Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!

May 14, 2025 by M S R

.

ఏపీకి సంబంధించిన వార్తే… ఆంధ్రప్రభ క్లిప్పింగ్… నిజమేనో కాదో తెలియదు గానీ, నిజమైతే కూటమి ప్రభుత్వ ముఖ్యులు తెలుగు జాతికి వివరణ ఇచ్చుకోవాలి ఓసారి…

వార్తలో విషయం ఏమిటంటే..? ‘‘ఇకపై ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉండదు, మొత్తం ఇంగ్లిష్ మీడియమే… తెలుగు మీడియంలో బోధన ఉండదు, పరీక్షలు ఉండవు… ఇంగ్లిషుతోపాటు తెలుగు మీడియం కూడా కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు…

Ads

పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లిష్ మీడియమే దిక్కు… ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు కొంత వెసులుబాటు ఇచ్చారు గానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి, పరీక్షలు రాయాలి, పాఠాలు చెప్పాలి…’’

school

…. ఎస్, ప్రపంచం ఓ గ్లోబల్ విలేజీగా మారింది… ఈ దేశంలోనే సరిపడా కొలువులు అసాధ్యం… పొట్ట చేత్తో పట్టుకుని, అవకాశాలు ఎక్కడుంటే ఆ దేశానికి ఎగిరిపోతున్నారు… మరి ఇంగ్లిష్ తప్పనిసరి కదా… అదే సమయంలో మాతృభాషను కూడా రక్షించుకోవాలంటే ఓ లాంగ్వేజీ సబ్జెక్టుగా తెలుగును బోధిస్తూ, మిగతా సబ్జెక్టులన్నీ ఇంగ్లిషులో బోధించాలని కదా చాలామంది చెబుతున్నది…

మరి గతంలో జగన్ దశలవారీగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి… మన బడి పేరిట స్కూళ్ల ఇన్‌ఫ్రా మెరుగుపరుస్తూ వెళ్తున్నప్పుడు ఇదే జనసేన, ఇదే టీడీపీ గగ్గోలు పెట్టాయి కదా… తెలుగును చంపేస్తారా అని గొంతెత్తాయి కదా… మరి మీరు చేస్తున్నదేమిటి..?

తప్పని కాదు, రియాలిటీని అర్థం చేసుకోకుండా కేవలం పొలిటికల్ ప్రయోజనాల కోసం గాయిగత్తర లేపడం… తీరా కుర్చీ ఎక్కాక మీరూ అదే బాటలో వెళ్లడం… దీన్ని రాజకీయం అంటారు గానీ రాజనీతిజ్ఞత అనరు…

అబ్బే, ఈరోజుల్లో తాత్కాలిక రాజకీయ లబ్దికి ఏవేవో మాట్లాడేయడం, తరువాత ప్లేటు ఫిరాయించడం అలవాటే కదా అంటారా..? అవును, అదీ నిజమే… అప్పుడొక మాట ఇప్పుడొక మాటకు కనీసం వివరణలు కూడా వర్తమాన రాజకీయాల్లో అవసరమే లేదు… అదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?
  • Awarapan-2 … అనూహ్యంగా హిట్ – భారీగానే వసూళ్లు !!
  • Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?
  • ఓడలు బళ్లు – బళ్లు ఓడలు … వెస్టిండీస్ – బంగ్లాదేశ్ మంచి ఉదాహరణ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions