ఫ్యాన్స్ అంటే అంతే… లాజిక్కులకు, వాస్తవాలకు అందదు ఆ అభిమానం… ఉదాహరణకు సమంత రుత్ ప్రభు ఫ్యాన్స్… రెండు మత పద్ధతుల్లో నాగచైతన్యతో పెళ్లయింది… నాగార్జునకు ఇష్టముండే చేశాడా, చైతూ ఒత్తిడి మేరకు తప్పనిసరై తలవంచి అంగీకరించాడా వేరే విషయం… పెళ్లయ్యాక కూడా ఆమె స్వేచ్ఛావర్తన, పోషించిన కొన్ని పాత్రల తీరుతో అక్కినేని కుటుంబం కోపగించింది… చివరకు చైతూ కూడా ఆగ్రహం చెందాడు…
ఠాట్, నువ్వూ వద్దు, నీతో సంసారమూ వద్దు అని తరిమేశాడు… నువ్వేమిటోయ్ నన్ను వెళ్లమనేది, నేనే నిన్ను వదిలేస్తున్నానుపో, అసలు మీ కుటుంబంలో పెళ్లిళ్లన్నీ ఇదే తరహా అనుకుంటూ ఆమే చైతూను వదిలేసింది… అలా పెళ్లి పెటాకులైంది… ఆమెకు సంకెళ్లు విడిపోయాయి… మరింత స్వేచ్ఛ పొంది, ఊ అంటావా మావా ఊఊ అంటావా అంటూ నర్తించసాగింది… ఆమె దురదృష్టం కొద్దీ అదేదో వ్యాధి ఆమెను పట్టుకుంది… పీడిస్తోంది… సరే, ఆ వ్యాధి కూడా ఆమె సినిమా ప్రమోషన్లకు పనికొస్తోంది, అది వేరే కథ…
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… చైతూ నుంచి విడిపోయే ముందు ఆమె తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ నుంచి ‘అక్కినేని’ అనే పదం తీసిపారేసింది ముందుగా… అప్పుడే అందరికీ అర్థమైపోయింది, ఈమె తన పెళ్లిబంధానికి తిలోదకాలు ఇస్తోందని… చివరకు అదే జరిగింది… కానీ ఫ్యాన్స్ అంత తేలిగ్గా ఆమెకున్న అక్కినేని అనే తోకను ఇప్పటికీ కత్తిరించడం లేదు, సారీ, వదిలించడం లేదు…
Ads
అనుకోకుండా ఫేస్‌బుక్ ‘యు మే లైక్ ఇట్’ అంటూ సమంత ఫ్యాన్స్ పేజీని సజెస్ట్ చేసింది… కానీ సదరు పేజీకి ఉత్త సమంత అనే పేరు గాకుండా సమంత అక్కినేని అనే పేరుంది… అబ్బో, సమంతను జీవితాంతం అక్కినేని ఇంటి కోడలిగానే ఉంచేస్తున్నట్టున్నారు అని నవ్వుకుంటూ ఓసారి చెక్ చేస్తే… అక్షరాలా 290 గ్రూపులు, పేజీలు కనిపించాయి… ఓ మూణ్నాలుగు ఎక్కువే ఉండొచ్చు, ఖచ్చితంగా లెక్కించలేకపోయా…
అలాగే ఆయా గ్రూపులు, పేజీల సభ్యులను కూడా ఉజ్జాయింపుగా లెక్కకడితే ఏకంగా 48 లక్షల పైచిలుకు సంఖ్య తేలింది… ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చు… అంటే, దాదాపు అరకోటి మంది సభ్యులు ఈరోజుకూ ఆమెను అక్కినేని కుటుంబసభ్యురాలుగానే పరిగణిస్తున్నారన్నమాట… వావ్, ఏం అభిమానంరా బాబూ… పైగా బోలెడు ఎక్స్‌పోజింగ్ ఫోటోలు, పోస్టులు కూడా… అక్కినేని అనే పదం లేకుండా ఉన్న ప్యూర్ సమంత రుత్ ప్రభు గ్రూపులు, పేజీల (అన్నీ ఫ్యాన్స్ క్రియేట్ చేసినవే…) లెక్క జోలికి పోలేదు… అవి లెక్కకుమిక్కిలి… ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాలు కూడా లెక్కేస్తే … అవిక అనంతం..!!
Share this Article