Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇన్నేళ్లుగా మహేష్‌ బాబుకు ఈత రాదు… 46 ఏళ్ల వయస్సులో నేర్చుకున్నాడు…

May 9, 2022 by M S R

సాధారణంగా సినిమాల్లో హీరోలు అంటేనే… సముద్రాలు ఈదేస్తారు, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కేస్తారు… ఒంటి చేత్తో మడత నలగకుండా వందలాది మంది రౌడీలను ఉతికేస్తారు… ఏదంటే అది చేసేస్తారు… అంత సుప్రీం స్టామినా అన్నమాట… తెర మీద వాళ్లకు తెలియని విద్య ఉండదు… కానీ ఒరిజినల్‌గా వాళ్లూ మనుషులే కదా… నానా బలహీనతలు ఉంటయ్… కాకపోతే ఎప్పుడూ తమలోని మైనస్ పాయింట్లు, భయాలు గట్రా బయట ఫోకస్ గాకుండా జాగ్రత్త పడతారు… అది తమ ఇమేజీకి నష్టం అనుకుంటారు…

అయితే… నటుడు మహేష్ బాబు కాస్త డిఫరెంట్ కేరక్టర్… కొన్నిసార్లు ఎవడో ఏదో అనుకుంటాడనే ఫీల్ పక్కకు పెట్టేస్తాడు… ఉదాహరణకు… సర్కారువారిపాట సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు జోరుగా సాగుతున్నయ్… యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూ చేసింది… ఆమె ఇంటర్వ్యూలు తెలుసు కదా… ఆమె టీవీ షోలలాగా కిట్టీపార్టీల్లాగే ఉంటాయి… అనుకోకుండా లాక్‌డౌన్‌ ఎలా గడిచిందనో, ఇంకేదో అడిగింది… ఈత నేర్చుకున్నాను అని మహేష్ బదులిచ్చాడు… అక్కడ కాసేపు మనం స్టక్కయిపోతాం…

నిజంగానా..? మహేష్‌కు ఈత రాదా..? ఇక్కడ ఈత వస్తుందా, రాదా అనేది కూడా అనేది కాదు అసలు విషయం… తను చెప్పుకోవడం… సో వాట్, ఈత రావాలని ఏముంది అంటారా..? చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఫోజులు కొట్టే చాలామంది హీరోలు ఇలాంటి విషయాల్ని కూడా చెప్పుకోరు, అదేదో చిన్నతనం అనుకుంటారు… కానీ మహేష్ కదా… చెప్పేశాడు…

నిజానికి ఈత ఫలానా వయస్సులోనే నేర్చుకోవాలి, ఫలానా వయస్సు తరువాత నేర్చుకోలేం అనేదేమీ ఉండదు… కాకపోతే చిన్నప్పుడు (అయిదేళ్ల తరువాత…) ఈత నేర్చుకోవడం ఈజీ… తరువాత వయస్సు పెరిగేకొద్దీ కొంచెం కష్టం… అఫ్‌కోర్స్, 80 ఏళ్ల వయస్సులో ఈత నేర్చుకుని, 90 ఏళ్ల వయస్సులోనూ ఈత కొట్టేవాళ్లు బోలెడుమంది…

mahesh

మన చిన్నప్పుడు ఊళ్లల్లో ఏ వ్యవసాయ బావిలోనో, కాలువలోనో, చెరువులోనో… వీపుకు ఏ ఎండిన ఆనపకాయ బుర్రనో కట్టేసుకుని ఈత నేర్చేసుకున్నాం… అదొక ఆట కూడా… ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో స్విమ్మింగ్ నేర్చుకోవడం ఓ ప్రయాస, వ్యయం… చాలామంది పిల్లలకు ఈత రాదు కూడా… వయస్సు పెరిగేకొద్దీ నీళ్లలోకి దిగడం అంటేనే ఓ అసౌకర్యభావన పెరిగి, ఇక శాశ్వతంగా ఈతకు దూరమైపోతారు… కానీ ఈత చాలా బెటర్… కానీ నీరు అంటే బెరుకును, భయాన్ని పోగొట్టుకుంటూ, నీళ్లను ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే… ఏ వయస్సయినా సరే ఈత నేర్చుకోవడానికి సూటబులే…

గంటసేపు రకరకాల వ్యాయామాలు చేయడం ఒకెత్తు అయితే పావుగంట ఈత దానికన్నా బెటర్… స్ట్రెస్ తగ్గిస్తుంది.., శ్వాస, రక్తప్రసరణలకు మంచిది… లైఫ్ స్టయిల్ వ్యాధులు పెరిగిపోతున్న వర్తమానంలో ఈత మంచి వ్యాయామం… జల ప్రమాదాల్లో ప్రాణరక్షకి… సో, వయస్సు ఈత నేర్చుకోవడానికి అడ్డంకి అనే భావనలున్నవాళ్లు వాటిని వదిలేయవచ్చు… 46 ఏళ్ల వయస్సులో కూడా, లాక్ డౌన్‌ను మహేష్ బాబు ఇలా సద్వినియోగం చేసుకున్నాడు… తను ఆల్‌రెడీ ఆహారం, వ్యాయామంలో చాలా డిసిప్లిన్‌డ్, స్ట్రిక్టు…

నోటిని కట్టేసుకోవడం అందులో ఒకటి… రెగ్యులర్ జిమ్… ఫిజిక్ కాపాడుకోవడానికి తప్పదు, పైగా సినిమా హీరో కాబట్టి, లుక్కు ఇంపార్టెంట్ కాబట్టి మరీ తప్పదు… పెరుగును సమీపించనివ్వడు… మైదా, ఫ్రైడ్ ఐటమ్స్ కూడా అంతే… వెరీ లిమిటెడ్, కాలిక్యులేటెడ్ కేలరీస్ మాత్రమే ఇన్‌టేక్ ఉంటుంది… చిన్నప్పుడు బొద్దుగా ఉన్న మహేష్ బాబు, ఈ 46 ఏళ్ల వయస్సులోనూ ఇంత యంగ్ లుక్ మెయింటెయిన్ చేస్తున్నాడంటే ఈ రిస్ట్రిక్షన్స్ కూడా కారణమే… అఫ్‌కోర్స్, ఆ కలర్, ఆ కనుముక్కు తీరూ గట్రా పుట్టుకతో వచ్చిన అదృష్టం…!! సుమ కూడా సేమ్ మహేష్ ఏజ్ కదా… తను కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉన్నదట, కానీ నీళ్లలో తేలడమే తప్ప ఇంకా ఈదటం రావడం లేదట..!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ఐదు తాజా పాజిటివ్ ట్రెండ్స్… ఓ కొత్త భారతాన్ని చూపిస్తున్నయ్…
  • ఛిఛీ… ఓ సమాజ ఉద్దారకుడిని లోకం అర్థం చేసుకునే తీరు ఇదేనా..?!
  • విధేయత..! రాజకీయాల్లో ఏమాత్రం అర్థం లేని ఓ డొల్లపదం అది..!!
  • హమ్మయ్య… RRR చూశాక ఆ చింత కూడా తీరిపోయింది… చదవాల్సిన రివ్యూ…
  • ఖర్మ కాలడం అంటే ఇదే… జైలులో సిద్ధూ సెల్‌మేట్ ఎవరో తెలుసా..?!
  • దీన్నే ‘డర్టీ జర్నలిజం’ అంటారా..? ఆంధ్రజ్యోతి ‘పె-ద్ద-లు’ చెప్పాలి…!!
  • కామెడీ షోయా..? డాన్స్ షోయా..? మ్యూజిక్ షోయా..? ఎవడుర భయ్ ప్లానర్..!!
  • సెట్లు లేవ్… మేకప్పుల్లేవ్… విగ్గుల్లేవ్… పాటల్లేవ్… బీజీఎంలో మూడే వాయిద్యాలు…
  • ఓహో… బీసీ కృష్ణయ్య ఎంపిక వెనుక అంత రహస్య ప్రణాళిక ఉందా..?!
  • రాముడి కాలంలో క్లోరోఫామ్, జువనైల్ యాక్ట్… ఓ పాన్ ఇండియా రైటర్ పైత్యం…

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions