ఉత్తర భారతమంతా హిందీ మాట్లాడతారు… దక్షిణ రాష్ట్రాల్లోనూ హిందీ చానెళ్లు చూసేవాళ్లకు కొదవ లేదు… దేశవ్యాప్త రీచ్… ఫుల్ యాడ్స్, డబ్బు, హంగామా, అట్టహాసం… మరి ఆ హిందీ వినోద చానెళ్లు రేటింగ్స్‌లో వెనకబడిపోవడం ఏమిటి..? అదీ ఆశ్చర్యం… తాజా బార్క్ రేటింగ్స్ జాబితా చూస్తే స్టార్‌మాటీవీ నంబర్ వన్ అని కనిపిస్తోంది…
ఛ, నిజమా అని ఆశ్చర్యపోకండి… అసలు రియాలిటీ షోలు పెద్దగా ఉండవ్… అంటే, నాన్-ఫిక్షన్ కేటగిరీలో పూర్… ప్రైమ్ టైం సీరియళ్లు మినహా మిగతావి పెద్దగా బాగుండవు… నిజానికి కొన్ని జీతెలుగు సీరియళ్లే పాపులర్… జబర్దస్త్, వావ్, క్యాష్, మన్నూమశానం రియాలిటీ షోలు ఈటీవీలోనే ఎక్కువ… మరి ఈ మాటీవీ అంత రేటింగ్స్ ఎలా సాధించింది..? ఏమో… ఆ రేటింగ్స్ లెక్కేసే బార్క్ వాడికే తెలియాలి…
RANK | CHANNELS | WEEKLY AMA’000 {AVG.} |
---|---|---|
1 | STAR Maa | 2541.6 |
2 | Sun TV | 2435.4 |
3 | STAR Plus | 2373.94 |
4 | STAR Utsav | 2193.61 |
5 | Dhinchaak | 1734.36 |
6 | STAR Vijay | 1609.13 |
7 | SONY SAB | 1507.11 |
8 | STAR Pravah | 1497.25 |
9 | Colors | 1479.37 |
10 | Zee TV | 1476.35 |
లిస్టు చూశారు కదా… స్టార్ ప్లస్ మూడో స్థానంలో నిలిచింది… తరువాత ప్లేసు స్టార్ ఉత్సవ్… స్టార్ విజయ్ ఆరో స్థానం… స్టార్ ప్రవాహ్ ఎనిమిదో స్థానం… జనం బాగానే చూసే సోనీకి ఏడో ప్లేసు… పాపులారిటీలో ఈ చానెళ్లతో పోటీ పడే కలర్స్, జీటీవీ 9, 10 స్థానాల్లో ఉన్నయ్… సన్ టీవీ రెండో స్థానం… అంటే… హిందీ చానెళ్లను తొక్కిపారేసి ఒక తెలుగు, ఒక తమిళ చానెల్ టాప్ టు ప్లేసులు ఆక్రమించాయా..?
Ads
నిజంగా ఈ రెండు ప్రాంతీయ చానెళ్ల రీచ్, పాపులారిటీ, రేటింగ్స్, క్వాలిటీ అంత అద్భుతమా..? టాప్ టెన్ జాబితా చూస్తే అయిదు స్టార్ గ్రూప్ చానెళ్లే కనిపిస్తున్నయ్… నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియాలో టీవీల వీక్షణం ఎక్కువ… పైగా నార్త్ ఇండియాలో హిందీకితోడు గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ వంటి రకరకాల ప్రాంతీయ భాషల్లో చానెళ్లు హిందీ చానెళ్ల రేటింగ్స్ లాక్కుంటూ ఉంటయ్, ఈలెక్కన హిందీ రేటింగ్స్ మరీ పాన్ ఇండియా రేంజ్ ఏమీ కాదు… సో, తెలుగు తమిళ ప్రేక్షకులు టీవీలను వదలడమే లేదన్నట్టు…
RANK | CHANNELS | WEEKLY AMA’000 {AVG.} |
---|---|---|
1 | STAR Maa | 2361.81 |
2 | Zee Telugu | 1322.9 |
3 | ETV Telugu | 1025.84 |
4 | Gemini TV | 740.78 |
5 | Gemini Movies | 546.22 |
ఏపీ, తెలంగాణలో ప్రేక్షకాదరణ వివరాలు చూస్తే… జీతెలుగు రెండో స్థానం… కానీ మాటీవీకి చాలా దూరంలో ఉండిపోయింది… అఫ్కోర్స్, పోటీదారు మాత్రం ఈ చానెలే… నానాటికీ తీసికట్టు అన్నట్టుగా ఈటీవీ మూడో స్థానంలోనే ఆగిపోయింది… ఈటీవీ న్యూస్, జబర్దస్త్ లేకపోతే ఈమాత్రం రేటింగ్స్ కూడా వచ్చే చాన్స్ లేదు… క్రియేటివిటీ లెవల్స్ అడుగంటినయ్… కొత్త సినిమాలు ఉండవ్… సీరియళ్లు వెరీ పూర్… జెమిని టీవీ సంగతేమిటి అంటారా..? దాని యాజమాన్యమే దాన్ని వదిలేసింది… ఇదీ బార్క్ రేటింగుల తాజా సంగతి…
Share this Article