.
ఇవేం బాండింగ్స్… ఇవేం ప్రేమలురా బాబూ అన్నట్టుంది ఈసారి బిగ్‌బాస్ సీజన్ యవ్వారం… కామనర్స్ అగ్నిపరీక్షలు, ఫైర్‌స్టామ్స్ పేరిట మరీ వైల్డ్ కేరక్టర్స్ ఎంట్రీలు… అన్నీ వికటించడమో, విఫలం కావడమో…
ఫైర్ స్టామ్స్ ఔట్ కదా… ఇక కామనర్స్‌లో దివ్య, పడాల, డెమోన్ మిగిలారు… పడాల టాప్ ఫైవ్‌లో ఉంటాడేమో బహుశా… తన పీఆర్ టీమ్ బాగా కష్టపడుతోంది… రీతూ, డెమోన్ ప్రేమబంధం తెగిపోక తప్పదేమో వచ్చేవారం… మరి ఇప్పుడు..?
Ads
తనూజతో గిల్లికజ్జాలు కంటిన్యూ కావాలని బిగ్‌బాస్ టీమ్ భావిస్తే… దివ్య సేఫ్… లేదంటే కంటిన్యూ… దివ్య లీస్ట్ వోటింగు దాదాపు ప్రతి అనఫిషియల్ వోటింగుల్లో… ఆ తరువాత డేంజర్ జోన్‌లో ఉన్నది సంజన… ఒకవేళ దివ్యను సేఫ్ చేయాలనుకుంటే సంజన ఔట్ తప్పదు…
ప్రతి సీజన్‌లో కంటెస్టెంట్ల నడుమ లవ్ ట్రాకులు పెట్టడం బిగ్‌బాస్ టీమ్‌కు అలవాటే… ఈసారి కూడా డెమోన్, రీతూ నడుమ క్రియేట్ చేశారు, వాళ్లు కూడా కథ రక్తికట్టిస్తున్నారు కానీ ఈమధ్య ఏదో బెడిసికొట్టింది ఆ ఇద్దరి నడుమ…
కానీ అర్థం కానిదల్లా… బిగ్‌బాస్ టీమ్ చెత్తా క్రియేషన్ ఏమిటంటే… తనూజ- భరణి… దివ్య- భరణి నడుమ బాండింగ్… తనూజ నాన్నా అని పిలుస్తుంది, వోకే… ఆమె గేమ్ ప్లాన్ పూర్తిగా డిఫరెంట్… ఏ కంటెస్టెంట్‌తో ఎలా ఉండాలో సపరేట్ వ్యూహాలుంటాయి… ఎక్కడ ఎమోషన్ పండించాలో కూడా తెలుసు… కానీ తనూజతో భరణి క్లోజ్‌గా మాట్లాడితే దివ్యకు ఎందుకు కోపం రావాలి..? ఎందుకు తనూజ మీద పడి అరవాలి..?
అదీ మామూలుగా కాదు… అదేదో భరణితో ఇంకేదో బంధం అన్న తరహాలో… ఇదే సాకుతో ప్రతిసారీ ఆమె తనూజతో గొడవ పెట్టుకుని మరీ, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఎక్కువ ఫుటేజీ కోసం విఫల ప్రయత్నం చేస్తోంది… పైగా ఆమె టోన్ ఇరిటేటింగ్ కూడా… మీదిమీదికి వచ్చేస్తుంటుంది దాడి చేస్తోందా అన్నట్టుగా…

ఆమె తల్లి కూడా ఫ్యామిలీ వీక్‌లో ఏదో కథ అల్లింది… వెరసి ఇవి నాన్న- కూతురు బంధమా..? అన్న- చెల్లి బంధమా.? తెలియక ప్రేక్షకులు జుట్టు పీక్కోవడమే..! భరణి ఒకసారి ఎలిమినేట్ అయిపోయి, మళ్లీ లోపలకు ఎంట్రీ ఇచ్చాడు… ఆ ఇద్దరు ఆడాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో, మాటిమాటికీ తననెందుకు లాగుతున్నారో తెలియక ఎడ్డిమొహం వేస్తున్నాడు పాపం…
నిజానికి ఫ్యామిలీ వీక్ తరువాత పెద్దగా గొడవలు ఉండవు ఏ బిగ్‌బాస్ సీజనైనా..! పెద్దగా టాస్కులు, గేములు కూడా ఉండవు సాధారణంగా..! కానీ ఈ సీజన్‌లో కంటిన్యూ అవుతున్నాయి… మళ్లీ తనూజ కెప్టెన్ పోస్టుకు కంటెస్ట్ చేయాలో వద్దో ఓ గొడవ… తరువాత కెప్టెన్ కావడం కోసం పోటీ…!
ఏమిటోరా బాబూ… ప్రోమో చూస్తే నాగార్జున తనూజకు క్లాస్ పీకుతున్నట్టుగా… ఆమెదే తప్పు అని తోటి కంటెండర్లతో చెప్పిస్తున్నట్టుగా ఉంది… కానీ ప్రేక్షకులకు మాత్రం దివ్యదే తప్పు అన్నట్టుగా కనిపించింది… హేమిటో… అంతా బిగ్‌బాస్ మాయ..!!
Share this Article