Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్చ్… ఒక్కరూ రేఖ బుగ్గల్ని ప్రేమించడం లేదు… ఈ నేతలకు ఎంత వివక్ష..?!

December 21, 2021 by M S R

ఏది టేస్ట్..? హేమమాలిని చెప్పింది కరెక్టే… నీయంకమ్మా, నీదేం టేస్టురా భయ్ అంటోంది ఆమె… నిజమే కదా… 73 సంవత్సరాల ఓ వృద్ధ నటి బుగ్గల్ని ఉదాహరణగా తీసుకున్నాడంటే వాడిది ఏం టేస్ట్..? ఎంతెంతమంది కొత్త నున్నటి బుగ్గల స్టార్స్ వచ్చారు, వాళ్లను వదిలేసి, ఇంకా హేమమాలిని బుగ్గల్నే ఆరాధిస్తున్నాడంటే వాడిది ఏం టేస్ట్..?……….. ఇలాంటి కామెంట్స్ ట్రోలవుతున్నయ్.. విషయం అర్థం కాలేదు కదా… మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోల్చాడు… అదీ చాలామందికి జీర్ణం కాలేదు… అంతెందుకు ఫాఫం… ఆ హేమమాలినికే సిగ్గనిపించింది… అరె, అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ అలా పోల్చాడు సరే, ఇక అదే ట్రెండ్ కంటిన్యూ కావాలా..? నా బుగ్గల్ని కాపాడుకోవాలి అంటూ వడలిపోయిన మొగ్గల్ని, అదేలెండి, బుగ్గల్ని తడుముకుంటూ బాధపడిపోయింది…

hema

ఇది ఆమె మొహం రీసెంట్ ఫోటోయే… అరె, ఎవరెవరో మామూలు వ్యక్తులు అలా మాట్లాడితే వోకే గానీ, ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు అలా మాట్లాడటం ‘సరైన టేస్టు’ కాదు అని ఖండించేసింది… (మనసులో ఆనందమే ఉండొచ్చుగాక)… నిజమే కదా మరి… శివసేన వాళ్లు మరీ ఠాక్రే కాలంలోనే ఉండిపోయారు, వాళ్లు ఏ విషయంలోనూ ఆ కాలాన్ని దాటి రాలేరు… రారు… లేకపోతే ఏమిట్రా నాయనా..? అప్పుడెప్పుడో లాలూ ఏదో అన్నాడు అంటే, తన వయస్సు, తన యవ్వనకాలం, తన అభిమానం వేరు… అది హేమయుగం…

Ads

#WATCH "A trend of such statements was started by Lalu Ji years ago and many people have followed this trend. Such comments are not in a good taste," says BJP MP Hema Malini on Maharashtra minister Gulabrao Patil comparing roads to her cheeks pic.twitter.com/SJg5ZTrbMw

— ANI (@ANI) December 20, 2021

అఫ్ కోర్స్, ఇప్పటికీ ఆమె తన దేహారోగ్యాన్ని కాపాడుకునే తీరు గ్రేట్… ఈరోజుకు వేదిక మీద డాన్స్ చేయగలదు… ఆ అందం, దైహిక ఆరోగ్యం ఆమెకు దేవుడిచ్చిన వరం… అభినందించాలి మనం… కానీ ఇప్పటికీ నాయకులు ఆమె బుగ్గలతో రోడ్లను పోల్చడం మాత్రం అన్యాయమే… నిజానికి ఫాఫం, ఆ శివసేన కాలం చెల్లిన అభిరుచిని చూసి జాలిపడాలే తప్ప నిందించలేం కదా… పైగా ఆమెను తనేమీ కించపరచడం లేదు… కాంప్లిమెంట్స్‌గా స్వీకరించాలి ఆమె… 73 ఏళ్ల వయస్సులో కూడా ఆమె బుగ్గలు ఈరోజుకూ ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు కూడా అభినందించే స్థాయిలో ఉన్నాయంటే… ఆమెకు ఎంత ఆనందం..? అటు రేఖ, ఇటు నువ్వు… భారతీయ వెండితెర నమ్మలేని, అపూర్వమైన అందాలు తల్లీ… రేఖ బుగ్గలతో పోల్చకుండా నీ బుగ్గల్నే ఇప్పటికీ కోట్ల మంది ప్రేమిస్తున్నారంటే ఎంత సౌభాగ్యం..?

rekha

హేమమాలిని ‘నా బుగ్గల్ని ఇకనైనా వదిలేయండి బాబోయ్’ అన్నట్టుగా స్పందించిన తీరుతో శివసేన ‘అత్యంత కీలకనేత’ సంజయ్ రౌత్ స్పందిస్తూ… ‘అరె, ఇందులో ఆమెను అగౌరవపరిచింది ఏముంది..? ఆమె అంటే మాకు ఫుల్లు గౌరవం’ అని వ్యాఖ్యానించాడు… కానీ మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలీ దశాంకర్‌కు ఇవేమీ నచ్చలేదు… ‘‘ఇదేందిర భయ్, తప్పు కదా, నువ్వు వెంటనే క్షమాపణ చెప్పకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటా’’ అని హెచ్చరించింది… తరువాత ఈ రచ్చ దేనికిలే అనుకున్న సదరు హేమ బుగ్గల ప్రేమిక మంత్రి మీడియాముఖంగా క్షమాపణలు చెప్పాడు… ప్చ్, రాజీపడిపోయాడు… చెప్పనేలేదు కదూ… గత నెలలో రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ లీడర్ రాజేంద్ర సింగ్ గుడా కూడా ఇలాగే మాట్లాడుతూ ‘‘మా ఏరియా రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గలు’’ అన్నాడు… అప్‌డేటెడ్ కేరక్టర్… అదొక టేస్టు… అవునూ, ఈ రోడ్లను సినిమా స్టార్ల బుగ్గలతో పోల్చడం ఏమిట్రా..?! మీ దుంపతెగ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions