పురుషాధిక్యత…! స్త్రీపై వివక్ష…! కాలం ఎంతో వేగంగా మారుతోంది, ఆడ-మగ నడుమ తేడాలు చెరిగిపోతున్నయ్, అంతరాలు లేని ఆధునిక సమాజంలోకి ప్రవేశించేశాం అని మనం అనుకుంటున్నాం… కానీ అదేమీ లేదు… మనం ఇంకా పాత రోజుల్లోనే ఉన్నాం… పోనీ, మార్పులో వేగం లేదు అనుకుందాం… ఓ తాజా సర్వే కూడా అదే చెబుతోంది…
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఓ సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ సర్వే నివేదికను రిలీజ్ చేసింది… హవ్ ఇండియన్స్ వ్యూ జెండర్ రోల్స్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ అనే అంశం మీద 30 వేల మందిని 2019-20 నడుమ సర్వే చేశారు… రీసెంటుగా మొన్నటి రెండో తారీఖున ఆ నివేదిక విడుదలైంది… నిజానికి ఈ అమెరికా సర్వే సంస్థల సర్వేలు, నివేదికలు కాస్త నమ్మబుల్ అనిపించవు… కానీ ఇదేదో కాస్త ఆలోచనాత్మకంగా కనిపిస్తోంది…
Ads
ఈ సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..?
- భార్య తప్పనిసరిగా తన భర్తకు ఎప్పుడూ విధేయురాలిగా ఉండాలని ప్రతి పది మంది భారతీయుల్లో 9 మంది భావిస్తున్నారు…
- విశేషం ఏమిటంటే… 61 శాతం మహిళలు కూడా అదే ఆలోచనల్లో ఉన్నారు…
- పేరెంట్స్ పోషణ బాధ్యత కొడుకులదే అని ప్రతి పది మందిలో నలుగురు బలంగా నమ్ముతున్నారు… నో, నో, కూతుళ్లకు కూడా ఆ బాధ్యత ఉందని చెబుతున్నవాళ్లు జస్ట్, 2 శాతం మందే…
- మరో విశేషం ఏమిటంటే…? ఆడపిల్లయితేనే, మగపిల్లవాడయితేనేం అని ప్రస్తుత తరం భావిస్తున్నా సరే… తప్పనిసరిగా ఓ కొడుకు ఉండాలని 94 శాతం కోరుకుంటున్నారు… కూతురు కూడా ఉండాలని 90 శాతం మంది కోరుకుంటున్నారు… బెటర్…
- కొన్ని పరిస్థితుల్లో… లింగ నిర్ధారణను బట్టి గర్భస్రావం తప్పేమీ కాదని 40 శాతం మంది ఇప్పటికీ చెబుతున్నారు… నో, నో, అబార్షన్లు అస్సలు అంగీకారయోగ్యం కాదని 42 శాతం మంది చెబుతున్నారు… బెటర్…
- కొద్ది ఉద్యోగాలే అందుబాటులో ఉన్నప్పుడు… మహిళలకన్నా పురుషులకే ఎక్కువ అవకాశాలు, హక్కులు ఉండాలని 80 శాతం మంది కోరుకుంటున్నారు… ఎందుకు..? పురుషాధిక్యత… పురుషుడే అల్టిమేట్… ఈ భావన వల్ల..!
- పిల్లల పోషణ బాధ్యత తల్లిదండ్రులిద్దరిదీ అని 62 శాతం మంది చెబుతుండగా… అదంతా మహిళలే చూసుకోవాలని 34 శాతం మంది చెబుతున్నారు…
- కుటుంబానికి అవసరమైన డబ్బు సంపాదన బాధ్యత పురుషుడితే అని 43 శాతం మంది చెప్పారు… ఏతావాతా తేలిందేమిటీ అంటే… ఇంకా భారతీయ సమాజం లింగసమానత్వం దిశలో చాలా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని..!!
Share this Article