మీ ఊళ్లో రెండు దుకాణాలున్నయ్… ఎవరి గిరాకీ వారిదే… కానీ హఠాత్తుగా ఓ దుకాణదారుడు కొన్ని సరుకుల రేట్లు తగ్గించాడు, ప్యాకేజీలు పెట్టాడు, బోలెడు ఆఫర్లు ఇస్తున్నాడు… జనం అటువైపు ఎగబడ్డారు… మరి రెండో దుకాణదారుడు ఏం చేయాలి..? ఈగలు తోలుకోవాల్సిందేనా..? సదరు రాయితీల దుకాణదారుడి దుర్బుద్ధి తెలుస్తూనే ఉంది… ఒక్కసారి పోటీ లేకుండా పోయాక, గుత్తాధిపత్యం వచ్చాక ఇక దోపిడీ మొదలుపెడతాడు… రెండు చానెళ్లున్నయ్… ఒక చానెల్ చీప్ ప్యాకేజీలు ఆఫర్ చేస్తుంది… మరో చానెల్‌ను దెబ్బతీస్తుంది, తరువాత యాడ్ టారిఫ్ దంచుకుంటుంది…
రెండు టెలికాం కంపెనీలున్నయ్… ఒకడు చాలా చీప్ ప్యాకేజీలు, స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఆఫర్ చేస్తున్నాడు, ఈ దెబ్బకు ఇంకొకడు ఢమాల్ అన్నాడంటే ఇక అప్పుడు అసలు దోచుకోవడం స్టార్టవుతుంది… ఇది సమర్థనీయమేనా..? ఈ రెండో కంపెనీ ఏం చేయాలి మరి..? సేమ్, ఒక పత్రిక సగం కవర్ ప్రైస్‌కే పాఠకుడికి ఇస్తుంది, వందో రెండొందలో కడితే ఏడాది మొత్తం ఫ్రీ అంటుంది, దానికి అదనంగా గిఫ్టు స్కీములు పెడుతుంది, పోటీపత్రిక గనుక దెబ్బతింటే ఇక యాడ్స్ టారిఫ్ పెంచేసి, కుమ్మేస్తుంది… మరి బాధిత పత్రిక ఏం చేయాలి..?
వ్యాపారం అనే కోణంలో చూస్తే చాలామందికి ఇందులో తప్పేముంది..? ఇది బిజెనెస్ టాక్టిస్ కదా అంటారు… కానీ తప్పు… తప్పుకాదు, నేరం… గుత్తాధిపత్యం నిరోధించడానికి కాంపిటీషన్ కమిషన్ ఉంది ప్రత్యేకంగా… దానికి ఓ చట్టం ఉంది… వ్యాపారాల్లో గానీ, ఇతర రంగాల్లో గానీ ఈరకమైన అక్రమ ప్రలోభ వ్యూహాలు అమలు చేస్తే శిక్షలు కూడా ఉన్నయ్… చాలామంది లాయర్లకే తెలియదు ఈ సంగతి… తాజా ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం…
Ads
కేరళలో ఆసియానెట్ డిజిటల్ నెట్‌వర్క్ ఏం చేసిందంటే… స్టార్ ఇండియా, డిస్నీ బ్రాడ్‌కాస్టింగ్, ఆసియానెట్ స్టార్ సంస్థలపై కాంపిటీషన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది… ఈ స్టార్ చానెళ్లు అక్రమంగా ఆధిపత్య ధోరణుల వైపు వెళ్తోందని ఫిర్యాదు సారాంశం… దీనికి తక్కువ ధరలతో, బొకేలా కొన్ని చానెళ్లను బంచ్ ఆఫర్ ఇస్తోందనీ, ఇది వివక్షాపూరితం అనీ దాని ఆరోపణ… ఈ ఫిర్యాదు జినైన్ అని కమిషన్ కూడా అభిప్రాయపడింది…
ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి, రెండు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కమిషన్ డీజీపీని ఆదేశించింది… (ఫిబ్రవరి 28 నాటి తీర్పు)… అంటే… ఈ బంచ్ చానెల్స్ బొకేలు, తక్కువ ప్రైసింగ్ వంటి ప్రలోభ వ్యూహాలతో సదరు స్టార్ టీవీ ఎంతమేరకు రీచ్, కన్స్యూమర్ బేస్ పెంచుకోగలిగిందో గణాంకాలతో సహా డీజీపీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది… ఒకవేళ సదరు టీవీ సంస్థ అక్రమంగా ఆధిక్యాన్ని సంపాదించుకునే ఎత్తుగడల్ని ప్రయోగించినట్టు రుజువయితే కఠిన చర్యల్ని ట్రాయ్‌కు రెకమెండ్ చేసే అవకాశం ఉంది… (ఎంఆర్‌టీపీ చట్టం ఒకటి విడిగా ఉంది, అయితే అది కోరల్లేని పాము… కానీ ఈ కాంపిటీషన్ యాక్ట్ కఠినమైంది… అదీ రెంటి నడుమ ప్రధాన తేడా…)
Share this Article