అబ్బే, మజ్లిస్‌తో పొత్తు లేదు మాకు అని టీఆర్ఎస్…. నో, నో, టీఆర్ఎస్తో మాకేం సోపతి, చాన్సే లేదు అంటూ మజ్లిస్… మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో మస్తు చిలకపలుకులు పలికినయ్… మజ్లిస్‌తో అంటకాగుతున్నందుకు జనం కోపగిస్తారనేది టీఆర్ఎస్ భయం… హిందూ వోటు సంఘటితమై బీజేపికి మద్దతునిస్తారనే సందేహం… అందుకే ఆ అబద్ధాలు… సరే, ఎన్నికలన్నాక ఇలాంటి కథలెన్నో పడతాయి పార్టీలు, వోటర్లను మాయ చేయడమే కదా ఎన్నికలంటే…!! పోలింగ్ ముగియగానే మళ్లీ అలుముకున్నారు… అసలు తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్, టీఆర్ఎస్ సయామీ కవలల టైపు… నిజామాబాద్ వంటి చోట్ల కూడా ఇదే బంధం కదా… గ్రేటర్‌లోనూ అంతే… మజ్లిస్ మద్దతు తీసుకుని మరీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని గెలుచుకుంది… (కారు ఎవరిదైతేనేం, డ్రైవింగు మాదే అని మజ్లిస్ నేతలు అప్పుడప్పుడూ చెబుతుంటారు కదా… అంతే…) సరే, ఇదంతా రాజకీయాల్లో కామనే అనుకుందాం… కానీ టీఆర్ఎస్ ఎంచుకున్న కులసమీకరణాలు కరెక్టేనా..?
మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి… ఆమె ఎవరు..? పార్టీ సీనియర్ నాయకుడు కేకే బిడ్డ… జన్మతః కాపు… కేకే అంటే టీఆర్ఎస్ హైకమాండ్‌కు పెద్దగా ఇష్టం ఉందో లేదో తెలియదు గానీ… ఈమధ్య బీజేపీ కాపు బేస్డ్ పాలిటిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తోంది… కాపుల్ని సంఘటితం చేస్తూ, బీసీ కార్డు ఉపయోగించుకుంటోంది… పవన్ కల్యాణ్‌తో దోస్తీ కూడా ఆ దిశలోనిదే… ఈ స్థితిలో విజయలక్ష్మి ఎంపిక బీజేపీ కాపు అస్త్రానికి పొలిటికల్ విరుగుడు అనుకుందాం… అయితే ఆమె మెట్టింది రెడ్డి వారింట్లో… అంటే టెక్నికల్‌గా రెడ్డి… డిప్యూటీ మేయర్ కూడా రెడ్డి… అంటే రెండు పోస్టులూ రెడ్లకే ఇచ్చినట్టు అనుకోవాలా..? ఎందుకో ఈ ఈక్వేషన్ కులరాజకీయాల్లో ఇమిడేలా కనిపించడం లేదు… నో, నో, ఆమెను కేకే బిడ్డగానే పరిగణనలోకి తీసుకోవాలి, సో, బీసీలకే మేయర్ పోస్టు ఇచ్చినట్టుగా లెక్కేసుకోవాలా..?
Ads
కొన్నేళ్లు అమెరికాలో ఉండి వచ్చిన ఆమె కేకే బిడ్డగానే సుపరిచితం అందరికీ… అయితే పీజేఆర్ బిడ్డ విజయారెడ్డికి తనకు మేయర్ చాన్స్ రానందుకు తీవ్ర అసంతృప్తి ఉండటమూ సహజమే… తండ్రి మరణం తరువాత తను సొంతంగా లీడర్‌గా ఎదిగింది… నిలబడింది… తనకంటూ కొంత కేడర్‌ను సంపాదించుకుంది.,. ఈసారి బాగా ఆశలు పెంచుకుంది, తీరా విజయలక్ష్మిని టీఆర్ఎస్ ఎంచుకోవడంతో విజయారెడ్డి నిరాశకు గురైంది… అర్థం చేసుకోవచ్చు… ఐనా మేయర్ పదవి మీద అందరికీ ఆశలుంటయ్, అందరికీ ఇవ్వలేరు కదా… పార్టీ ఈక్వేషన్లు వేరుంటయ్… సాధారణంగా గ్రేటర్ కార్పొరేటర్లు ఒకసారి ఎన్నికైతే చాలు, ఇక ఎవరి పైరవీలు, ఎవరి కంట్రాక్టులు వాళ్లు… పెద్దగా పార్టీ వర్క్ పట్టించుకునేదే ఉండదు… ఏ పార్టీవారయినా సరే అంతే…! మరి మజ్లిస్-టీఆర్ఎస్ సోపతిని మొన్నటి గ్రేటర్ ఎన్నికల్లో బాగా ఎక్స్పోజ్ చేసి, రాజకీయంగా లాభపడటానికి ప్రయత్నించిన బీజేపీ… ఇప్పుడు తమ కార్పొరేటర్ల ద్వారా టీఆర్ఎస్- మజ్లిస్ సయామీ కవల రాజకీయాల్ని జనంలోకి తీసుకుపోతూ, మరింత బలపడటానికి ప్రయత్నిస్తుందా..?! మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తుందా..?!
Share this Article