బిగ్ బి… అంటే బిగ్ బి… అంతే… వేరే సుదీర్ఘ వివరణలు, విశ్లేషణలు అక్కర్లేదు… ఎనభై సంవత్సరాల ఈ వృద్ధ నటుడే ఈరోజుకూ ఈ దేశం అమితంగా అభిమానిస్తున్న నంబర్ వన్, సూపర్ స్టార్… వేరే ఏ కుర్ర హీరోలు, ఉర్రూతలూగించే హీరోలు, తన సమకాలీనులు… ఎవరూ జాబితాలో లేరు… అమితాబ్ మీన్స్ అమితాబ్, దట్సాల్…
మూడ్ ఆఫ్ ది నేషన్ ముక్తకంఠంతో అమితాబే స్టార్ స్టార్ అని ఘోషించింది… గ్రేట్… ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో ఈ రేంజ్ సాధించినవాడు లేడు, ఇక ఉండడేమో… బాలీవుడ్ బ్యూటీయే అది… దేశమంతా వాళ్ల సినిమాలు చూస్తారు… బ్రహ్మాండమైన రీచ్ ఉంటుంది… ఈమధ్య కొంత దెబ్బతినొచ్చుగాక… కానీ హిందీ సినిమాలే విస్తృతంగా చూడబడేవి… నిజం… కొన్నాళ్లుగా కొన్ని ప్రాంతీయ సినిమాలు హిందీ సినిమాలు దాటేసి పాపులర్ అయిపోయి, డబ్బు మింట్ చేసుకోవచ్చుగాక… కానీ అవి తాత్కాలికమే… టైంపాస్ పల్లీ బఠానీలు…
బాలీవుడ్ స్టార్లనే దేశంలో అత్యధిక సంఖ్యాకులు ఇష్టపడతారు… సౌత్ ఇండియా ప్లస్ నార్త్ ఇండియా… అన్ని ప్రాంతాలూ కలిసి సౌత్ ఇండియాకు సంబంధించి రజినీకాంత్‌ను మాత్రం టాప్ ఫైవ్‌లో ఉంచారు… అమితాబ్ ఫస్ట్ ప్లేస్ కాగా… అక్షయ్ కుమార్ సెకండ్ ప్లేస్… పఠాన్ షారూక్ ఖాన్ మీద ఇటీవల ఎంత వ్యతిరేకతను వైరల్ చేస్తున్నా సరే, తనను మూడో ప్లేసులో ఉంచారు ప్రేక్షకులు…
Ads
ఫోర్త్ ప్లేస్ సల్మాన్ ఖాన్, ఫిఫ్త్ ప్లేస్ రజినీకాంత్… అంతే ఇక… మమ్ముట్టి, మోహన్‌లాల్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, యశ్ ఎట్సెట్రా ఎవరూ లేరు… నిజానికి వీళ్లెవరికీ పాన్ ఇండియా స్టేటస్ రాదు… పుష్పతో బన్నీ, ఆర్ఆర్ఆర్‌తో రాంచరణ్, జూనియర్, బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్‌తో యశ్… ఇవి మెరుపులు… ఇవి స్థిరంగా వెలగాలంటే అంత ఈజీ కాదని ఈ సర్వే ఫలితం చెబుతోంది… ప్రభాస్‌కు మాత్రం చాన్స్ ఉంది… అలాంటి ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి… ( నా ఫ్యాన్స్ కోరిందే నేను చేస్తాను అనడు అమితాబ్… స్టీరియోఫోనిక్ బిల్డప్పుల జోలికి పోడు… మంచి భిన్నమైన సినిమాలు, పాత్రలతో తన ఆత్మను సంతృప్తిపరుచుకుంటాడు… తన కెరీర్‌కు కూడా సార్థకత… తను హీరో, తను నటుడు, తను ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా…)
వెగటు, వెకిలి, అశ్లీల, అసభ్య దుస్తులు, నడన, స్టెప్పులతో పఠాన్‌లో చిరాకు పుట్టించింది దీపిక… అంతకుముందు ఇంకేదో సినిమాలో కూడా బోల్డ్ యాక్షన్… ఐనా సరే, ఈ దేశం దీపిక పడుకోన్‌ను నంబర్ వన్ ఫిమేల్ స్టార్‌గా అభిమానిస్తోంది…
టాప్ ఫైవ్‌లో ఆమెది నెంబర్ వన్ ప్లేసు కాగా నంబర్ టు కత్రినా కైఫ్, నంబర్ త్రి ప్రియాంక చోెప్రా… నిజానికి ఈమధ్య ఈ ఇద్దరి సినిమాల్లేవు… ఐనా వాళ్ల పాపులారిటీకి వచ్చిన ఢోకా ఏమీ లేదు… సేమ్, అనుష్క శర్మ నుంచి హిట్ సినిమా లేదు కొన్నాళ్లుగా… బట్ ఫోర్త ప్లేస్… మూడునాలుగేళ్లుగా తన నటనతో, పాపులారిటీతో అదరగొడుతున్న ఆలియా భట్‌కు అయిదో ప్లేస్ కట్టబెట్టారు ప్రేక్షకులు… ఇంట్రస్టింగే…
మరో ఇంట్రస్టింగ్ సర్వే అంశం ఏమిటంటే… ఓటీటీ విభాగం..! ఇందులో టాప్ స్టార్ అభిషేక్ బచ్చన్… హహహ… ముసలాయనేమో ఓవరాల్‌గా నెంబర్ వన్… తన కొడుకేమో ఓటీటీ నంబర్ వన్… తరువాత స్థానాల్లో వరుసగా మనోజ్ వాజపేయి, పంకజ్ త్రిపాఠీ, బాబీ డియోల్, నవాజుద్దీన్ సిద్దిఖి ఉన్నారు… ఓటీటీలోనే ఫిమేల్ స్టార్స్ రేటింగ్ పరిశీలిస్తే వెటరన్ హీరోయిన్ రవీనా టాండన్ ఫస్ట్ ప్లేస్… తరువాత వరుసగా సుస్మితా సేన్, హుమా ఖురేషి, పూజా భట్, రాధికా ఆప్టే ఉన్నారు… ఈ అయిదుగురిలో ముగ్గురు వెటరన్సే…!!
Share this Article