మా టీవీకి మస్తు రీచుంది… బార్క్ రేటింగ్స్‌ను లేపగలం, దింపగలం, తొక్కగలం అనే బలుపు భావనలు స్టార్ మాటీవీకి ఏమైనా ఉంటే… అవన్నింటినీ బద్దలు కొడుతోంది బిగ్‌బాస్ సీజన్… చివరకు వచ్చింది కదా, రేపోమాపో ఆదిరెడ్డిని, కీర్తిని లేదా ఇనయను, కీర్తిని లేదా ఇనయను ఆదిరెడ్డిని బయటికి పంపించేసి, టాప్ ఫైవ్ ఎవరో తేల్చేసే సమయం కూడా వచ్చేసింది కదా అనుకుంటుంటే… రేటింగ్స్ ఏమైనా పిసరంత పెరిగాయా అని చూస్తే మరింత షాక్… నిజం, మాటీవీ రేటింగ్స్ భ్రమలన్నీ పగులగొట్టింది ఈసారి బిగ్‌బాస్ సీజన్…
దీనికి అత్యధిక శాతం బాధ్యత వహించాల్సింది బిగ్‌బాస్ టీమే… కావాలని చేస్తున్నారా అనే సందేహాలుకూడా కలుగుతున్నయ్… పరమ చెత్తగా టాకిల్ చేస్తున్నది టీం ఈసారి… ముంబై టీం కూడా వదిలేసినట్టుంది… వర్మ చెప్పాడని ఇనయను ప్రమోట్ చేసుకోవడం తప్ప ముంబై టీం కూడా పెద్దగా ఇన్వాల్వ్ అవుతున్నట్టు లేదు… (ఇక చాల్లే అనుకుని ఇనయను ఈసారే ఎలిమినేట్ చేశారని ఓ వార్త…) సరే, ముందుగా గతవారం బార్క్ హైదరాబాద్ రేటింగ్స్ చూద్దాం…
సండే 5.15, శనివారం 4.44, గురువారం 2.44, శుక్రవారం 2.31, సోమవారం 2.22, మంగళవారం 2.14, బుధవారం 2.04… మొత్తానికి షో లేవడం లేదు, పైగా మరీ రెండు రేటింగ్స్‌కు పడిపోయిది ఓరోజు… పరమ దరిద్రమైన బిచ్చపు రేటింగ్స్ ఇవి…
Ads
గతంలో బిగ్‌బాస్ ఆసక్తిగా చూసేవాళ్లు ప్రేక్షకులు… టైంపాస్… ఆ దిక్కుమాలిన సీరియళ్లకన్నా ఇది ఎంతోకొంత బెటర్… కానీ ఈసారి వీక్ డేస్ మానేసి, వీకెండ్ నాగార్జున షో చూడటం మొదట్లోనే అలవాటైంది… రోజూ ఆకర్షించి కట్టేసే టాస్కులు లేవు, కొత్తదనం లేదు, కంటెస్టెంట్లు కూడా వీక్… చివరకు వీకెండ్ షోస్ కూడా అధ్వానంగా మారడంతో ఇప్పుడు నాగార్జున షో కూడా చూడటం మానేస్తున్నారు ప్రేక్షకులు… ఇది నాగార్జునకు కూడా చిన్నతనమే. ఎటొచ్చీ తనకే అర్థమవుతున్నట్టు లేదు…
కొత్త టాస్కులు, గేమ్స్ గట్రా ఏమీ లేవు సరికదా… ఇప్పుడు మరో దరిద్రాన్ని తలకెత్తుకున్నారు… ప్రైజ్ మనీని 50 లక్షలని ప్రకటించి, అందులో ఎంత కోద్దాం అన్నట్టుగా మొదట్లో వ్యవహరించారు… అదొక పిచ్చి ప్రయత్నం… ఇప్పుడు మళ్లీ ప్రైజ్ మనీకి ఎంతోకొంత యాడ్ చేస్తామంటూ పిచ్చి పిచ్చి టాస్కులు పెడుతున్నారు కంటెస్టెంట్లకు… బోర్, బోరర్, బోరెస్టు…
ఇప్పుడు మరో తిక్కతనం… ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు తిట్టేసుకున్న సంఘటనలను వేరే కంటెస్టెంట్లతో రిపీట్ చేయించారు… అంటే కొత్తగా యాక్ట్ చేయించారు… అవి ఏవో హైలైట్స్ అన్నట్టుగా… ఆ సంఘటనలే దిక్కుమాలినవి… వాటిని మళ్లీ ప్రేక్షకులు కొత్త కంటెస్టెంట్ల ఓవరాక్షన్‌తో భరించాలా..? క్రియేటివ్ టీం సభ్యులారా… అరె, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారుర భయ్ మిమ్మల్ని ఈసారి… అసలు స్టార్ మాటీవీకి రియాలిటీ షోలు చేతనవుతాయా..? గతంలో మ్యూజిక్, కామెడీ, డాన్స్ వంటి అంశాలన్నింటిలోనూ చేతులు, మూతులు కాల్చుకుంది… ఇదొక్కటి కాస్త బెటర్ అనుకుంటే… దీన్ని కూడా మూసీలో కలిపేశారు…!!
Share this Article