ఈ సినిమా తరచూ ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది .
అక్కినేని , శ్రీదేవి అభిమానులు చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో పెట్టేసుకోండి . మంచి టైం పాస్ సినిమా . శ్రీదేవి చాలా అందంగా ఉంటుంది . ANR , చంద్రమోహన్లు కూడా . Undoubtedly , an entertaining , romantic , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article